Blogger Widgets

గురువారం, నవంబర్ 14, 2013

బాలల దినోత్సవ శుభాకాంక్షలు .

గురువారం, నవంబర్ 14, 2013

ఈ రోజు పిల్లలకు చాలా ప్రత్యేకమైన రోజు. ప్రపంచవ్యాప్తముగా బాలల దినోత్సవంను ప్రతి సంవత్సరం  నవంబర్ 20 న జరుపుకుంటారు.  మన దేశములో మాత్రం నవంబర్ 14వ తేదిన జరుపుకుంటున్నాము.  మనకు ఎంతో ఇష్టమైన చాచానేహృగారి జన్మదినోత్సవాన్ని మనము జాతీయ బాలలదినోత్సవం గా జరుపుకుంటున్నాము.   ఈరోజు కోసం మనం ఎంతగానో ఎదురు చూస్తూవుంటాం. ప్రతీస్కూల్లో ఈ బాలలదినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటాం.

నెహ్రూగారు నవంబర్ 14, 1889 వ సంవత్సరం    నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో, సంపన్న న్యాయవాది అయిన మోతిలాల్ నెహ్రూమరియు స్వరూప్ రాణిల ప్రధమసంతానంగా నెహ్రూ జన్మించారు. .భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో రెక్కలు విప్పుకున్న భారత స్వతంత్ర పోరాటంలో అయన చురుకైన సభ్యుడు.నెహ్రూ మరియు అయన ఇద్దరు సోదరీమణులు-విజయలక్ష్మి మరియు కృష్ణ-ఒక పెద్ద భవనమైన ఆనంద్ భవన్ నందు, ఆ రోజులలో శిష్ట వర్గం అవసరమని భావించిన, ప్రబలమైన ఆంగ్లసాంప్రదాయ పద్ధతులలో, పెంచబడ్డారు. వారికి హిందీ, సంస్కృతాలు నేర్పించడంతో పాటు భారతదేశంకు చెందిన సారస్వత గ్రంధాలలో పునాది వేయబడింది. భారత స్వాతంత్ర సంగ్రామ ప్రముఖ నాయకుడైన నెహ్రూ,స్వంతంత్ర భారతదేశ మొదటి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీచే ఎన్నుకోబడ్డారు.పిమ్మట 1952 లో భారతదేశ మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినపుడు ప్రధాని అయ్యారు.అలీనోద్యమ స్థాపకుల్లో ఒకరైన నెహ్రూ యుద్ధానంతర కాలఅంతర్జాతీయ రాజకీయాలలో ముఖ్య వ్యక్తి. ఆయనను పండిట్ నెహ్రూ అని,("పండిట్",సంస్కృతం,"పండితుడు", గౌరవసూచకము )భారతదేశంలో పండిట్ జీ (జీ, మర్యాద పూర్వక పదం)అని పిలిచేవారు.15 ఆగష్టు 1947 లో భారత దేశం స్వాతంత్రం సంపాదించినపుడు న్యూఢిల్లీ లో స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసే గౌరవం దక్కిన ఏకైక భారతీయుడు నెహ్రూ.పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, స్వేచ్ఛా వాద సుగుణాల పట్ల గుర్తింపుతో పాటు పేద మరియు అణగారిన వర్గాల పట్ల వ్యాకులత, నెహ్రూ తన విధానాలు రూపొందించటంలో దిశానిర్దేశం చేసి భారతదేశ సిద్ధాంతాలను నేటికి కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇవి ఆయన సామ్యవాద మూలాలతో ప్రపంచాన్ని అవలోకనం చేసుకోవడాన్ని ప్రతిబింబిస్తాయి.ప్రధాన మంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన నెహ్రూ, తన పార్టీ సభ్యుల ఆధిక్యత కలిగిన పార్లమెంటు ద్వారా హిందూ స్త్రీల దాస్య విముక్తికి మరియు సమానత్వ సాధనకు ఉద్దేశింపబడిన అనేక న్యాయ సంస్కరణలు ఆమోదింప చేసారు. ఈ సంస్కరణలలో వివాహ కనీస వయోపరిమితిని పన్నెండు నుండి పదిహేనుకు పెంచడం, మహిళలను వారి భర్తల నుండి విడాకులు పొంది, ఆస్తి వారసత్వాన్ని పొందేలా శక్తివంతం చేయడం, వినాశకరమైన వరకట్న విధానాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఉన్నాయి.