గురువారం, ఆగస్టు 24, 2023
వరలక్ష్మి వ్రతం అమ్మవారి అలంకారం(Last min Saree Draping For varalakshmi ...
గురువారం, ఆగస్టు 24, 2023
లేబుళ్లు:
కమామిషులు,
చరిత్ర,
దేవదేవం భజె,
పండగలు,
ammamma tho nenu,
art and crafts
సోమవారం, ఏప్రిల్ 24, 2023
కలసి వుంటే కలదు సుఖం అని చెప్పే మా జేజమ్మ స్టైల్ కాయ ఆవకాయ అంతా కలసి తిన...
సోమవారం, ఏప్రిల్ 24, 2023
లేబుళ్లు:
ammamma tho nenu,
art and crafts,
avakaya,
childhood,
cooking,
Recipes,
snacks,
summer
శుక్రవారం, జనవరి 27, 2023
అర్ఘ్యమిస్తే అష్టైశ్వర్యాలు నమస్కారిస్తే ఆయురారోగ్యాలు ప్రసాదించే ప్రత్య...
శుక్రవారం, జనవరి 27, 2023
సోమవారం, అక్టోబర్ 12, 2015
బతుకమ్మ బతుకమ్మ
సోమవారం, అక్టోబర్ 12, 2015
లేబుళ్లు:
దేవదేవం భజె,
పండగలు,
పాటలు,
మన దేశం - సంస్కృతి - సాంప్రదాయం,
art and crafts,
Events,
Greeetings
శుక్రవారం, సెప్టెంబర్ 04, 2015
ఓమ్ శ్రీ కృష్ణ శరణం మమః.
శుక్రవారం, సెప్టెంబర్ 04, 2015
ఈ భారతావనిలో శ్రీకృష్ణుడు అంటే తెలియని వారుండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడు. శ్రీకృష్ణుని భగవంతుని అవతారంగా, మానవ రూపంలో, జన్మించిన దేవునిగా ఆరాధించామేగాని మానవుడిగా పుట్టిన ఆ దేవదేవుని మానవునిగాక; వారి లీలలను మానవ మనుగడతో సరిపోల్చుకుంటూ అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యంగా తెలుసుకోవాలి. అట్టి "శ్రీకృష్ణావతార జన్మదినం" మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం. శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు. అంటే! (క్రీస్తు పూర్వం 3228 సం||)
కృష్ణజన్మాష్టమి అనగానే మనకు చిన్ని చిన్ని ముద్దుల మొహము కల నల్ల బాలుడు చేతిలో వెన్న పట్టుకుని వున్న యశోదనందనుడు చిన్ని కృష్ణుడు గుర్తు వచ్చేస్తాడు. శ్రీ మహావిష్ణువు మన లోకాన్ని కాపాడటానికి ఎన్నో జన్మలు ఎత్తారు.అందులో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడుగా జన్మించారు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని అంటారు .
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు కంసుడు వారిని బంధించిన చెరసాలలో జన్మించాడు.
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ జోల పాటలు కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రీ కృష్ణుడు జన్మించినాడు. అప్పుడు శ్రీ మహా విష్ణు ఆవిర్భావంతో భూమాత పులకించింది. ప్రకృతి ఆనందానికి తిరుగులేదు.శ్రీ కృష్ణుని జన్మించిన విషయం ఎవరికీ తెలియకుండా వుంది. వాసుదేవుడు ఆ చిన్ని శ్రీ కృష్ణుని దేవకీ నుండి తీసుకుని యమునా నదిని దాటి మరి యశోదమ్మ దరికి చేరి ఆమె పక్కలో పడుకోబెట్టి. యశోదకు జన్మించిన మాయను తీసుకుని వెళ్లి పోయాడు. ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్థమాన మగుచూ తన లీలావినోదాదులచే బాల్యమునుండే, అడుగడుగునా భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట. వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లని కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞాన జ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ వుంటారు.
