ఆనాడు బలి చక్రవర్తి తనదికాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడించగా ఈ లోకమునంతను వానివద్దనుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదములకు మంగళము .రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావనుడుండు లంకకే వెళ్లి సుందరమగు భవనములు కోటయుగల దక్షినదిసనున్న లంకలో ఉన్నా రాక్షసులను చెండాడిన మీ భాహు పరాక్రమములకు మంగళము . శ్రీ కృష్ణునకు రక్షణకై యుంచిన బండిపై ఆవేసించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము .వత్సము పై ఆవేసించిన అసురునితో వెలగ చుట్టుపై నాఎసించిన యసురుని చంపుటకై ఓడిసేలరాయి విసరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసరనపుడు ముందువేనుకకు పాదములుంచి నిలచిన మీ దివ్య పాదములకు మంగళము. ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినని కోపముతో రాళ్ళ వాన కురియగా గోపాలురకు గోవులకు భాధ కలుగకుండా గోవర్ధన పర్వతమును గోడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. శ త్రువులను సములముగా పెకలిచి విజయము నార్జించి ఇచ్చేది మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము.
ఈ విధముగా నీ వీర చరత్రములనే కీర్తించి పర అనే సాధనము నందగ మేమీనాడు వచ్చాము అనుగ్రహించుము.
అని ఈ పాశురములో మంగళము పాడుతూ భగవానుని అనుగ్రహించమని కోరుచున్నారు.
నాకు చాలా ఇష్టమైన శాస్త్రవేత్త గురించి ఈరోజు మీతో చెప్తాను. అతను ఎవరంటే ఐనిస్టీన్ తర్వాత అంతటి మేధావిగా మన్ననలు అందుకుంటున్న ప్రఖ్యాత బిటిష్ ఫిజిక్స్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. కాలానికి ఆరంభం ఉందా? మరి అంతమో! కాలం వెనుకకి ఎందుకు నడవదు? మనకు గతమే జ్ఞాపకముంటుంది. భవిష్యత్తు ఎందుకు ముందుగా తెలియదు? పసిపిల్లాడి కుతూహలాన్ని మహామేధావి అన్వేషణనీ కలగలిపితే స్టీఫెన్ హాకింగ్ అవుతాడు. కాలం కథ (A Brief History of Time) లో మనల్ని విశ్వవిహారానికి తీసుకెళతాడు హాకింగ్.ఈరోజు స్టీఫెన్ హాకింగ్ జన్మదినం. తనంతట తాను కనీసం కదలలేని ఎలాంటి సహకారం లేని శరీరము, మాట్లాడాలి అంటే కంప్యుటర్ సహాయంతో చక్రాల కుర్చికి అతుక్కుపోయిన మనిషి అతి అరుదైన మోటార్ న్యురాన్ వ్యాధి కలిగి తన శరీరాన్ని మొత్తం పనిచేయకుండా వున్నా కూడా విచిత్రంగా అతని మెదడు మాత్రమే పూర్తిగా పనిచేస్తుంది . ఇది కేవలము అరుదైన విషయం వైద్య శాస్త్రానికే పెద్ద సవాలుగా చెప్పుకోవచ్చు. ఇదంతా కేవలము ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ యొక్క సంకల్ప బలం మాత్రమే . అతనికి వచ్చిన వ్యాధి చాలా అరుదైన ప్రమాదకరమైనది. ఆవ్యాధిని కూడా లెక్కచేయకుండా అపరమార్కండేయుడుగా వున్నవాడు స్టీఫెన్ హాకింగ్. కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం.
స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందించారు. ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే.
