ఉగాది తెలుగు వారి పండుగ ఈ పండుగ తో తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగనే సంవత్సరాధి అని కూడా అంటారు. ఈ సంవత్సరం పేరు మన్మదనామ సంవత్సరం. ఉగాది పండుగరోజు ఉదయమునే లేచి, తలంటు స్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు. ఇంటిని మామిడితోరణాలతో పూలదండలతో అలంకరిస్తారు. పరగడుపున ఉగాది పచ్చడి తినటం ఈ పండుగ ప్రత్యేకత. ఈ పచ్చడిలో చేదు, పులుపు, ఉప్పు, తీపి , వగరు, కారం అనే ఆరు రుచులు వుంటాయి. మరి పచ్చడి చెయడానికి వేప పూత, మామిడి, ఉప్పు, బెల్లం, కారం, చింతపండు వేసి పచ్చడి తయారుచేస్తారు.
ఈ పచ్చడి జీవితంలో మనకు కలిగే తీపి లాంటి సుఖాలను, చేదులాంటి కష్టాలను,సమానంగా అనుభవించాలని తెలుపుతుంది. ఈ పచ్చడి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.ఈపచ్చడి వసంతలక్ష్మి కి నైవేద్యంపెట్టి అందరు స్వీకరించి కొత్త సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానిస్తారు.ఉగాది రోజు సాయంత్రం గుడి ఆవరణలో పురోహితుడు పంచాంగం వినిపిస్తారు. రాబోయే సంవత్సర్ ఫలితాలు , పాడి ఫంటలు ఎలా వుంటాయో చెబుతారు. మనకు జరగబోయే మంచి చెడులు చెపుతారు. దీన్నే పంచాగశ్రవణం అని అంటారు. ఇది చాలా ఆసక్తికరంగావుంటుంది. ఈ పండుగ ను అందరు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ, అందరికి మన్మదనామ సంవత్సర శుభాకాంక్షలు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.