అలాగునే మరోచిన్నారి చేష్టలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూవుంటే, రాళ్లను విసిరిచిల్లు పెట్టేవాడట. అలా ఆకుండ మానవశరీరము అనుకుంటే ఆకుండలోని నీరు 'అహంకారం' ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని అంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గోపికలుకు మాయ ఆవహించి వుండటం వాళ్ళ ఆ నల్లవాడు చేసే అల్లరిని తట్టుకోలేక యశోదమ్మకు పిరియాదులు చేస్తున్నారు. ఆ అల్లరిని వారు ఎంతో ఆనందంగా అనుభవించేవారు. ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్టశిక్షణ శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్ఞానందకారాన్ని తొలగించుటకు "విశ్వరూపాన్ని" చూపించి గీతను బోధించి, తద్వారా మానవాళికి నామృతాన్ని ప్రసాదించాడు.
శ్రీ కృష్ణుని జననం :
సత్యసంకల్పుడైన పరమాత్మ స్వాయంభువమనువు కోరికెను తీర్చెందుకు, తొలి జన్మ లో పృశ్నిగర్భునిగా, రెండవ జన్మలో అదితి కస్యపులకు వామనునిగా, మూడవజన్మలో దేవకి వసుదేవులకు గొవిందునిగా జన్మించాడు.
తండ్రి వసుదేవుదు జాతకర్మ నిర్వహించలేని నిస్సహాయ స్థిథి లో ఉన్నాడు, స్వామి జననము కారాగౄహములో కాబట్టి !
పాడిరి గంధర్వోత్తము లాడిరి రంభాది కాంతలానందమునన్ గూడిరి సిద్ధులు, భయములు వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్!! అతి ప్రసన్నుడైన వెన్నుని కన్న దేవకి, పున్నమినాడు షోడశ కళాప్రపూర్ణుడైన చంద్రుని కన్న ప్రాగ్దిశవలె చెలువొందినదంటారు పోతన్నగారు. పదహారు కళల పూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినది అర్ధరాత్రి వేళ.
దేవతలకు కూడా దొరకని ఆ పరమ పురుషుడు గోపబాలురతో ఆడి పాడాడు. స్వయంగా అమృతాన్ని పంచిన మోహినీవేషుడు వ్రజవాడలో వెన్న దొంగిలించాడు. ఆకపటనాటక సూత్రధారి రాబోయే యుగాసందికి సంకేతంగా తల్లి చేతి తాళ్ళకు కట్టుబడ్డాడు. ఆ గోవిందుడు గోకులంలోని క్షీరాన్నే కాదు, జలాన్ని కూడా అమృతమయం చెయ్యాలని భావించాడు. అందుకే ప్రతి పసిప్రాణిలోనూ వసివాడని కన్నయ్య పసితనాన్నిభావించగలిగితే అదే జన్మ సాఫల్యం. జీవన మాధుర్యపు ఊటగా మారి ఆ దివ్య నర్తకుని చరణాలమీద అశ్రు అభిషేకం చేయదా!
లోకాలన్నిటినీ కడుపున దాచిన విశ్వంభరుడు గోపాల బాలుడై యశోదానందుల కొడుకైనాడు.
చతుర్భుజాలతో, శంఖు, చక్రాలతో శ్రీవత్సలాంచనాలతో ఉద్భవించిన శ్రీ మహా విష్ణువు దేవకి వసుదేవులకు కన్నులపండుగ చెసాడు . అటువంటి శ్రీ కృష్ణ పరమాత్మ అవతరించిన శ్రావణ బహుళాష్టమి పర్వదినము నేడే. కృష్ణుడు భూమి పై పుట్టింది మొదలు ఎనిమిది సంఖ్యతో ఆయన జీవితం ముడిపడింది. దశవతారాలలో కృష్ణవతారం ఎనిమదవది. స్వామి జన్మించింది ఎనిమిదవ నెలలోనే...అష్టమి తిధి నాడు. కృష్ణసావర్ణ మన్వంతరం ఎనిమదవిది.
దేవతల విశిష్ట గుణాలను అభివర్ణిస్తు , సహస్రనామస్తోత్రాలను మహర్షులు మానవ జాతికి అందించారు.
