శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.
శుక్రవారం, మార్చి 27, 2015
శ్రీ సీతారాముల కళ్యాణం
శుక్రవారం, మార్చి 27, 2015
లేబుళ్లు:
దేవదేవం భజె,
మన దేశం - సంస్కృతి - సాంప్రదాయం,
Events,
Greeetings
సోమవారం, మార్చి 23, 2015
ముగ్గురు హీరోలకు వందనం.
సోమవారం, మార్చి 23, 2015
నిజమైన ఈ ముగ్గురు హీరోలకు (భగత్ సింగ్, సుఖ్ దేవ్ థాపర్, హరి శివరాం రాజ్ గురు) వందనం |
భగత్ సింగ్ (సెప్టెంబరు 28, 1907 –మార్చి 23, 1931) స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు.భారత స్వాతంత్ర్యోద్యమమునకు పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులల్లో ఆయన ఒకరు. ఈ కారణంగానే 'షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు'. చరిత్రకారుడు కె.ఎన్. పనిక్కర్ ప్రకారం భగత్ సింగ్,భారతదేశంలో ఆరంభ మార్కిస్టు గా పేరుపొందాడు.
సుఖ్ దేవ్ థాపర్ (15 మే 1907 - మార్చి 23, 1931) భారత స్వాతంత్ర్య సమర, ఉద్యమకారుడు. ఇతను భగత్ సింగ్ మరియు రాజ్‌గురు ల సహచరునిగా ప్రసిధ్ధి.
హరి శివరాం రాజ్ గురు (ఆగష్టు 24, 1908 - మార్చి 23, 1931) భారత స్వాతంత్ర ఉద్యమ, ఉద్యమకారుడు. మహారాష్ట్ర లోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతను భగత్ సింగ్ మరియు సుఖ్ దేవ్ ల సహచరునిగా ప్రసిధ్ధి.
జె. పి. సండర్ |
1928లో భారత్‌లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబరు 1928న కమిషన్ లాహోర్‌ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజ్‌పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు.1 సెప్టెం, 2011 - 1929లో లాహోర్‌లో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న 64 ఏళ్ల వృద్ధుడు లాలా లజపతిరాయ్‌పై సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి పాశవికంగా లాఠీచార్జి చేసారు దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్ మరియ సుఖ్‌దేవ్ థాపర్‌లతో ఆయన చేతులు కలిపాడు. స్కాట్‌ను గుర్తించిన జై పాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ J. P. సాండర్స్కనిపించినప్పుడు సింగ్‌కు జై పాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంట పడకుండా ఉండటానికి భగత్ లాహోర్ పారిపోయాడు. గుర్తు పట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెండ్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు సింగ్ పాల్పడ్డాడు.
1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందులకు గాను భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన ఈ ముగ్గురు విప్లవకారులు (భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్) లను 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో సాయంకాలం 7.33 సమయానికి ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలు జరపడం జరిగేది కాదు. వారి మృత దేహాలను రహస్యంగా, జైలు వెనుక గోడలు పగులగొట్టి తీసికొని వెళ్ళిసట్లెజ్ నది తీరాన హుస్సేన్‌వాలా అనే ఊరిలో దహనం చేశారు. మృత దేహాను చూసిన ప్రజలలో అలజడిని ఎదుర్కోకుండా ఇలా చేశారు.
లేబుళ్లు:
చరిత్ర,
మన దేశం - సంస్కృతి - సాంప్రదాయం,
photos
ఆదివారం, మార్చి 22, 2015
జల కల
ఆదివారం, మార్చి 22, 2015
ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22, 2014న విశ్వవ్యాప్తంగా పాటించారు. మంచి నీటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేసేందుకు యునైటెడ్ నేషన్స్ మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహిస్తుంది. మెరుగైన నీటి వనరుల ఉపయోగం, జల వనరుల సంరక్షణ ప్రపంచ జల దినోత్సవ ముఖ్యోద్దేశం. భూమిపై మూడొంతుల భాగం నీరు ఆవరించబడి ఉన్నది. ఈ భువిపై ఉన్న ప్రతి ప్రాణి నీరు లేనిదే మనుగడ సాగించలేదు.
భూభాగంలో 70.9 శాతం నీటితో నిండి వుంది. అందులో 86.5 శాతం సముద్రపు నీరు, 1.7 శాతం భూగర్భ జలాలు, 1.7శాతం మంచు రూపంలో ఉంది. అయితే భూమిమీద మొత్తం 2.5 శాతం మాత్రమే మంచినీరు ఉంది. అందులో 0.3 శాతం నదుల్లో, కాలువల్లో ఉంది.