అప్పటికి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలిలియో మరణించి దాదాపు 300 సంవత్సరాలు అవుతోంది. గెలిలియో మరణించి న రోజు జనవరి 8వ తేది నాడే 1942 వసంవత్సరం జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు. లండన్ లోని హైగేట్స్ లో స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని ప్రారంభించాడు. మిల్ హిల్ ప్రాంతములో తండ్రి స్టీఫెన్ ని అక్కడి సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో చేర్చాడు. తన గణిత ఉపాధ్యాయుని ప్రేరణతో గణితశాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామనుకున్నాడు స్టీఫెన్. కాని దానికి వ్యతిరేకంగా తండ్రి రసాయనశాస్త్రంలో చేర్పించాడు. తరువాత 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్ పరీక్ష రాశాడు. అందులో సఫలీకృతుడు కాగలిగినా భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశాడు స్టీఫెన్. 1962లో కేవలం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కాగలిగాడు. కాస్మాలజి, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కి వెళ్ళాడు. అప్పటి నుంచి స్టీఫెన్ పరిస్థితి పూర్తిగా మారింది. అన్నం తినాలన్నా, కనీసం బూట్ల లేసు కట్టుకుందామన్నా, స్టీఫెన్ శరీరం సహకరించేది కాదు. క్రిస్‌మస్ సెలవులకు ఇంటికి వెళ్ళిన స్టీఫెన్ పరిస్థితి ఆయన తల్లిదండ్రులను కలవర పెట్టింది. భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది. తల్లిని మధనపెట్టింది. ఆ సమయంలోనే ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి (Motor Neuron Disease) అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది. దీనినే Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధి అని కూడా అంటారు. నాడీ మండలం పై అంటే నరాలు, వెన్నుపూస పై ఇది ప్రభావం చూపుతుంది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా. కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. మళ్లీ విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చిన హాకింగ్ తన పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి మిత్రులు సహకరించాలని చూసినా స్టీఫెన్ సున్నితంగా తిరస్కరించే వాడు. ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పని చేసిన స్టీఫెన్ కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించాడు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి వుందన్న విషయాన్ని కూడా మరచి పోయాడు. క్వాంటం థియరి, జనరల్ రిలెటివిటీ లను ఉపయోగించి... కృష్ణబిలాలు కూడా రేడియేషన్ ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లోఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్పుస్తకరచన ప్రారంభించాడు. ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యుల xbvbdng ఉండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ కాలం కథపేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగాఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. "శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువు కు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి అవిఅన్నీ పూర్తిచేస్తాను" అంటారు హాకింగ్. తాను భరించలేని బాధకు గురైన పక్షంలో...ఇక తాను ప్రపంచానికి చేయగలిగిందీ ఏమీ లేదని భావిస్తే...ముఖ్యంగా తనను ప్రేమించే వారికి తాను భారమైతే ఇతరుల సహకారంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమేనని ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ బతికే హక్కు ఉన్నట్లే.. చనిపోయే హక్కు కూడా ఉండాలని భావించే హాకింగ్, ప్రముఖ కమెడియన్ డారా ఓ బ్రియేన్‌కు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ‘ది డెయిలీ టెలిగ్రాఫ్’ వెల్లడించింది. అతనికి వచ్చిన ముఖ్యమైన అవార్డులు Prince of Asturias Award 1989 లోను Copley Medal 2006 లోను వచ్చాయి. అపర మార్కండేయుడు సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త,కాలబిలాలు,Theoretical cosmology,Quantum gravity అవిష్కారవేత్త స్టీఫెన్ విలియం హాకింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు.
పర్వత గుహలో వర్షాకాలములో కదలక మెదలక పడుకున్న సౌర్యముగల సింహము మేలుకొని , తీక్ష్ణమగు చూపులు నిటునటు చూచి , ఒకవిధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడు నట్లు చేసి, , అన్ని వైపులా దొర్లి , దులుపుకొని , వెనుకకు ముందుకు శరీరమును చాపి , గర్జించి , గుహనుండి వేల్వడునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ ! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేయి రమణీయ సన్నీవేశము గల లోక్కోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుగ ప్రార్ధించుచున్నాము. అలా కోరటంతో శ్రీ కృష్ణ పరమాత్మ తన శయనాగారమును వీడి నడచి వచ్చి సింహాసనము నధిరోహించి గోపికలను యుక్తరీతిని పలుకరించవచ్చునని అనుకోవచ్చును.