అయితే , ఒక్క విష్ణు సహస్రనామం మాత్రం శ్రీ కృష్ణుని ఎదుట ఉంచుకుని చెప్పబడింది.
ఫ్రతి విశేషాణాన్ని స్వామి ఆమోదిస్తునట్లు భావిస్తు, భీష్ముడు సహస్ర నామాలను అభివర్ణించాడు.
ఈ చెప్పిన భీష్మపితామహుడు అష్టమి వసువైన ప్రభాసుడు.
స్వామి మతౄగర్భం నుండి ఎనిమదవ నెలలోనే ఆవిర్భవించాడని, అందుకే ఆయనను పద్మపత్రాలలో ఉంచారని ఒక నమ్మకం ఉంది. వటపత్రశాయి ఈ అవతారములో అంబుజపత్రశాయి అయ్యాడు.
నిర్గుణ పరబ్రహ్మం ధర్మ సమ్రక్షణార్ధం అవతరించిన శుభసమయములోనే యోగమాయ చెల్లెలుగా ఆవిర్భవించింది. అందుకే ఆమె కృష్ణ సహోదరి . అన్న చెల్లెలకి అండగా ఉండాలని ,ఆడబిడ్డకు పుట్టింటి అండ ఎప్పటికి అవసరమే అని , ఈ సత్సంప్రదాయాన్ని మనకి నేర్పినవాడు శ్రీ కృష్ణుడు ! మేనత్త కుంతిని గౌరవించాడు. చెల్లెలు వరుసైన ద్రౌపదిని కాపాడాడు. ఇలాగ ఆయన లోక కల్యాణము కోసము ఎన్నో చేసాడు.
భారతయుద్ధం ప్రారంభములో విజయదాయినీ అయిన దుర్గను ధ్యానించమని కృష్ణుడు అర్జునునితో చెప్తాడు.
చాలామంది ముగ్గులతో కృష్ణ పాదాలను ఇంటి ముందు చిత్రిస్తారు. స్వామికి ఆహ్వానంగా. బాలకృష్ణ రూపంనుండి అన్ని కృష్ణ రూపాలూ ఆరాధనీయాలే. అందుకే
కన్నయ్యా తవ చరణం మమ శరణం!!
పెను చీకటికి ఆవల ఎకాకృతితో వెలుగు దివ్యజ్యోతి శ్రీ కృష్ణ పరమాత్మ !
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
ఆదివారం, మే 03, 2015
బుధవారం, ఏప్రిల్ 29, 2015
*దేవతలందరికీ మానవరూపం*.
బుధవారం, ఏప్రిల్ 29, 2015
దేవతలకే రూపురేఖలు దిద్దిన మహా చిత్రకారుడు రాజా రవి వర్మ. రాజా రవివర్మ ట్రావెంకూర్ రాష్ట్రం (నేటి కేరళ) లోని కిలిమనూర్ నందు జన్మించాడు. తండ్రి గొప్ప పండితుడు, తల్లి కవయిత్రి, రచయిత్రి.
