మంగళవారం, అక్టోబర్ 15, 2013
ఈరోజు అక్టోబర్ 15, 1918 శ్రీ షిర్డీ సాయిబాబా గారు పరమపదించిన రోజు. భారతీయ గురువు మరియు సాధువు, ఫకీరు శ్రీ షిర్డీ సాయిబాబా ఇతని అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులూ సాధువుగా నమ్ముతారు. ఇతని జీవిత నడవడిలో, భోధనలలో రెండు మతాలను అవలంభించి, సహయోగము కుదర్చడానికి ప్రయత్నించాడు. సాయిబాబా మసీదులో నివసించాడు, గుడిలో సమాధి అయ్యాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.
బాబా చెప్పిన వాటిలో మరి కొన్ని ప్రసిద్ధ వాక్యాలు – “నేనుండగా భయమెందులకు?"అతనికి మొదలు లేదు... తుది లేదు ". తన భక్తులకు బాబా పదకొండు వాగ్దానాలు చేశాడు.:
షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.
మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది.
నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను.
నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవుసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
నాసమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.
నా సమాధినుండి నేను మాట్లాడుతాను.
నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను.
మీరు నావంక చూడండి. నేను మీవంక చూస్తాను.
మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను.
నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.
సోమవారం, అక్టోబర్ 14, 2013
దసరా పండుగను మనము విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ జరుపుకున్నాము. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ గా వస్తున్నది .
విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజుగా వస్తున్నది. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనేరాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. ప్రజలందరూ ఆనందంగా ఈపండుగ జరుపుకుంటున్నారు. రావణాసురుని దహనం కూడా జరుపుతారు, మరియు దండియా నృత్యం చేస్తారు. ఈ దసరా బాగా జరుపుకొండి. ఈ దసరా సందర్బముగా అందరికి నా తరుపునా దసరా శుభాకాంక్షలు.
శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది.
ఆమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రాకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము. ఇఛ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. ఆమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దెపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అథిష్టాన దేవత. శ్రీ రాజ రాజేశ్వరీ దేవి స్తోత్రము.
శ్రీ రాజ రాజేశ్వరీ దండకము. శ్రీ మన్మహా దేవురాణీ నతేంద్రాణి రుద్రాణి శర్వాణి కళ్యాణి దాక్షాయణీ శూలపాణీ పృధుశ్రోణి ధూమ్రాక్ష సంహరిణీ పారిజాతాంచిత స్నిగ్దవేనీ లసత్కీర వాణీ భవాటనీ శివా శాంకరీ రాజరాజేశ్వరీ గౌరి శాకంభరీ కాళికం కాళి రాజీవనేత్రీ సుచారిత్రి కళ్యాణగాత్రీ మహాదైత్య జైత్రీనగాధీ శపుత్రీ జగన్మాత లోకైక విఖ్యాత గంధర్వ విద్యాధ రాదిత్య కోటీ ర కోటి స్ఫురద్ద వ్యమాణిక్య దీప ప్రభాత్యుల్ల సత్పాదకంజాత కేయూర హరాంగ దాది జ్వలధ్భూ షణవ్రాత కౌమారి మహేశ్వరీ నరాసింహీ రమా వైష్ణవీ భైరవీ దుర్గ కాత్యాయనీ పార్వతీ నీదు సామర్ధ్య మెన్నంగ బ్రహ్మదులున్ శేషభాషాదులున్ జాల రేనెంత వాడన్ ప్రశంసింపనే తజ్జ గజ్జాల సంరక్షణారంభ సంరంభ కేళీ వినోదంబులన్ గల్గి వర్తింతు వెల్లప్పుడో యాది శక్తీ పరంజ్యోతి నారాయణీ భద్రకాళీ శుక శ్యామలా భ్రామరీ చండికా లక్ష్మి విశ్వేశ్వరీ రాజరాజేశ్వరీ శాశ్వతైశ్వర్య సంధాయినీ యంచు నిన్నెంత యస్సన్నుతుల్సేయు లోకాళికి న్సంత తాఖండ దీర్ఘాయురారోగ్య సౌభాగ్య సంసిద్ద గావింతు వశ్రాంతమున్ రక్తబీజాది దైతేయులన్ ద్రుంచి బృందారక శ్రేణి రక్షింత్షు ఇవీ వెప్పుడున్ నార దాగస్త్య శాండిల్య మాండవ్య మైత్రేయ జాబాలి కణ్వాది మౌనీంద్రు లత్యంత నిష్ఠాగరిష్టాత్ములై హృత్స రోజంబులన్ ధ్యానముల్ సేయుచున్ జంద్ర ఖండావతం సాభ వద్దవ్య రూపంబు బ్రహ్మాండ భాండంబులన్నిండి వల్గొందు నేతత్ప్ర పంచంబు నీ వైవ్ర వర్తింతువీ సూర్యచంద్రాదులున్ భుజలాకాశ వాతాగ్ని జీవాత్మలున్నీవ నీకంటె వేరైన దింతైనయున్ లేదు యుష్మత్కటాక్షార్షు లైనట్టి వారల్కడున్ ధన్యులై మాన్యులై పూజ్యులై గుణ్యు లైయందురీ ధాత్రిలో నేను మూడుండ గర్వాధ రూడుండ దుశ్చిత్తుడన్ మత్తుడన్ జ్ఞాన హీనుండ దీనుండనే జేయు నేరంబుల న్గాచి రక్షింపగా భారమే తల్లి సద్భక్త మందార వల్లీ నమశ్చంద్ర బింబాననోత్కుండలా త్రాత భూమండలా సూచ్య చంద్రోజ్జ్వలా కామదా చండికా నమస్తే నమస్తే నమస్తే.
ఆదివారం, అక్టోబర్ 13, 2013
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