- శ్రీ మహాలక్ష్మీ నారాయణ స్వరూపిణియైన "తులసి" యొక్క మూలంలో సర్వతీర్ధాలు, మధ్యభాగమందు సమస్త దేవతలు, తులసిమొక్క పైభాగమున సర్వవేదాలతో కొలువైవున్న తులసి మాతకు ముందుగా నమస్కరించుకుని, అంతటి పూజ్యనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర-తులసి ప్రాశస్త్యమును గూర్చి, మన పురాణములలో ఎన్నో కధలు వున్నాయి. "బ్రహ్మవైవర్తపురాణ"మందు గల తులసి వృత్తాంతము ఇలా ఉన్నది. ధర్మధ్వజుడు, మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతియైన కుమార్తై కలిగినది. వారు ఆ బిడ్డకు "బృంద" అను నామకరణము చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగిరి. ఆమెకు వివాహవయస్సురాగనే శ్రీహరిని వివాహమాడతలచి బదరికాశ్రమము జేరి బ్రహ్మనుగూర్చి ఘోరముగ తపమాచరించినది. బ్రహ్మదర్శన మిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పుమనగా "నేను రాధాశాపముతో నున్న రుక్మిణిని, నాకు శ్రీకృష్ణుడే భర్తగా పొందుటకు"- వరమీయమని ప్రార్ధించినది. అందులకు బ్రహ్మ ! నీ కోరిక తప్పక నెరవేరగలదు. కాని! ముందుగా గోలోకనివాసి సుదాముడే ముందుగా నీకుభర్త కాగలడు, అనంతరమే నీవు కోరిన వాడే నీకు పతియగును అని వరమిచ్చి అంతర్ధానమయ్యెను. ఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుదాముడు పుష్కరకాలము శాపకారణముగా భూలోకమున శంఖచూడుడై జన్మించి తపమాచరించసాగెను. అతని తపస్సునకు మెచ్చి బ్రహ్మ ఏమివరము కావాలో కోరుకోమన్నాడు. అంత శంఖ చూడుచు "లక్ష్మీభూలోకమున పుట్టినదట! నాకామెతో వివాహాము చేయించమని వేడుకొనెను" బ్రహ్మ 'తధాస్తు' అని పలికి ఆమె బదరికాశ్రమమున నున్నది. ఆమె నీకు తప్పక లభ్యముకాగలదు అని యంతర్ధానమందెను. అనంతరము శంఖ చూడుడు బృందవాద ప్రతివాదములను గమనించి అప్పుడు వార్కి మరల బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభీష్టములు నెరవేరుటకు వార్కి వైభవముగా వివాహము గావించెను. ఇక శంఖచూడునకు లక్ష్మీయంశతో నున్న భార్య లభ్యమగుసరికి! అష్ట్తెశ్వర్యము లతో తులతూగుచూ అతిసమయము పెంచుకుని స్వర్గాధిపత్యము పొందగోరి దేవరాజ్యమును కొల్లగొట్టి; దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయుటయే కాకుండా; పరమేశ్వరుని చెంతకేగి, శివా! నీ భార్య సుందరాంగి. అమెను నాకు వశ్యురాలును చేయుము లేనిచో యుద్ధమునకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధము చేయసాగెను. వెంటనే శ్రీహరి వారిని సమీపించి "శివా! వీడు అజేయుడు అగుటకు కారణం! ఈతని భార్య మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య భంగము నేనాచరించదను. నీవు వీనిని వధించుము." యని యుక్తి చెప్పెను. అనంతరము మాయా శంఖచూడుని వేషము ధరించి యున్న శ్రీహరిని చూచి బృంద తన భర్తే వచ్చినాడని భ్రమించి! ఆతనికి సర్వోపచారములుచేసి శ్రీహరి చెంతకు చేరగానే! ఆమె పాతివ్రత్యము భగ్నమగుట గ్రహించి శివుడు శంఖచూడుని సంహరించగా! నాతడు దేహమును విడచి "సుదాముడై" గోలోకమునకు పోయెను. బృంద తన ఎదుట ఉన్నది మాయా శంఖచూడుడని గ్రహించి శ్రీహరిని "శిలారూప మందుదువుగాక" యని శపించగా! తిరిగి ఆమెను నీవు "వృక్షమగుదువుగాక" యని శపించెను. ఆవిధంగా శ్రీహరి గండకీనదిలో సాలగ్రామ శిలగాపుట్టి; బృంద తులసీ వృక్షమై పోయి ఇద్దరూ ప్రపంచముచే పూజనీయస్వరూపములు పొందినట్లుగా బ్రహ్మవైవర్త పురాణగాధ ద్వార విదతమగుచున్నది.