యుక్తవయసులోనే రామస్వామి నాయుడు వద్ద వాటర్ పెయింటింగ్, డచ్ జాతీయుడు తీడార్ జన్సన్ వద్ద ఆయిల్ పెయింటింగును నేర్చుకున్నాడు.వియన్నాలో 1873లో జరిగిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ నందు ఆయన పెయింటింగుకు అవార్డ్ లభించడంతో చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచాడు. 1893లో చికాగోలో జరిగిన వరల్డ్ కొలంబియన్ ఎక్స్పోజిషన్ నందు ఆయన పెయింటింగులకు రెండుబంగారుపతకాలు లభించాయి. వస్తు పరిజ్ఞానం కొరకు భారతదేశం అంతటా పర్యటించాడు. దక్షణభారతీయ స్త్రీల సౌందర్యం ఎక్కువగా తన చిత్రకళా వస్తువుగా తీసుకుని హిందూ దేవతలకు, కావ్య మరియు పురాణ నాయికానాయకులకు రూపురేఖలు కల్పించాడు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి.ముఖ్యంగా దుష్యంతుడు శకుంతల, నలదమయంతి తైలవర్ణ చిత్రాలు ప్రత్యేక గుర్తింపును పొందాయి. భారత, రామాయణములందలి పాత్రలనేకం ఆయన ఊహాచిత్ర సృష్టే. అంటే ఆ పాత్రల రూపురేఖలు నేటికీ అలాగే స్థిరపడి పోయాయి. మనందరికీ రాముడంటే ఇలానే వుంటాడు. అలాగే మిగిలిన దేవతా చిత్రాలను వేసి మనకు పరిచయం చేసాడు. మన దేవతలందరికీ మానవరూపం ఇచ్చిన మహా చిత్రకళాకారుడు. రవివర్మ పేరుకు ముందు 'రాజా' అన్నది అతని పెయింటింగ్స్‌కి పురస్కారంగా బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు. ఆ ప్రాంతపు స్త్రీలే ఆయన పెయింటింగ్స్‌కు స్ఫూర్తిగా నిలిచారని ప్రతీతి. ఆయనకు 1873లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన వియానా ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఆయన పెయింటింగ్‌కు ప్రధమ బహుమతి లభించింది. అప్పటి నుంచే ఆయన పేరు దశదిశలా వ్యాపించింది. ఈయన్ని భారతీయ పికాసోగా చెప్పవచ్చు. రవివర్మకే అందని అందాలు లేవేమో. దేవతా చిత్రాలే కాకుండా ఎన్నో అందాలను చిత్రీకరించాడు. అక్టోబర్-2, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.
బుధవారం, ఏప్రిల్ 15, 2015
మోనాలిసా పెయింటింగ్ / లియొనార్డో డావిన్సి
బుధవారం, ఏప్రిల్ 15, 2015
ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా పెయింటింగ్ తెలియని వారు వుండరు. ఈ పెయింటింగ్ చాలా విశిష్టమైనది. ఈ పెయింటింగ్ చూస్తే విచిత్రమైన అనుభూతి కలుగుతుందిట. ఒక్కక్కసారి నవ్వుతున్నట్టు కనిపిస్తుందిట. ఇంకోసారి చూస్తే కోపంగా కనిపిస్తుందిట. ఈ పెయింటింగ్ మీద అనేకమైన శాస్త్రీయమైన ప్రయోగాలు చేస్తున్నారుట.
1499 లో డావిన్సి వెనిస్ నగరం చేరుకున్నాదు. అప్పుడు టర్కీతో యుద్ధం జరుగుతూ ఉండింది. ఆ యుద్ధ సమయంలో ప్రత్యర్థులను కొట్టడానికి కావలసిన సామాగ్రి గురించి, ఆత్మ రక్షణ కోసం ఉపయోగించవలసిన వస్తువుల గురించి, డావిన్సి ఎంతో విశదంగా తెలిపారు. కాని ఆయన ఆలోచనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని ఆచరణలో పెట్టలేదు. ఖర్చు విషయం తప్పిస్తే ఈయన చెప్పినవాటికి ఏవీ సాటి రావని చెప్పవచ్చు. డావిన్సి 1500 లో మళ్ళీ ఫ్లోరెన్స చేరుకున్నాడు. 1503 లో విశ్వ విఖ్యాతమైన "మొనాలిసా" పెయింటింగ్ మొదలుపెట్టాడు. ఈ పెయింటింగ్ పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. ఆ పెయింటింగ్ కు ఆధారమైన్ మోడల్ అమ్మాయి ప్రతీరోజు వస్తు వెళ్తూ వుండేది. ఈ పెయింటింగ్ కు పూర్తి అయ్యాక ఆ చిత్ర్ం లోని అమ్మాయి నవ్వు అతి విచిత్రంగా ఉంది. డావిన్సిని సైతము కట్టి పడేసింది.ఈ నవ్వు మాయాజాలం లా పనిచేసి కోట్లాది మందిని ఆకర్షించగలిగింది.ప్రస్తుతం ఈ పెయింటింగ్. ఫ్రాన్స్ లోని లౌవ్రె మ్యూజియంలో ఉంది. "మోనాలిసా" తో సుప్రసిద్ధుడయ్యాక డావిన్సి మిలాన్ చేరుకుని 1506-1513 మధ్య కాలంలో "ది వర్జిన్ విత్ చైల్డ్", "పెయింట్ ఆన్నె" వర్ణ చిత్రాలను లోక ప్రియంగా రూపొందించాడు. 1513 లో రోమ్ చేరుకున్నాక ఫ్రాన్సిస్ మహారాజు ప్రత్యేక అతిధిగా శేష జీవితం గడిపాడు.
