సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు , మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విదియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము. సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షిమ్చితివా! మేము అనుభావిమ్చియే తీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును.
ముప్పది మూడుకోట్ల అమరులకు వారికింకను ఆపద రాక ముందే పోయి , యుద్ధ భూమిలో వారికి ముందు నిలిచి , వారికి శత్రువుల వలన భయమును తొలగించే బలసాలీ ! మేల్కొనుము అర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము గలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శ త్రువులుగా భావించి వారికి భయ జ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకో ! బంగారు కలశములను పోలిన స్థానములను, దొండపండువలెఎర్రని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవి! పరిపుర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేలుకొనుము. వీచుటకు ఆలవట్టమును (hand fan) కంచుతద్దమును మా కోసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానము చేయునట్లు చేయుము.