శనివారం, ఫిబ్రవరి 13, 2016
భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి అయిన సరోజనీ దేవి జయంతి నేడు. సరోజినీ దేవి 1935 డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెష్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నర్ కూడా. ఈమె గొప్ప భారతదేశపు గర్వించదగ్గ మహిళ. "హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో సభల్లోనూ, సమావేశాల్లోనూ ప్రసంగాలు ఇచ్చి ప్రజలతో మమైకం అయ్యింది ఈమె. స్వాతంత్రోద్యమంలో పాల్గొనిన ఆధునిక భారతదేశ ప్రముఖ స్త్రీలలో ఈమె ఒకరు. ఈమె హైదరాబాద్‌లో 1879 వ సంవత్సరంలో జన్మించెను. సరోజినీ తండ్రి పేరు అఘోరనాధ చటోపాధ్యాయ. బెంగాలు దేశానికి చెందిన వ్యక్తి. వృత్తిరిత్యా హైదరాబాదులో స్థిరపడ్డాడు. తల్లి వరదసుందరీదేవీ. తల్లిదండ్రులిద్దరూ విద్యావేత్తలు కావటంవలన విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేసేవారు. ఆ రోజుల్లో స్రీ విద్య గురించి అనేక ఆంక్షలుండేవి పెద్ద కుటుంబాల వారెవ్వరూ తమ ఆడపిల్లలను పదవ తరగతి మించి చదివించేవారు కాదు. అటువంటి సమయంలో వారిద్దరూ స్త్రీ విద్య గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వారిని పై చదువులు చదివించడానికి ప్రోత్సహించారు. సరోజినీదేవికి అయిదుగురు సోదరులుండేవారు.ఆమె సోదరీ మణులు ముగ్గురు. అందరూ బాగా చదువుకున్నవారే. 1891లో జరిగిన మెట్రిక్ పరీక్షలో మొత్తం రాష్ట్రంలో ప్రధమ స్థానం సరోజినీదేవి చేజిక్కించుకుని, అందరి ప్రశంసలు పొందటంతో, నిజాం నవాబు ఉప్పొంగిపోయి, ఆమెను విదేశాలకు పంపి చదువు చెప్పించాలని నిర్ణయంచుకొని, ఆమె తండ్రికి ఆ విషయంచెప్పి, ఒప్పించి తాను అనుకున్నది సాధించాడు. సరోజినీదేవికి చిన్నతనం నుంచి కవిత్వమంటే ఎంతో ఇష్టం. 1898 వరకు ఆమె విదేశాల్లో ఉండి అపారమైన విజ్ఞానాన్ని సంపాదించింది. ఇంగ్లాండు, ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు తిరిగి వారి నుండి ఎన్నో విషయాలను నేర్చుకుని మంచి స్నేహితురాలిగా, కవయిత్రిగా వారి నుంచి ప్రశంసలు అందుకొని భారతదేశం తిరిగి వచ్చింది. ఇక్కడకు వచ్చిన తరువాత డాక్టర్ గోవిందరాజులు నాయుడుగారిని ప్రేమించి వివాహమాడి, ఎందరికో ఆదర్శ మహిళ అయింది. గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం ప్రకటించటంతోటే, ఈమె దానిలో పాల్గొనింది. ప్రభుత్వానికి ఎదురు తిరిగి తూటా దెబ్బలకో, చీకతి కొట్లకో బలయ్యేబదులు ఈ బానిస బ్రతుకే నయమనుకుని సర్దుకుపొయ్యె అమాయక ప్రజానీకములో ఆమె ఉపన్యాసాలు దేశభక్తిని నూరి పోసి చావుకు కూడా భయపడని తెగింపును తేగలిగాయి. "జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు జరిగితే దేశనికి జరిగినట్టే, దేశం అనుభవించే బానిసతనం నీవూ అనుభవించవలసినదే" అంటూ దేశమంతా తిరిగి దేశభక్తిని నూరిపోసించా వీరతిలకం. సరోజిని నాయుడు 1925 లో భారతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ. ఈమె స్త్రీ విమోచన కోసమూ, అస్పృశ్యతా