వృక్షాలన్నిటియందు తులసి శ్రేష్ఠమైనది, శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది. "తులసిపూజ" తులసీ స్త్రోత్రం చదవడం, తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున జల్లుకోవడం, తులసీవనమును పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించుట ఎంతో! పుణ్యప్రదమైనవి. గోదాదేవి తులసీవనంలోనే అయోనిజగా విష్ణుచిత్తునింట వెలసి శ్రీరంగనాధుని ఇల్లాలయింది.వశిష్ఠాది మునిగణముచే ఎన్నో విధములుగా స్తోత్రపూర్వకముగా శ్రీహరి తులసీ వనమందు పూజలందుకొని నన్ను "కార్తీక శుద్ధద్వాదశి" నాడు విశేషించి ఎవరు బూజచేయుదురో! అట్టివారి సమస్తయొక్క పాపములు అగ్నిలోపడిన మిడుతలు వలె భస్మమయి వారు తప్పక నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేసెనట!శ్లో|| తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంచ్చిన:
యదిచ్చేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యం బ్రాహ్మ్ణ్తణ్తెస్సహ
విష్ణో : ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకధా
ద్వాదశ్యాం శ్రవణాత్తస్యా: పునర్జన్మ న విద్యతే.విష్ణు సాన్నిధ్యముగోరి విష్ణుదేవునకు యేమాత్రమైన ప్రీతి జేయవలయునునని తలచేవారు తులసీ వ్రతమహాత్మ్యము తప్పక వినవలయును. అందునా! ఆ వ్రత కధను "క్షీరాబ్ధిద్వాదశి" రోజున తులసీ కధ వినువార్కి, చదువువార్కి, పూర్వజన్మ కృతమైన దు:ఖములన్నియు తొలగిపోయి విష్ణులోకమును పోందుదురు, అని శంకరునిచే "తులసి" కొనియాడబడినట్లు చెప్పబడినది. అట్టి తులసీ బృందావన మందు ఉసిరిమొక్కతో కలిపి "తులసీధాత్రీ సమేత శ్రీమన్నారాయణుని" ఈ కార్తీక ద్వాదశినాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొనబడినది. మరియు అట్టి తులసీ దళములకు "నిర్మాల్యదోషం" పూజలో ఉండదని కూడా చెప్పబడినది.
కావున! మన హిందూమతంలో "తులసి" ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్ధానాన్ని పొందింది. తులసిమొక్క హిందువులకు పూజనీయమైనది. కావున హిందువులు ప్రతిఇంటా తులసి మొక్కను కోటలో పెంచి పూజించుట మనం చూస్తూ ఉంటాము. ఇక పట్టణావాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకుని, చిన్నచిన్న కుండీల్లోనో, డబ్బాల్లోనో పెంచి పూజిస్తూ ఉంటారు. కావున 'తులసి' ఉన్న ఇల్లు నిత్యకళ్యాణము పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది.
ఇక ఈ తులసిని వైద్యపరంగా కూడా చూస్తే! ఆయుర్వేద శాస్త్రంలో 'సప్తతులసి-భరతవాసి' అంటూ తులసిని ఏడువిధాలుగా వివరించబడినది. అవి: 1.కృష్ణ తులసి 2. లక్ష్మీతులసి 3.రామతులసి 4. నేల తులసి 5. అడవి తులసి 6. మరువ తులసి 7.రుద్రతులసిగా వివరుస్తారు. వైద్యపరంగా వాటి అన్నిటికి ఎన్నో అమోఘమైన ఔషధగుణాలతో కూడి ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతోంది. ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు (కోటలోవికాదు) విడిగా పెంచుకున్న మొక్కలనుండి నమలి మింగితే వార్కి బుద్ధిశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మరియు అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని; ఇలా ఎన్నో విశేష గుణాలను చెప్తారు.ఇక దాని కాండముతో తయారుచేయబడ (తులసిమాల)కు ఇటు ఆధ్యాతికపరంగా అటు ఆరోగ్యపరంగా ఎన్నోలాభాలు ఉన్నాయిట ! కావున ఈ "క్షీరాబ్దిద్వాదశి" వ్రతాన్ని ఆచరించి ఇటు ఆధ్యాత్మిక సంపదతో పాటు ఆరోగ్య భాగాన్ని పొందుదాం!
