శనివారం, ఫిబ్రవరి 13, 2016
భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి అయిన సరోజనీ దేవి జయంతి నేడు. సరోజినీ దేవి 1935 డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెష్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నర్ కూడా. ఈమె గొప్ప భారతదేశపు గర్వించదగ్గ మహిళ. "హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో సభల్లోనూ, సమావేశాల్లోనూ ప్రసంగాలు ఇచ్చి ప్రజలతో మమైకం అయ్యింది ఈమె. స్వాతంత్రోద్యమంలో పాల్గొనిన ఆధునిక భారతదేశ ప్రముఖ స్త్రీలలో ఈమె ఒకరు. ఈమె హైదరాబాద్‌లో 1879 వ సంవత్సరంలో జన్మించెను. సరోజినీ తండ్రి పేరు అఘోరనాధ చటోపాధ్యాయ. బెంగాలు దేశానికి చెందిన వ్యక్తి. వృత్తిరిత్యా హైదరాబాదులో స్థిరపడ్డాడు. తల్లి వరదసుందరీదేవీ. తల్లిదండ్రులిద్దరూ విద్యావేత్తలు కావటంవలన విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేసేవారు. ఆ రోజుల్లో స్రీ విద్య గురించి అనేక ఆంక్షలుండేవి పెద్ద కుటుంబాల వారెవ్వరూ తమ ఆడపిల్లలను పదవ తరగతి మించి చదివించేవారు కాదు. అటువంటి సమయంలో వారిద్దరూ స్త్రీ విద్య గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వారిని పై చదువులు చదివించడానికి ప్రోత్సహించారు. సరోజినీదేవికి అయిదుగురు సోదరులుండేవారు.ఆమె సోదరీ మణులు ముగ్గురు. అందరూ బాగా చదువుకున్నవారే. 1891లో జరిగిన మెట్రిక్ పరీక్షలో మొత్తం రాష్ట్రంలో ప్రధమ స్థానం సరోజినీదేవి చేజిక్కించుకుని, అందరి ప్రశంసలు పొందటంతో, నిజాం నవాబు ఉప్పొంగిపోయి, ఆమెను విదేశాలకు పంపి చదువు చెప్పించాలని నిర్ణయంచుకొని, ఆమె తండ్రికి ఆ విషయంచెప్పి, ఒప్పించి తాను అనుకున్నది సాధించాడు. సరోజినీదేవికి చిన్నతనం నుంచి కవిత్వమంటే ఎంతో ఇష్టం. 1898 వరకు ఆమె విదేశాల్లో ఉండి అపారమైన విజ్ఞానాన్ని సంపాదించింది. ఇంగ్లాండు, ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు తిరిగి వారి నుండి ఎన్నో విషయాలను నేర్చుకుని మంచి స్నేహితురాలిగా, కవయిత్రిగా వారి నుంచి ప్రశంసలు అందుకొని భారతదేశం తిరిగి వచ్చింది. ఇక్కడకు వచ్చిన తరువాత డాక్టర్ గోవిందరాజులు నాయుడుగారిని ప్రేమించి వివాహమాడి, ఎందరికో ఆదర్శ మహిళ అయింది. గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం ప్రకటించటంతోటే, ఈమె దానిలో పాల్గొనింది. ప్రభుత్వానికి ఎదురు తిరిగి తూటా దెబ్బలకో, చీకతి కొట్లకో బలయ్యేబదులు ఈ బానిస బ్రతుకే నయమనుకుని సర్దుకుపొయ్యె అమాయక ప్రజానీకములో ఆమె ఉపన్యాసాలు దేశభక్తిని నూరి పోసి చావుకు కూడా భయపడని తెగింపును తేగలిగాయి. "జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు జరిగితే దేశనికి జరిగినట్టే, దేశం అనుభవించే బానిసతనం నీవూ అనుభవించవలసినదే" అంటూ దేశమంతా తిరిగి దేశభక్తిని నూరిపోసించా వీరతిలకం. సరోజిని నాయుడు 1925 లో భారతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ. ఈమె స్త్రీ విమోచన కోసమూ, అస్పృశ్యతా నివారణ కోసమూ, ఆసక్తితో కృషి చేశారు. ఈమె గొప్ప కవయిత్రి. ఈమె అనేక పద్యాలను, ఆంగ్లంలో 'గోల్డెన్ త్రెషోల్డు', 'బర్డ్సు ఆఫ్ టైం', 'ఫెదరర్ ఆఫ్ ది డాన్' అనే గ్రంథాలను రచించారు. ఈమెను 'భారతదేశపు కోకిల' అన్నారు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత ఉత్తరప్రదేశ్ గవర్నరుగా నియమితులైనారు. ఆమె రచించిన కావ్యాలలో "కాలవిహంగం"(Bird of time), "స్వర్గ ద్వారం" (the Golden Threshold) , విరిగిన రెక్కలు(the broken wings) అనేవి చాలా ప్రసిద్ధమైనవి. 19వ శతాబ్దం చివరలో రచించింది Nightfall In The City Of Hyderabad ఇది చదివితే సంధ్యా సమయంలో హైద్రాబాద్ నగరం ఏ విధంగా ఉండేది అని తెలుస్తుంది. తండ్రి మరణాంతరం రచించిన విషాదకవితలు ఈమెకు కైసర్-ఇ-హిండ్' బంగారు పతాకాన్ని సాధించిపెట్టింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో అతిపెద్ద అప్పటి రాష్ట్రం ఉత్తరప్రదేశకి ఈమె గవర్నరు గా నియమించబడింది. హైదరాబాదులో తాను నివశించిన ఇంటికి తన మొదట కవితాసంకలనం పేరునే స్వర్ణప్రాగణంగా"ఎన్నుకొన్నది.ఈమె 1949 మార్చి 2న లక్నోలో మరణించినది. ఈమె జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 13న ఈమె చిత్రంతో ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది.ఈమెపై అభిమానంతో హైదరాబాదులో సికింద్రాబాద్ దగ్గర ఒక వీధికి సరోజినీ దేవి రోడ్డూ' అని నామకరణం చేసారు. ఈమె పేరున హైదరాబాదులో సరోజినీ కంటి ఆసుపత్రీ'ని కూడా స్థాపించారు. ఈవిడగారి విలువైన వస్తువులు ఇప్పటికీ సాలార్ జంగ్ మ్యూజియంలోను, జాతీయ పురావస్తు ప్రదర్శనశాలలోనూ భద్రంగా ఉన్నాయి.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.