తాత్పర్యము: మనము సక్రమముగా పూర్తిచేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపములాటంకములు కావచ్చునని భయపడనవసరము లేదు. ఎందుచేతనంటే శ్రీ కృష్ణుడే మన ఈ వ్రతానికి కారకుడు మరియు నాయకుడు. అతని గుణములు ఆశ్చర్యకరములైనవి. అతని పనులు కూడా అట్టివే. ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు. నిర్మలమైన జలముగల యమునానది ఒడ్డున నివసించుచు మనకొరకు యదుకులమందున అవతరించిన మహానుభావుడు. తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు. అంతటి మహాత్ముడి ఉండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్య మూర్తి. కనుక మనము సందేహములను వీడి పరిసుద్దములై అతనిని సమీపించి పరిసుద్దమైన వికసించిన హృదయకుసుమమును సమర్పించి నోరార పాడాలి. నిర్మలమైన మనస్సుతో ద్యానిమ్చాలి. అంతటనే వెంటనే ఇంతకుముందు పాప సమూహము రాబోవు పాపముల సమూహము మంటలో పడిన దూది వలె భస్మము అయిపోతాయి. మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.
ధనుర్మాసవ్రతము చేసే ప్రతీదినము పొంగలి నివేదన అర్పిస్తాము. కానీ కొన్ని ప్రత్యేక పాశురము లకు ప్రత్యేక నివేదన గోదాసహిత రంగనాదునకు అర్పించాలి. మరి ఆ ప్రత్యేక పాసురాలు వాటికి అర్పించవలసిన నివేదనలు ఏమిటంటే.....
తాత్పర్యము: పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారము ఎత్తి బలిచక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానము అడిగెను. బలిచక్రవర్తి అలాగే అని దానము చేయగా వామనుడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించారు. అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయుచూ వ్రతనిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వరిచేను కన్నులకానందము కలుగచేయాలి. చేనులోని నీటిలో చేపలు యెగిరి పడుచు మనస్సును ఆకర్షించవలెను. అన్ని పైరులును బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలెను. పాలు పితుకువారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చోండి పోదుగునంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను. స్థిరమైన సంపదదేశమంతటను విస్తరింపవలేనని ఈ పాసురములోని గోదామాత కోరుచున్నది.