గురువారం, నవంబర్ 14, 2013
బాలల దినోత్సవ శుభాకాంక్షలు .
ఈ రోజు పిల్లలకు చాలా ప్రత్యేకమైన రోజు. ప్రపంచవ్యాప్తముగా బాలల దినోత్సవంను ప్రతి సంవత్సరం నవంబర్ 20 న జరుపుకుంటారు. మన దేశములో మాత్రం నవంబర్ 14వ తేదిన జరుపుకుంటున్నాము. మనకు ఎంతో ఇష్టమైన చాచానేహృగారి జన్మదినోత్సవాన్ని మనము జాతీయ బాలలదినోత్సవం గా జరుపుకుంటున్నాము. ఈరోజు కోసం మనం ఎంతగానో ఎదురు చూస్తూవుంటాం. ప్రతీస్కూల్లో ఈ బాలలదినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటాం.
నెహ్రూగారు నవంబర్ 14, 1889 వ సంవత్సరం నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో, సంపన్న న్యాయవాది అయిన మోతిలాల్ నెహ్రూమరియు స్వరూప్ రాణిల ప్రధమసంతానంగా నెహ్రూ జన్మించారు. .భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో రెక్కలు విప్పుకున్న భారత స్వతంత్ర పోరాటంలో అయన చురుకైన సభ్యుడు.నెహ్రూ మరియు అయన ఇద్దరు సోదరీమణులు-విజయలక్ష్మి మరియు కృష్ణ-ఒక పెద్ద భవనమైన ఆనంద్ భవన్ నందు, ఆ రోజులలో శిష్ట వర్గం అవసరమని భావించిన, ప్రబలమైన ఆంగ్లసాంప్రదాయ పద్ధతులలో, పెంచబడ్డారు. వారికి హిందీ, సంస్కృతాలు నేర్పించడంతో పాటు భారతదేశంకు చెందిన సారస్వత గ్రంధాలలో పునాది వేయబడింది. భారత స్వాతంత్ర సంగ్రామ ప్రముఖ నాయకుడైన నెహ్రూ,స్వంతంత్ర భారతదేశ మొదటి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీచే ఎన్నుకోబడ్డారు.పిమ్మట 1952 లో భారతదేశ మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినపుడు ప్రధాని అయ్యారు.అలీనోద్యమ స్థాపకుల్లో ఒకరైన నెహ్రూ యుద్ధానంతర కాలఅంతర్జాతీయ రాజకీయాలలో ముఖ్య వ్యక్తి. ఆయనను పండిట్ నెహ్రూ అని,("పండిట్",సంస్కృతం,"పండితుడు", గౌరవసూచకము )భారతదేశంలో పండిట్ జీ (జీ, మర్యాద పూర్వక పదం)అని పిలిచేవారు.15 ఆగష్టు 1947 లో భారత దేశం స్వాతంత్రం సంపాదించినపుడు న్యూఢిల్లీ లో స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసే గౌరవం దక్కిన ఏకైక భారతీయుడు నెహ్రూ.పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, స్వేచ్ఛా వాద సుగుణాల పట్ల గుర్తింపుతో పాటు పేద మరియు అణగారిన వర్గాల పట్ల వ్యాకులత, నెహ్రూ తన విధానాలు రూపొందించటంలో దిశానిర్దేశం చేసి భారతదేశ సిద్ధాంతాలను నేటికి కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇవి ఆయన సామ్యవాద మూలాలతో ప్రపంచాన్ని అవలోకనం చేసుకోవడాన్ని ప్రతిబింబిస్తాయి.ప్రధాన మంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన నెహ్రూ, తన పార్టీ సభ్యుల ఆధిక్యత కలిగిన పార్లమెంటు ద్వారా హిందూ స్త్రీల దాస్య విముక్తికి మరియు సమానత్వ సాధనకు ఉద్దేశింపబడిన అనేక న్యాయ సంస్కరణలు ఆమోదింప చేసారు. ఈ సంస్కరణలలో వివాహ కనీస వయోపరిమితిని పన్నెండు నుండి పదిహేనుకు పెంచడం, మహిళలను వారి భర్తల నుండి విడాకులు పొంది, ఆస్తి వారసత్వాన్ని పొందేలా శక్తివంతం చేయడం, వినాశకరమైన వరకట్న విధానాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఉన్నాయి.ఆయన సుధీర్ఘ పదవీకాలం స్వతంత్ర భారత దేశ సంప్రదాయాలు, విధానాలు రూపొందించటంలో సాధనంగా ఉన్నది.ఆయనను కొన్ని సందర్భాలలో 'నవ భారత రూపశిల్పి'గా పేర్కొంటారు. ఆయన కుమార్తె, ఇందిరా గాంధీ, మరియు మనుమడు, రాజీవ్ గాంధీ కూడా భారతదేశ ప్రధానమంత్రులుగా పనిచేసారు.
