మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం
శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు
వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి
మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు
పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా ఉన్
కోయిల్ నిన్ఱు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ
శీరియ శింగాశనత్తిరుందు యాం వంద
కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
పర్వత గుహలో వర్షాకాలములో కదలక మెదలక పడుకున్న సౌర్యముగల సింహము మేలుకొని , తీక్ష్ణమగు చూపులు నిటునటు చూచి , ఒకవిధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడు నట్లు చేసి, , అన్ని వైపులా దొర్లి , దులుపుకొని , వెనుకకు ముందుకు శరీరమును చాపి , గర్జించి , గుహనుండి వేల్వడునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ ! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేయి రమణీయ సన్నీవేశము గల లోక్కోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుగ ప్రార్ధించుచున్నాము.అలా కోరటంతో శ్రీ కృష్ణ పరమాత్మ తన శయనాగారమును వీడి నడచి వచ్చి సింహాసనము నధిరోహించి గోపికలను యుక్తరీతిని పలుకరించవచ్చునని అనుకోవచ్చును.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.