మనకు ఈ పెయింటింగ్ గురించి తెలుసు కానీ ఇది ఎవరు వేసారు అన్నది అందరికీ తెలియదు. ఈ పెయింటింగ్ ను లియొనార్డో డావిన్సి అన్న ప్రముఖ కళాకారుడు వేసాడు.
మనం అతని గురించి తెలుసుకుందాం. లియొనార్డో డావిన్సి ఏప్రిల్ 15, 1452 లో జన్మించారు. ఇతను ఇటాలికి చెందిన ఒక శాస్త్రజ్ఞుడు, గణితజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు మరియు రచయిత. ఇతడు చిత్రీకరించిన చిత్రాలలో ప్రసిద్ది చెందినది లాస్ట్ సప్పర్ మరియు మొనాలిసాచిత్రం. డావిన్సి తల్లిపేరు రజెష్కాటెరిన్స్. 1469 లో ఈయన తండ్రి ష్లోలెంన్స్ కు వెళ్ళీపోయారు. 14 ఏళ్ళ వయస్సు నాటికే మోడలింగ్ లో డావిన్సి ఎంతో ప్రతిభ కనబరిచాడు. ఈయనను ఆండ్రియా డెల్ వెర్రాచివో శిల్పాచార్యునివద్ద చేర్చించాడు డావిన్సి తండ్రి.30 యేళ్ళ వరకు డావిన్సి ప్లోరెన్స్ లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు. కాని ఆదాయం మాత్రము యేమీ ఉండేది కాదు. 1482 లో డావిన్సి మిలాన్ రాజుకు తన గురించి తెలియ జెప్పుకున్నాడు. ఫలితంగా ఈయన మిలిటరీ ఇంజనీరింగ్ కాగలిగారు. ఎన్నో రకాల యుద్ధ పరికరాలను రూపొందించారు. రకరకాల ఆయుధాలను తయారు చేసాడు. ఈయన వీధులు,కాలవలు,చర్చిలు,గుర్రపు శాలలు, రాజ ప్రసాదారు- ఎలా ఉండాలో చెబుతూ వాటికి ప్లానులు వేసేవాడు. అంతేకాదు 1495 లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన "లాస్ట్ సప్పర్" చిత్రాన్ని మొదలుపెట్టి 1497 లో పూర్తి చేశాడు.లాస్ట్ సప్పర్ |
ఎగిరే యంత్రము |
ఎగిరే యంత్రాలను గురించి ఆలోచించి డావిన్సి ఎన్నో రకాల నమూనాలను తయారుచేసాడు. హెలికాప్టర్ వంటివి తయారుచేశాడు.మనిషి శరీరం గురించి పూర్తి వివరాలు తెలియజేశాడు. నీటి గడియారాన్ని అందించాడు.బరువైన వాటిని తేలికగా తొలగించే "క్రేన్" లను డావిన్సి ఆకాలం లోనే యేర్పాటు చేశాడు. 1519 లో మరణించాడు.
లేబుళ్లు:
పరిశోధకులు,
పుట్టిన రోజులు,
art and crafts,
Greeetings
గురువారం, ఏప్రిల్ 09, 2015
ధ్వని రికార్డు చేసుకునే యంత్రం
మనం చాలా సులువుగా మనకు నచ్చిన ధ్వనిని రికార్డ్ చేయగలుగుతున్నాం. అలా రికార్డ్ చేయటానికి ఈనాడు అయితే అనేకనేక పరికరాలు అందుబాటులో వున్నాయి. మన చేతిలో నిరంతరం వుండే మొబైల్ నుండి కూడా ధ్వనిని రికార్డ్ చేసేస్తాం. అంతకు ముందు టేప్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేసేవారు. వీటి అన్నిటికంటే ముందు అసలు ధ్వని రికార్డు చేసుకునే యంత్రం ను ఎప్పుడు నుండి ఎలాంటి పరికరం ద్వారా రికార్డ్ చేసేవారంటే ! 1860 వ సంవత్సరం ఏప్రిల్ 9 న ధ్వని రికార్డు చేసుకునే యంత్రం ను కనుగొన్నారు. దాని పేరు ఫొనాటోగ్రాఫ్ యంత్రం ( Phonautograph ).