పంచ - శీల(శాంతియుత సహజీవనానికి ఐదు సూత్రాలు)టిబెట్ పై భారత-చైనా ఒప్పందం 1954కు ఆధారం ఐనప్పటికీ ,తరువాతి సంవత్సరాలలో సరిహద్దు వివాదాలు మరియు దలై లామా కు రాజకీయ ఆశ్రయం ఇవ్వాలనే నెహ్రూ నిర్ణయం చైనాతో పెరుగుతున్న విభేదాలు నెహ్రూ విదేశాంగ విధానానికి ఇబ్బంది కలిగించాయి.అనేక సంవత్సరాల చర్చలు విఫలమైన తరువాత, నెహ్రూ 1961 లో పోర్చుగల్ నుండి గోవాను స్వాధీన పరచుకోవలసినదిగా భారతీయ సైన్యాన్ని ఆజ్ఞాపించారు. చూడుము గోవా విముక్తి. సైనిక చర్య జరిపించినందుకు నెహ్రూ ప్రజాదరణతో పాటువిమర్శలను కూడా ఎదుర్కొన్నారు. తన జీవిత కాలంలో నెహ్రూ భారత దేశంలో ఒక ఆదర్శ మూర్తిగా గుర్తింపబడి , ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆదర్శవాదము మరియు రాజకీయ ధురన్ధరత ప్రశంసించ బడ్డాయి.బాలల మరియు యువజనుల పట్ల నెహ్రూకు గల వాత్సల్యానికి, వారి శ్రేయస్సుకు , విద్యాభివృద్ధికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా, ఆయన జన్మ దినమైన 14 నవంబర్, ను భారత దేశం బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నది.దేశ వ్యాప్తంగా బాలలు ఆయనను చాచా నెహ్రూ (నెహ్రూ అంకుల్)అని గౌరవిస్తారు. జవహర్లాల్ నెహ్రూ చే రచనలు ది డిస్కవరీ అఫ్ ఇండియా, గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ, ఆంగ్ల సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, వంద సంవత్సరాల స్వాతంత్ర పోరాటానికి ముగింపుగా, నెహ్రూ చేసిన చరిత్రాత్మక ఉపన్యాసం ట్రిస్ట్ విత్ డెస్టినీయొక్క సారాంశం, లెటర్స్ ఫ్రమ్ ఎ ఫాదర్ టు హిస్ డాటర్జవహర్లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిర కు రాసిన ఉత్తరములు చాలా ముఖ్యమైనవి. మన చాచా నెహ్రుగారు స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి .నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా ప్రేమ. అందుకే అతని మీద ప్రేమ తో బాలల దినోత్సవంతో నెహ్రు గారి పుట్టిన రోజు జరుపుకుంటారు.
ఈ రోజు పిల్లల సంక్షేమ మా నిబద్ధత పునరుద్ధరణ మరియుచాచా నెహ్రూ గారి కల ద్వారా ప్రత్యక్షంగా వాటిని నేర్పినట్టు ప్రతి ఒకటి గుర్తుచేస్తుంది. నెహ్రుగారు గారు ఎప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అనేవారు. నెహ్రూ గుండెపోటుతో బాధపడి 27 మే 1964 లో మరణించారు.