నివారణ కోసమూ, ఆసక్తితో కృషి చేశారు. ఈమె గొప్ప కవయిత్రి. ఈమె అనేక పద్యాలను, ఆంగ్లంలో 'గోల్డెన్ త్రెషోల్డు', 'బర్డ్సు ఆఫ్ టైం', 'ఫెదరర్ ఆఫ్ ది డాన్' అనే గ్రంథాలను రచించారు. ఈమెను 'భారతదేశపు కోకిల' అన్నారు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత ఉత్తరప్రదేశ్ గవర్నరుగా నియమితులైనారు. ఆమె రచించిన కావ్యాలలో "కాలవిహంగం"(Bird of time), "స్వర్గ ద్వారం" (the Golden Threshold) , విరిగిన రెక్కలు(the broken wings) అనేవి చాలా ప్రసిద్ధమైనవి. 19వ శతాబ్దం చివరలో రచించింది Nightfall In The City Of Hyderabad ఇది చదివితే సంధ్యా సమయంలో హైద్రాబాద్ నగరం ఏ విధంగా ఉండేది అని తెలుస్తుంది. తండ్రి మరణాంతరం రచించిన విషాదకవితలు ఈమెకు కైసర్-ఇ-హిండ్' బంగారు పతాకాన్ని సాధించిపెట్టింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో అతిపెద్ద అప్పటి రాష్ట్రం ఉత్తరప్రదేశకి ఈమె గవర్నరు గా నియమించబడింది. హైదరాబాదులో తాను నివశించిన ఇంటికి తన మొదట కవితాసంకలనం పేరునే స్వర్ణప్రాగణంగా"ఎన్నుకొన్నది.ఈమె 1949 మార్చి 2న లక్నోలో మరణించినది. ఈమె జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 13న ఈమె చిత్రంతో ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది.ఈమెపై అభిమానంతో హైదరాబాదులో సికింద్రాబాద్ దగ్గర ఒక వీధికి సరోజినీ దేవి రోడ్డూ' అని నామకరణం చేసారు. ఈమె పేరున హైదరాబాదులో సరోజినీ కంటి ఆసుపత్రీ'ని కూడా స్థాపించారు. ఈవిడగారి విలువైన వస్తువులు ఇప్పటికీ సాలార్ జంగ్ మ్యూజియంలోను, జాతీయ పురావస్తు ప్రదర్శనశాలలోనూ భద్రంగా ఉన్నాయి.
శుక్రవారం, ఫిబ్రవరి 12, 2016
|
దయానంద - 'పాఖండ ఖండిని ' పతాకము |
ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడి, హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన స్వామి దయానంద సరస్వతి జయంతి నేడు . ఈయన 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటం లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర సమర యోధులకు ప్రేరణ గా నిలిచాడు స్వామీ దయానంద సరస్వతి .
స్వామి దయానంద సరస్వతి 1824 సంవత్సరం లో గుజరాత్ లోని ఠంకార అనే గ్రామంలోని మహాశివభక్తులు అయిన ఒక వర్తక కుటుంబం లో జన్మిచారు. ఈయన చిన్ననాటి నుండి భగవద్భక్తి ఎక్కువగా కలిగివున్నాడు. 1846 లో భగవంతుడిని వెతకడానికి ఇల్లు వదిలి వెళ్లాడు. ఈ ప్రయాణంలో ఎందరో యోగులు మునుల సాంగత్యంలో గడిపి దయానందఅన్న నామం పొందాడు. భగవంతుని తపనలో భ్రమిస్తూ మథుర లోని స్వామి విరజానంద సరస్వతి కడకు చేరుకున్నాడు, అక్కడే వేదోపనిషత్తులను ఔపోసనం పట్టి గురువు ఆజ్ఞ మేరకు దేశమంతట ప్రబోధించుటకు బయలుదేరెను. ధర్మం పేరిట జరిగే మోసాలు మూఢనమ్మకాలు గ్రహించాడు. అలాంటి అధర్మాలను రూపుమాపటానికి ప్రయత్నించారు. ప్రయాణ మార్గమున దేశ స్థితిగతులు, దీనమైన శోచనీయమైన హిందు సమాజమును అవగాహన చేసుకున్నాడు. భారతావని బ్రిటిష్ పాలనలో