అప్పని వరప్రసాది అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు .
గురుదేవ స్తుతి శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్య
పీత్వాపినైవ సుహితా మనుజా భవేయుః
త్వం వేంకటాచలపతే నివ భక్తి సారం
శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 32 వేల సంకీర్తన కుసుమాలతో అర్చన చేసి తన జీవితాన్ని తరింపచేసుకున్న పరమ భక్తాగ్రేశ్వరుడు , తొలితెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళపాక అన్నమయ్య. 15 వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య తల్లిదండ్రులు శ్రీమతి లక్కమాంబ, శ్రీ నారాయణ సూరి దంపతులు. తాళ్ళపాక గ్రామం లో అన్నమయ్య వంశీయులు నందవరీక బ్రాహ్మణ కుటుంబములో క్రీ.శ . 1408 లో వైశాఖమాసం లో, విశాఖ నక్షత్రంలో మంచి గ్రహస్తితిలో జన్మించారు.
తెలుగులో మనకు తెలిసినంత వరకు మొట్టమొదటి తెలుగుపదాలు అన్నమయ్యవె. అన్నమయ్య ఆలపించిన తెలుగు పదాలు పండితులకు అటు పామరులకు అందరికి అర్ధమయ్యే విధంగా వుంటుంది. ఆయన అత్యాధునిక స్వాతంత్ర్యభావాలు కలవాడు . సమాజాని అతిసూక్ష్మద్రుష్టి తో పరిశీలించి జనబాహుళ్యంలో వున్నా జానపదాన్ని గ్రహించాడు. అన్నమయ్య పదాలు దేనికదే ప్ర్యతేకతను కలిగివుంటాయి. భక్తి , వైరాగ్యాలలోనే కాకుండా నాటి సాంఘీక రాజకీయ,సామాజిక స్థితిగతులకు కూడా అద్దంపట్టయి అనుటలో ఎటువంటి సందేహం లెదు. అన్నమయ్య పదాలు తెలుగువారికి తరగని నిధులు. తెలుగు తనానికి పెట్టనికోటలు. తెలుగువారి హృదయాలమునకు చెరగని ముద్రలుగా వున్నాయి. ఆయన పదమే తెలుగుపాటకు జీవం. అన్నమయ్య అనేక సంకీర్తనలు తో పాటు సంస్కృతములో వేంకటాచల మహాత్మ్యం, సంకీర్తన లక్షణం, తెలుగు ద్విపద రామాయణం, 12 శతకాలు వ్రాసినట్లు తెలుస్తోంది. వెంకటేశ్వర శతకం ప్రసిద్ది పొందినది. అన్నమయ్య ఇతర రచన లెన్ని చేసినా ఇతర భాషలలో ఎన్ని ప్రభందాలు రాసినా సుప్రసిద్దముగా నిలిచినవి సంకీర్తనలే. నిత్యము స్వామిని తన సంకీర్తనలతో ఆరాధింఛి తరించిన అన్నమయ్య క్రీ.శ . 1503 లో ఫాల్గుణ బహుళ ద్వాదశి దినమున స్వామిలో లీనమైనాడు. ఈ తిధిని పురస్కరించుకొని తాళపాక వారు
"దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు
జనకు(డ అన్నమాచార్యు(డ విచ్చేయవే
అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే
వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశు(గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే
సంకీర్తనముతోడ సనకాదులెల్ల(బాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభు(డు నీవునంకెల మాయీంటి విందు లారగించవే"
అని ఆరాధించారు. అన్నమయ్యను అప్పని వరప్రసాదిగా కీర్తించి తరించారు.
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే
వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశు(గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే
సంకీర్తనముతోడ సనకాదులెల్ల(బాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభు(డు నీవునంకెల మాయీంటి విందు లారగించవే"
అని ఆరాధించారు. అన్నమయ్యను అప్పని వరప్రసాదిగా కీర్తించి తరించారు.