నెహ్రూగారు నవంబర్ 14, 1889 వ సంవత్సరం నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో, సంపన్న న్యాయవాది అయిన మోతిలాల్ నెహ్రూమరియు స్వరూప్ రాణిల ప్రధమసంతానంగా నెహ్రూ జన్మించారు. .భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో రెక్కలు విప్పుకున్న భారత స్వతంత్ర పోరాటంలో అయన చురుకైన సభ్యుడు.నెహ్రూ మరియు అయన ఇద్దరు సోదరీమణులు-విజయలక్ష్మి మరియు కృష్ణ-ఒక పెద్ద భవనమైన ఆనంద్ భవన్ నందు, ఆ రోజులలో శిష్ట వర్గం అవసరమని భావించిన, ప్రబలమైన ఆంగ్లసాంప్రదాయ పద్ధతులలో, పెంచబడ్డారు. వారికి హిందీ, సంస్కృతాలు నేర్పించడంతో పాటు భారతదేశంకు చెందిన సారస్వత గ్రంధాలలో పునాది వేయబడింది. భారత స్వాతంత్ర సంగ్రామ ప్రముఖ నాయకుడైన నెహ్రూ,స్వంతంత్ర భారతదేశ మొదటి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీచే ఎన్నుకోబడ్డారు.పిమ్మట 1952 లో భారతదేశ మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినపుడు ప్రధాని అయ్యారు.అలీనోద్యమ స్థాపకుల్లో ఒకరైన నెహ్రూ యుద్ధానంతర కాలఅంతర్జాతీయ రాజకీయాలలో ముఖ్య వ్యక్తి. ఆయనను పండిట్ నెహ్రూ అని,("పండిట్",సంస్కృతం,"పండితుడు", గౌరవసూచకము )భారతదేశంలో పండిట్ జీ (జీ, మర్యాద పూర్వక పదం)అని పిలిచేవారు.15 ఆగష్టు 1947 లో భారత దేశం స్వాతంత్రం సంపాదించినపుడు న్యూఢిల్లీ లో స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసే గౌరవం దక్కిన ఏకైక భారతీయుడు నెహ్రూ.పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, స్వేచ్ఛా వాద సుగుణాల పట్ల గుర్తింపుతో పాటు పేద మరియు అణగారిన వర్గాల పట్ల వ్యాకులత, నెహ్రూ తన విధానాలు రూపొందించటంలో దిశానిర్దేశం చేసి భారతదేశ సిద్ధాంతాలను నేటికి కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇవి ఆయన సామ్యవాద మూలాలతో ప్రపంచాన్ని అవలోకనం చేసుకోవడాన్ని ప్రతిబింబిస్తాయి.ప్రధాన మంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన నెహ్రూ, తన పార్టీ సభ్యుల ఆధిక్యత కలిగిన పార్లమెంటు ద్వారా హిందూ స్త్రీల దాస్య విముక్తికి మరియు సమానత్వ సాధనకు ఉద్దేశింపబడిన అనేక న్యాయ సంస్కరణలు ఆమోదింప చేసారు. ఈ సంస్కరణలలో వివాహ కనీస వయోపరిమితిని పన్నెండు నుండి పదిహేనుకు పెంచడం, మహిళలను వారి భర్తల నుండి విడాకులు పొంది, ఆస్తి వారసత్వాన్ని పొందేలా శక్తివంతం చేయడం, వినాశకరమైన వరకట్న విధానాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఉన్నాయి.ఆయన సుధీర్ఘ పదవీకాలం స్వతంత్ర భారత దేశ సంప్రదాయాలు, విధానాలు రూపొందించటంలో సాధనంగా ఉన్నది.ఆయనను కొన్ని సందర్భాలలో 'నవ భారత రూపశిల్పి'గా పేర్కొంటారు. ఆయన కుమార్తె, ఇందిరా గాంధీ, మరియు మనుమడు, రాజీవ్ గాంధీ కూడా భారతదేశ ప్రధానమంత్రులుగా పనిచేసారు.
ఈ రోజు పిల్లల సంక్షేమ మా నిబద్ధత పునరుద్ధరణ మరియుచాచా నెహ్రూ గారి కల ద్వారా ప్రత్యక్షంగా వాటిని నేర్పినట్టు ప్రతి ఒకటి గుర్తుచేస్తుంది. నెహ్రుగారు గారు ఎప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అనేవారు. నెహ్రూ గుండెపోటుతో బాధపడి 27 మే 1964 లో మరణించారు.
బాలల దినోత్సవ శుభాకాంక్షలు .