దీనిని మొట్ట మొదట ఫ్రెంచ్ మెన్ Édouard-Léon Scott de Martinville కనుక్కోనాడు. దానిమీద పూర్తి అధికారాలు మార్చి 25 1857 లో పొందాడు. ఇతను ఫ్రెంచ్ ప్రింటర్ మరియు పుస్తకాలు అమ్మకం వ్యాపారం చేస్తూవుండేవాడు. వృత్తిరీత్యా అతను ఒక ప్రింటర్, అతను ఎల్లప్పుడూ కొత్త కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు గురించి చదువుతూవుండేవాడు మరియు అతను ప్రయోగాలు కూడా చేసేవాడు . స్కాట్ డి MARTINVILLE కాంతి మరియు ఫోటో కోసం ఫోటోగ్రఫీ అప్పటి కొత్త టెక్నాలజీ ద్వారా అతనికి ఆలోచన వచ్చింది. ఒక విధంగా ఆలోచించి మనిషి యొక్క ప్రసంగం యొక్క ధ్వనిని రికార్డింగ్ చెయ్యాలి అనే ఆసక్తి కలిగింది.
1853 నుండి ఆయన స్వర శబ్దాలు లిప్యంతరీకరణ యంత్రాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఒక భౌతిక పాఠ్య పుస్తకం లోని మానవుని శారిర శాస్త్రంలో చెవి అంతర్బాగం డ్రాయింగ్లు వున్నాయి . అతను కర్ణ భేరిని చూసి దాని మాదిరిగా, ఒక దీపపు మసితో కవర్ అయిన ఒక కాగితం, చెక్క లేదా గాజు ఉపరితలంపై వత్తుతారు ప్రతిపాదిత ఒక stylus తో చిన్న ఎముక కోసం లేవేర్ యొక్క ఒక ధారావాహిక కొరకు సాగే పొర చొప్పిస్తూ ఒక యాంత్రిక పరికరం ను తయారు చేసారు. జనవరి 1857 26 న, అతను ఫ్రెంచ్ అకాడమీకి తన సీల్ చేయబడిన కవర్లో డిజైన్ అందించాడు.
Phonautograph ను తయారు చేయటానికి ఒక దీపం నలుపు పూత, చేతితో త్రిప్పే క్రాంక్ సిలిండర్పై ఒక చిత్రం చెక్కబడివుంది. ఇది ఒక గట్టి bristle తో కంపింపచేసే ఇది ఒక డయాఫ్రమ్ జత, ధ్వని సేకరించడానికి ఒక కొమ్ము ఉపయోగించారు . స్కాట్ ధ్వని వాయిద్యం మేకర్ రుడోల్ఫ్ కోనిగ్ సహాయంతో పలు పరికరాలను నిర్మించారు. 1877 యొక్క ఎడిసన్ యొక్క ఆవిష్కరణ కాకుండా, ఫోనోగ్రాఫ్, Phonautograph మాత్రమే ధ్వని మరియు దృశ్య చిత్రాలు రూపొందించినవారు. కానీ దానిని రికార్డింగ్ ఆడడానికి వీలు లేదు. స్కాట్ డి MARTINVILLE యొక్క పరికరం మాత్రమే ధ్వని తరంగాల శాస్త్రీయ పరిశోధనలు కోసం ఉపయోగించారు.
లేబుళ్లు:
పరిశోధకులు,
art and crafts,
Events,
photos
శుక్రవారం, ఫిబ్రవరి 06, 2015
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)