ఉంది, ఒకప్పుడు విశ్వమానవ సామ్రాజ్యానికి, ధర్మ సంస్కృతులకు కేంద్రమైన దేశం ఇప్పుడు, అపారమైన దరిద్రంలో స్వయం వినాశనానికి పరుగులెడుతుండడం చూసి శోకించాడు. హిందు సమాజం ఎటువైపు నుండి చూసినా కుల, మత వర్గ విభేదాలతో ఖండములగుచున్నది, అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలు ధర్మం పేరుతో జరుగుతున్న అవాంఛనీయమైన ఆచారాలు చూసిచలించి పోయి వాటిని ఛేదించడానికి 'పాఖండ ఖండిని ' అన్న పతాకాన్ని ఆవిష్కరించినాడు. భారత దేశాన్ని, హిందు సమాజాన్ని జాగృత పరచాలని సంకల్పించి ఎన్నో పురోగామి సంస్కరణలు చేపట్టాడు. అందులో భాగంగా సతి, బాల్య వివాహాలు, అంటరానితనం, వరకట్న దురాచారాన్ని బహిష్కరించాడు. స్త్రీ విద్య పరిచయం చేసాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోవాలని నమ్మి (స్వరాజ్) స్వయం పరిపాలన అని మొదటి సారి గొంతెత్తినాడు. దయానందుడు వ్రాసిన సత్యార్థ ప్రకాశ్ లో భారత దేశం నుండి సమస్త భారతీయుల మనసులలోని మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాల నిర్మూలన గూర్చి వ్యాఖ్యానించాడు. ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా, దేశ సంఘ సంస్కరణకు పునాదిగా, 10 ఏప్రిల్ 1875 న ముంబాయి నగరంలో మొదటి ఆర్యసమాజము స్థాపించినాడు. ఈ క్రమంలో దయానంద సరస్వతి పెక్కుమందికి కంట్లో నలుసు అయినాడు, పూర్వం ఏడు సార్లు విషప్రయోగాలు జరిగిననూ బస్తి, న్యోళి అనే యోగ ప్రక్రియ ద్వారా ప్రేగులను ప్రక్షాళనము చేసుకుని వాటిని విఫలము చేసినను, చివరిసారిగా 30 అక్టోబర్ 1883 సాయంత్రము జరిగిన విష ప్రయోగంతో క్షీణిస్తూ ఓంకారనాదంతో సమాధి అవస్థలో మోక్షాన్ని పొందాడు.
ఆదివారం, జనవరి 31, 2016
హరి రసమా విహారి సతు
సరసోయం మమ శ్రమ సంహారి
దయా నిభృత తనుధారి సం
శయాతిశయ సంచారి
కయాప్యజిత వికారి
క్రియా విముఖ కృపాలధారి
సదా మిథ్యా జ్ఞానీ సతు
మదాలిమతాభిమానీ
తదా శ్రిత సంధానీ సతు
తదా తదా చింతా శయనాని
పరామృత సంపాది
స్థిరానందాశ్రేది
వరాలాభ వివాది శ్రీ -
తిరువేంకటగిరి దివ్య వినోది
శనివారం, జనవరి 30, 2016
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత
గా గౌరవిస్తారు. సత్యము
, అహింసలు
గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ
,సత్యాగ్రహము
ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని
గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి
స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. 1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే
అనే వ్యక్తి రివాల్వర్ తో గాంధిజీ ని కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు. గాంధి వర్ధంతిని అమరవీరుల దినోత్సవం గా జరుపుకుంటున్నారు . ఈరోజున భారతదేశం అంతట 11గంటలకి సైరన్ మోగుతుంది . భారతదేశ ప్రజలందరూ స్వాతంత్రం పోరాటంలో ప్రాణాలు అమరవీరులకు 2 నిమిషాలు మౌనం శ్రద్ధాంజలి ఘటిస్తారు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