లేబుళ్లు:
కధలు,
కమామిషులు,
పండగలు,
పుట్టిన రోజులు,
మన దేశం - సంస్కృతి - సాంప్రదాయం,
Events,
greetings
బుధవారం, నవంబర్ 13, 2013
పండిత నెహ్రూ పుట్టినరోజు
బుధవారం, నవంబర్ 13, 2013
పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికి పుట్టినరోజు
మమతా సమతా పుట్టినరోజు మంచికి కోవెలకట్టినరోజు
|| పండిత నెహ్రూ ||
ముత్యంలాంటి మోతీలాలుకు రత్నంలా జన్మించాడు
జాతిరత్నమై వెలిగే యింకొక జాతి రత్నమును కన్నాడూ
అతడే జవహరులాలూ అతనికి మన జేజేలు
|| పండిత నెహ్రూ ||
తలపై తెల్లని టోపీ ఎదపై ఎర్రగులాబీ పెదవులపై చిరునవ్వు
మదిలో పున్నమి పువ్వు
చేతిలో పావురం మనాజాతికి అతడే గోపురం
|| పండిత నెహ్రూ ||
మహాత్మా గాంధీ అడుగుజాడలో స్వరాజ్య సమరం నడిపాడు
రణదాహంతో రగిలే జగతికి శాంతి సుధలు కురిపించాడు
కన్నుమూసినా జవహర్లాల్ కంటిపాపగా ఉన్నాడు
ఇంటింట జ్యోతిగ వున్నాడు చాచా నెహ్రూ అమర్రహ
|| పండిత నెహ్రూ ||
లేబుళ్లు:
పుట్టిన రోజులు,
Events,
greetings,
Patriotic Songs
ప్రభోధిని ఏకాదశి
ఈరోజును ప్రభోధిని ఏకాదశి అనీ దేవోత్తాన్ ఏకాదశి అని పిలుస్తారు, చంద్రమాన శుక్లపక్ష కార్తిక మాస ఏకాదశి రోజు జరుపుకుంటాము . అప్పటివరకు విష్ణువు నిద్రలో వున్నట్టు మనం నమ్ముతాం . విష్ణువు శేషుని భుజంపై నిద్రిస్తుండగా మనము ఆరోజును శయన ఏకాదశి గా జరుపుకున్నాం మరియు ప్రభోధిని ఏకాదశిని మేల్కొనే రోజు కావున "ప్రభోధిని ఏకాదశి" ("పదకొండో మేల్కొలుపు"), విష్ణు-ప్రభోధిని("విష్ణువు యొక్క మేల్కొలుపు") మరియు దేవ్-ప్రభోధిని ఏకాదశి, Deothan, దేవోత్తాన్ ఏకాదశి లేదా "దేవుని మేల్కొలుపు". చతుర్మాసం ముగింపు అవుతుంది. ఇది కూడా కార్తీకి ఏకాదశి, కార్తీక శుక్ల ఏకాదశి అని అంటారు. ప్రభోధిని ఏకాదశి తర్వాత కార్తీక పూర్ణిమ రోజు దేవతలు దీపావళిను జరుపుకుంటారు. ప్రభోధిని ఏకాదశి రోజు ఉపవాసం వుంటారు మరియు సంప్రదాయపద్దతిగా తులసి మొక్కకు విష్ణువు కు వివాహం చేస్తారు ఈ వివాహం ఆచారాన్ని తులసి వివాహం అంటారు. ఈ వివాహాన్ని ఏకాదశి తరువాత రోజు చేస్తారు. ప్రభోధిని ఏకాదశి మహారాష్ట్ర లో దేవుడు విఠోబా - విష్ణు రూపంగా పూజిస్తారు .
యాత్రికులు పండరపుర ఈ రోజు విఠోబా ఆలయంకు తరలి వస్తారు . పండరపుర ఉత్సవాలు ఈరోజు మొదలు అవుతాయి పౌర్ణమి రోజు వరకు ఘనంగా చేస్తారు. ఇప్పుడు చెరకు పంట ప్రారంభమవుతుంది. అందువల్ల రైతు అమలు పూజ సంప్రదాయబధ్ధంగా జరుపుకుంటారు వారు సరిహద్దు వద్ద ఐదు చెరకు కర్రలు పంచుతారు. కొన్ని చెరకు ముక్కలు బ్రాహ్మణ (పూజారి), కమ్మరి, వడ్రంగి, చాకలి ఇస్తారు. ఇంట్లోకి ఐదు కర్రలు తీసుకుని, విష్ణువు మరియు ఆయన భార్య రూపాలు లక్ష్మీ cowdung కి , వెన్న తో అలికిన చెక్క పలక మీద వుంచుతారు. పత్తి, తాంబూలం, కూర కాయ, ధాన్యాలు మరియు స్వీట్లు తో పాటు అందిస్తారు. విష్ణువు మేల్కొనడానికి విష్ణుదేవుడు మేలుకొలుపు పాట పాడాతారు. ఈరోజున భక్తులు ఉపవాసం వుంటారు విష్ణు సహస్ర పారాయణ చేస్తారు.
ప్రభోధిని ఏకాదశి శుభాకాంక్షలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)