Blogger Widgets

ఆదివారం, మార్చి 22, 2015

జల కల

ఆదివారం, మార్చి 22, 2015

ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22, 2014న విశ్వవ్యాప్తంగా పాటించారు. మంచి నీటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేసేందుకు యునైటెడ్ నేషన్స్ మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహిస్తుంది. మెరుగైన నీటి వనరుల ఉపయోగం, జల వనరుల సంరక్షణ ప్రపంచ జల దినోత్సవ ముఖ్యోద్దేశం.  భూమిపై మూడొంతుల భాగం నీరు ఆవరించబడి ఉన్నది. ఈ భువిపై ఉన్న ప్రతి ప్రాణి నీరు లేనిదే మనుగడ సాగించలేదు.
భూభాగంలో 70.9 శాతం నీటితో నిండి వుంది. అందులో 86.5 శాతం సముద్రపు నీరు, 1.7 శాతం భూగర్భ జలాలు, 1.7శాతం మంచు రూపంలో ఉంది. అయితే భూమిమీద మొత్తం 2.5 శాతం మాత్రమే మంచినీరు ఉంది. అందులో 0.3 శాతం నదుల్లో, కాలువల్లో ఉంది. 
యునైటెడ్ నేషన్స్, ప్రపంచ జల దినోత్సవాన్ని 1992 యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ (UNCED), రియో డి జెనీరియో సమావేశంలో ప్రతిపాదించింది. దీన్ని 1993వ సంవత్సరం నుంచి నిర్వహించడం ప్రారంభించారు. 
మెరుగైన మంచి నీటి వనరుల నిర్వహణ, ప్రాముఖ్యత పట్ల అవగాహనా కల్పించడంకోసం యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరం మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా జరుపుతుంది.
మనము నీటిని వృదా చేస్తున్నాం , కలుషితం చేస్తున్నాం . ఒకవిధంగా చెప్పాలి అంటే నీటిని విషపూరితం చేస్తున్నాం.  భూమి మీద సమస్త జీవులు నీటిని ఆధారంగానే చేసుకొని జీవిస్తున్నాయి.  మనం నీటిని కలుషితం చేయటం వల్ల  జలచరాలు అనేకమైనవి వాటి ఉనికిని కోల్పోతున్నాయి.  దీనికి అర్ధం కొంతకాలానికి మనకు అదే పరిస్థితి ఎదురవ్వకమానదు.  మనకు నీరు చాలా అవసరం .  నీరు లేకపోతే సమస్త జీవులకు జీవించటమే సమస్య గా మారిపోతుంది . నీరు ప్రకృతి ప్రసాదించిన వరం.  ఇదే ప్రకృతి సహజమైన ఔషధం.  సహజంగానే భూమి మీద నీటి కొరత ఏర్పడింది.  అది అధికమిమచవలెను.  దానికి ఒకే ఒక మార్గం చెట్లను అదికంగా పెంచటమే.  మనం భారతీయులం కావున నీటిని గంగా మాతగా పూజిస్తాం.  హారతులు పడతాం. అలాంటి నీటిని ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.  వృదాచేయకుండా. కలుషితం చేయకుండా.  అనావసరమైన వ్యర్ధాలు నీటిలో కలపకుండా జాగ్రత్త పడాలి.  నీటిని  కాపాడుదాం అలాగే ప్రపంచాన్ని కాపాడుదాం.  ఈరోజు ప్రపంచ జల దినోత్సవాన్ని మంచి ఉద్యమంగా జరుపుకుందాం. 

శనివారం, మార్చి 21, 2015

మన్మదనామ సంవత్సర శుభాకాంక్షలు.

