ఈరోజు అక్టోబర్ 15, 1918 శ్రీ షిర్డీ సాయిబాబా గారు పరమపదించిన రోజు. భారతీయ గురువు మరియు సాధువు, ఫకీరు శ్రీ షిర్డీ సాయిబాబా ఇతని అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులూ సాధువుగా నమ్ముతారు. ఇతని జీవిత నడవడిలో, భోధనలలో రెండు మతాలను అవలంభించి, సహయోగము కుదర్చడానికి ప్రయత్నించాడు. సాయిబాబా మసీదులో నివసించాడు, గుడిలో సమాధి అయ్యాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.
బాబా చెప్పిన వాటిలో మరి కొన్ని ప్రసిద్ధ వాక్యాలు – “నేనుండగా భయమెందులకు?"అతనికి మొదలు లేదు... తుది లేదు ". తన భక్తులకు బాబా పదకొండు వాగ్దానాలు చేశాడు.:
షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.
మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది.
నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను.
నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవుసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
నాసమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.
నా సమాధినుండి నేను మాట్లాడుతాను.
నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను.
మీరు నావంక చూడండి. నేను మీవంక చూస్తాను.
మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను.
నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.