ఆయన సుధీర్ఘ పదవీకాలం స్వతంత్ర భారత దేశ సంప్రదాయాలు, విధానాలు రూపొందించటంలో సాధనంగా ఉన్నది.ఆయనను కొన్ని సందర్భాలలో 'నవ భారత రూపశిల్పి'గా పేర్కొంటారు. ఆయన కుమార్తె, ఇందిరా గాంధీ, మరియు మనుమడు, రాజీవ్ గాంధీ కూడా భారతదేశ ప్రధానమంత్రులుగా పనిచేసారు.
పంచ - శీల(శాంతియుత సహజీవనానికి ఐదు సూత్రాలు)టిబెట్ పై భారత-చైనా ఒప్పందం 1954కు ఆధారం ఐనప్పటికీ ,తరువాతి సంవత్సరాలలో సరిహద్దు వివాదాలు మరియు దలై లామా కు రాజకీయ ఆశ్రయం ఇవ్వాలనే నెహ్రూ నిర్ణయం చైనాతో పెరుగుతున్న విభేదాలు నెహ్రూ విదేశాంగ విధానానికి ఇబ్బంది కలిగించాయి.అనేక సంవత్సరాల చర్చలు విఫలమైన తరువాత, నెహ్రూ 1961 లో పోర్చుగల్ నుండి గోవాను స్వాధీన పరచుకోవలసినదిగా భారతీయ సైన్యాన్ని ఆజ్ఞాపించారు. చూడుము గోవా విముక్తి. సైనిక చర్య జరిపించినందుకు నెహ్రూ ప్రజాదరణతో పాటువిమర్శలను కూడా ఎదుర్కొన్నారు.  తన జీవిత కాలంలో నెహ్రూ భారత దేశంలో ఒక ఆదర్శ మూర్తిగా గుర్తింపబడి , ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆదర్శవాదము మరియు రాజకీయ ధురన్ధరత ప్రశంసించ బడ్డాయి.బాలల మరియు యువజనుల పట్ల నెహ్రూకు గల వాత్సల్యానికి, వారి శ్రేయస్సుకు , విద్యాభివృద్ధికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా, ఆయన జన్మ దినమైన 14 నవంబర్, ను భారత దేశం బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నది.దేశ వ్యాప్తంగా బాలలు ఆయనను చాచా నెహ్రూ (నెహ్రూ అంకుల్)అని గౌరవిస్తారు.  జవహర్లాల్ నెహ్రూ చే రచనలు  ది డిస్కవరీ అఫ్ ఇండియా,  గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ, ఆంగ్ల సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, వంద సంవత్సరాల స్వాతంత్ర పోరాటానికి ముగింపుగా, నెహ్రూ చేసిన చరిత్రాత్మక ఉపన్యాసం ట్రిస్ట్ విత్ డెస్టినీయొక్క సారాంశం, లెటర్స్ ఫ్రమ్ ఎ ఫాదర్ టు హిస్ డాటర్జవహర్లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిర కు రాసిన ఉత్తరములు చాలా ముఖ్యమైనవి.   మన చాచా  నెహ్రుగారు స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి .నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా ప్రేమ.  అందుకే అతని మీద  ప్రేమ తో  బాలల దినోత్సవంతో నెహ్రు గారి  పుట్టిన రోజు జరుపుకుంటారు.
 రోజు పిల్లల సంక్షేమ మా నిబద్ధత పునరుద్ధరణ మరియుచాచా నెహ్రూ గారి కల  ద్వారా ప్రత్యక్షంగా  వాటిని నేర్పినట్టు  ప్రతి ఒకటి గుర్తుచేస్తుంది. నెహ్రుగారు గారు ఎప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అనేవారు.  నెహ్రూ గుండెపోటుతో బాధపడి 27 మే 1964 లో మరణించారు.
బాలల దినోత్సవ శుభాకాంక్షలు . 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)