భూభాగంలో 70.9 శాతం నీటితో నిండి వుంది. అందులో 86.5 శాతం సముద్రపు నీరు, 1.7 శాతం భూగర్భ జలాలు, 1.7శాతం మంచు రూపంలో ఉంది. అయితే భూమిమీద మొత్తం 2.5 శాతం మాత్రమే మంచినీరు ఉంది. అందులో 0.3 శాతం నదుల్లో, కాలువల్లో ఉంది.
యునైటెడ్ నేషన్స్, ప్రపంచ జల దినోత్సవాన్ని 1992 యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ (UNCED), రియో డి జెనీరియో సమావేశంలో ప్రతిపాదించింది. దీన్ని 1993వ సంవత్సరం నుంచి నిర్వహించడం ప్రారంభించారు.
మెరుగైన మంచి నీటి వనరుల నిర్వహణ, ప్రాముఖ్యత పట్ల అవగాహనా కల్పించడంకోసం యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరం మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా జరుపుతుంది.
మనము నీటిని వృదా చేస్తున్నాం , కలుషితం చేస్తున్నాం . ఒకవిధంగా చెప్పాలి అంటే నీటిని విషపూరితం చేస్తున్నాం. భూమి మీద సమస్త జీవులు నీటిని ఆధారంగానే చేసుకొని జీవిస్తున్నాయి. మనం నీటిని కలుషితం చేయటం వల్ల జలచరాలు అనేకమైనవి వాటి ఉనికిని కోల్పోతున్నాయి. దీనికి అర్ధం కొంతకాలానికి మనకు అదే పరిస్థితి ఎదురవ్వకమానదు. మనకు నీరు చాలా అవసరం . నీరు లేకపోతే సమస్త జీవులకు జీవించటమే సమస్య గా మారిపోతుంది . నీరు ప్రకృతి ప్రసాదించిన వరం. ఇదే ప్రకృతి సహజమైన ఔషధం. సహజంగానే భూమి మీద నీటి కొరత ఏర్పడింది. అది అధికమిమచవలెను. దానికి ఒకే ఒక మార్గం చెట్లను అదికంగా పెంచటమే. మనం భారతీయులం కావున నీటిని గంగా మాతగా పూజిస్తాం. హారతులు పడతాం. అలాంటి నీటిని ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. వృదాచేయకుండా. కలుషితం చేయకుండా. అనావసరమైన వ్యర్ధాలు నీటిలో కలపకుండా జాగ్రత్త పడాలి. నీటిని కాపాడుదాం అలాగే ప్రపంచాన్ని కాపాడుదాం. ఈరోజు ప్రపంచ జల దినోత్సవాన్ని మంచి ఉద్యమంగా జరుపుకుందాం.
శనివారం, మార్చి 21, 2015
మన్మదనామ సంవత్సర శుభాకాంక్షలు.
శనివారం, మార్చి 21, 2015
ఉగాది తెలుగు వారి పండుగ ఈ పండుగ తో తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగనే సంవత్సరాధి అని కూడా అంటారు. ఈ సంవత్సరం పేరు మన్మదనామ సంవత్సరం. ఉగాది పండుగరోజు ఉదయమునే లేచి, తలంటు స్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు. ఇంటిని మామిడితోరణాలతో పూలదండలతో అలంకరిస్తారు. పరగడుపున ఉగాది పచ్చడి తినటం ఈ పండుగ ప్రత్యేకత. ఈ పచ్చడిలో చేదు, పులుపు, ఉప్పు, తీపి , వగరు, కారం అనే ఆరు రుచులు వుంటాయి. మరి పచ్చడి చెయడానికి వేప పూత, మామిడి, ఉప్పు, బెల్లం, కారం, చింతపండు వేసి పచ్చడి తయారుచేస్తారు.
ఈ పచ్చడి జీవితంలో మనకు కలిగే తీపి లాంటి సుఖాలను, చేదులాంటి కష్టాలను,సమానంగా అనుభవించాలని తెలుపుతుంది. ఈ పచ్చడి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.ఈపచ్చడి వసంతలక్ష్మి కి నైవేద్యంపెట్టి అందరు స్వీకరించి కొత్త సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానిస్తారు.ఉగాది రోజు సాయంత్రం గుడి ఆవరణలో పురోహితుడు పంచాంగం వినిపిస్తారు. రాబోయే సంవత్సర్ ఫలితాలు , పాడి ఫంటలు ఎలా వుంటాయో చెబుతారు. మనకు జరగబోయే మంచి చెడులు చెపుతారు. దీన్నే పంచాగశ్రవణం అని అంటారు. ఇది చాలా ఆసక్తికరంగావుంటుంది. ఈ పండుగ ను అందరు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ, అందరికి మన్మదనామ సంవత్సర శుభాకాంక్షలు.
లేబుళ్లు:
దేవదేవం భజె,
మన దేశం - సంస్కృతి - సాంప్రదాయం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)