శనివారం, మార్చి 21, 2015

ఉగాది తెలుగు వారి పండుగ ఈ పండుగ తో తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగనే సంవత్సరాధి అని కూడా అంటారు. ఈ సంవత్సరం పేరు  మన్మదనామ సంవత్సరం.  ఉగాది పండుగరోజు ఉదయమునే లేచి, తలంటు స్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు.  ఇంటిని మామిడితోరణాలతో పూలదండలతో అలంకరిస్తారు.  పరగడుపున ఉగాది పచ్చడి తినటం ఈ పండుగ ప్రత్యేకత. ఈ పచ్చడిలో చేదు, పులుపు, ఉప్పు, తీపి , వగరు, కారం అనే ఆరు రుచులు వుంటాయి.  మరి పచ్చడి చెయడానికి  వేప పూత, మామిడి, ఉప్పు, బెల్లం, కారం, చింతపండు వేసి పచ్చడి తయారుచేస్తారు.
ఈ పచ్చడి జీవితంలో మనకు కలిగే తీపి లాంటి సుఖాలను, చేదులాంటి కష్టాలను,సమానంగా అనుభవించాలని తెలుపుతుంది.  ఈ పచ్చడి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.ఈపచ్చడి  వసంతలక్ష్మి కి నైవేద్యంపెట్టి అందరు స్వీకరించి కొత్త సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానిస్తారు.ఉగాది రోజు సాయంత్రం గుడి ఆవరణలో పురోహితుడు పంచాంగం వినిపిస్తారు.  రాబోయే సంవత్సర్ ఫలితాలు , పాడి ఫంటలు ఎలా వుంటాయో చెబుతారు. మనకు జరగబోయే మంచి చెడులు చెపుతారు.  దీన్నే పంచాగశ్రవణం అని అంటారు.  ఇది చాలా ఆసక్తికరంగావుంటుంది. ఈ పండుగ ను అందరు ఆనందోత్సాహాలతో  జరుపుకోవాలని కోరుకుంటూ, అందరికి  మన్మదనామ సంవత్సర శుభాకాంక్షలు.                                  

శనివారం, మార్చి 14, 2015

"పై"

శనివారం, మార్చి 14, 2015




గణితం లో వాడే ఒక గుర్తు పేరు 'పై' (22/7). పై యొక్క విలువ 3.14159.... దానిని పురస్కరించుకకుని, గణిత మేధావులు ఈ రోజును పై డే గా జరుపుకుంటున్నారు.  
పై డే ను  ప్రపంచవ్యాప్తంగా మార్చి 14 (3/14) న జరుపుకుంటారు. ఫై (గ్రీకు అక్షరం "π") స్థిరమైన ప్రాతినిధ్యం గణితశాస్త్రంలో ఉపయోగించే గుర్తు - వ్యాసం ఒక వృత్తం యొక్క చుట్టుకొలత నిష్పత్తి - సుమారుగా 3.14159 ఉంది.  
 
పై దాని దశాంశ పాయింట్ దాటి ట్రిలియన్ కంటే ఎక్కువ అంకెలు ఉంటుందని అంచనా వేయబడింది. అనిష్ప మరియు బీజాతీత సంఖ్య, ఇది పునరావృతం లేదా నమూనా లేకుండా అనంతంగా కొనసాగుతుంది. అంకెలు మాత్రమే చూపడంతో సాధారణ లెక్కలు అవసరమైన సమయంలో పై యొక్క అనంతమైన సంక్యగా  దీన్ని గుర్తుంచుకోవలసిన, మరియు గణన మరింత అంకెలు గణించడానికి ఒక సవాలు చేస్తుంది.
 

1706 లో కొద్దిగా తెలిసిన గణిత ఉపాధ్యాయుడు విలియం జోన్స్ మొదటి pi యొక్క ప్లాటోనిక్ భావన, సంఖ్యా పరంగా చేరవచ్చు ఒక ఉత్తమ ప్రాతినిధ్యం చిహ్నంగా ఉపయోగించారు, అయితే ఎన్నడూ. ప్యాట్రిసియా రోత్మన్ జోన్స్ అతని సమకాలీనులు మధ్య ప్రాముఖ్యత మరియు ఆయన వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రత్యేకగా చర్చిస్తుంది.
ఏ సర్కిల్ యొక్క వ్యాసం చుట్టుకొలత నిరంతరం నిష్పత్తి యొక్క చరిత్ర కొలిచేందుకు మనిషి కోరిక అంత ప్రాచీనమైనది; π గుర్తించబడుతున్న ప్రస్తుత ఈ నిష్పత్తి కోసం గుర్తు అయితే (PI) 18 వ శతాబ్దం నుండి ఆరంభమయ్యింది. క్వామ్ కమ్ multiflicetur వ్యాసం, proveniet circumferencia (వ్యాసం ఇది గుణిస్తే ఉన్నప్పుడు, చుట్టుకొలత దిగుబడి ఇది పరిమాణం) లో quantitas: ఈ నిష్పత్తి మధ్యయుగ లాటిన్ లో సూచిస్తారు జరిగింది.
ఇది గొప్ప స్విస్ జన్మించిన గణిత శాస్త్రజ్ఞుడు లియొనార్డ్ ఆయిలర్ (1707-83) సాధారణ వాడుకలోకి π గుర్తును  పరిచయం చేసినట్టు నమ్ముతారు. నిజానికి ఇది మొదటి 1706 లో దాని ఆధునిక అర్థంలో print ఉపయోగించారు.  

Take a look about Albert Einstein

Today is Albert Einstein's birthday.  So take a look about Einstein
Documentary on the Life and Discoveries of Physicist Albert Einstein.


My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)