సహస్రనామ తత్తు(స్తు)ల్యమ్ రామనామ వరాననే
రామనామము సకల పాపహరమనీ, మోక్షప్రదమనీ చాలామంది నమ్మకము . "రామ" నామములో పంచాక్షరీ మంత్రము "ఓం నమ: శివాయ" నుండి "మ" అనే బీజాక్షరము, మరియు అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి "రా" అనే బీజాక్షరము పొందుపరచబడి ఉన్నయని ఆధ్యాత్మిక వేత్తలు వివరణ. ఒక్కసారి "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించుననీ శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది. దీనిని గూర్చి పెద్దలు చెప్పిన వివరణ ఏమిటంటే . రామ పదంలో మొదటి అక్షరం "రా" ఇది య,ర,ల,వల్లో "ర" రెండవ అక్షరం. రామలో రెండవ అక్షరం "మ". ఇది ప,ఫ,బ,భ,మ వర్గములో "మ" ఐదవ అక్షరం. సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి రెండుచేత ఐదుని గుణిస్తే 2 x 5 = 10 అవుతుంది . అలాగే రెండవ రామ శబ్దానికి పది ని పది చేత గుణిస్తే 10 x 10 = 100 అవుతుంది. ఇప్పుడు మూడవ రామ శబ్దా న్ని పది చేత వందని గుణిస్తే 10 x 100 = 1000 అవుతుంది . ఇలా "శ్రీ రామ , రామ , రామ ఇతి " అన్న ఒక్క శ్లోకం చదివితే వెయ్యి నామాలు చదివిన ఫలితం వస్తుంది . అని మహా శివుడు పార్వతి దేవికి చెప్పాడు.
ఇంకా రామ నామాన్ని జపించి "ఋక్షకుడు" అనే ఒక సాధారణ వ్యక్తి వాల్మీకిగా మారుతాడు, రామ నామం వల్ల శబరి, గుహుడు, హనుమ, సీతామాత, ఇలా ఎందరో పునీతులు అయ్యారు . ఇంకా "రా"అన్న అక్షరం పలికేటప్పుడు పెదవులు తెరుచు కొంటాయి. అంటే మనలో ఉన్న పాపాలు బైటికి పోతాయి అన్నమాట. ఇక "మా" పలికేటప్పుడు పెదవులు మూసుకొంటాయి. బైటికి పోయిన పాపాలు లోపలకిచేరకుండా చేస్తాయి. ఇలా రామ నామాన్నిగూరించి ఎంతైనా చెప్పవచ్చును . వశిష్టుడు "ఓం నమో నారాయణాయ" అన్న అష్టాక్షరి మంత్రం నుండీ " రా" అన్న అక్షరాన్ని, "నమశ్శివాయ" అన్న పంచాక్షరి మంత్రం లోంచి "మ" అన్న అక్షరాన్ని గ్రహించి "రామ" అని పేరుపెట్టేడు. కనుక రామ అని అంటే చాలు, అష్టాక్షరిమంత్రము + పంచాక్షరి మం త్రము ఒకేసారి జపించినట్లవుతుంది .
రామ చంద్రుడు తన సైన్యముతో సీత ను చేరటానికి లంకానగరంపై దండెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు సముద్రంపై వానరసేన రాళ్ళతో వారథిని నిర్మిస్తున్నారు. అప్పుడు ప్రతీ రాయిపై 'రామ' అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తె అది తేలిపోతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి 'నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేను రాయి వేస్తే' అది ఏమి అవుతుంది అనే ఆలోచన కలిగింది. అప్పుడు శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనై పక్కనే వున్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు . అందుకు "రామ" అనే నామం రాసిన రాళ్ళే పైకితేలుతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం లేదు కదా! అందుకే మునిగిపోయింది" అని హనుమంతుడు సమాధానం చెప్పాడు. అంటే రామ నామం కు ఉన్న గొప్పతనం ఎంత వుందో కదా. శ్రీ రాముని కంటే రామనామ గొప్పదే అనిపిస్తోంది.
రామ నామ మహిమను చెప్పటానికి ఇంకా చాలా కధలు వున్నాయి . వాటి గురించి ఇంకోసారి పోస్ట్ చేస్తాను .