Blogger Widgets

బుధవారం, అక్టోబర్ 04, 2017

నీవే మాకు దిక్కు

బుధవారం, అక్టోబర్ 04, 2017




నీవే మాకు దిక్కు నిన్నే తలతుము 
కావు మా నేర మెంచక కరుణానిధీ 

నెట్టన  సూర్యు లోని నెకొన్న తేజమా 
గట్టిగా జంద్రునిలోనీ  కాంతిపుంజమా 
పుట్టి రక్షించే యజ్ఞ పురుషుని ప్రకాశమా 
వోట్టుక దేవతలలో నుండిన శక్తీ     

సిరులు మించిన యట్టి జీవులలో ప్రాణమా 
గరిమ వేదములలో గల యర్థమా    
పరమపాదమునందు బాదుకొన్న బ్రహ్మమా 
చరాచరములలో సర్వాధారమా 

జగములో వెల సేటిసంసారసుఖమా 
నిగిడిన మంత్రముల నిజమహిమా 
మిగుల శ్రీవేంకటాద్రి మీదనున్న దైవమా 
ముగురు వేల్పులలోని మూలకందమా  

బుధవారం, సెప్టెంబర్ 20, 2017

'పోలాంబ'

బుధవారం, సెప్టెంబర్ 20, 2017

Image result for gauri goddess statue
దసరా ముందువచ్చే అమావాస్య నాడు అనగా శ్రావణ బహుళ అమావాస్య రోజును  పోలాల అమావాస్య అని అంటారు. ఈ పండగ కు కందమొక్క మరియు బచ్చలి మొక్కకు పూజ చేస్తారుపూజలో ఒక కథ కూడా చెప్తారుఇది పెళ్ళయిన ఆడవాళ్ళుపిల్లల కలవారు వారి శ్రేయస్సు కోసం చేస్తారు.  పిల్లలు లేనివారు పిల్లలు కలగటానికి ఈ పూజ చేస్తారు.  ఈ పూజలో ఆడపిల్లు కావాలనుకునేవారు గారెలు దండ అమ్మవారికి వేస్తామని, మొగపిల్లలు కావలి అనే కోరిక కలవారు పూర్ణం బూరెలు దండ అమ్మవారికి వేస్తామని మొక్కుకుంటారుట.  ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు.  నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు. 


వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు.  అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టి తో చేసి వాటికి పూజ చేస్తారు. 
ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ వుంటుంది. గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు 'పోలాంబ' పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారెలు సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ ... ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తుంటారు.
జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం వుండాలి. వర్షాలుపడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా వుండాలి. పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది. ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగాను ... ఆర్ధికంగాను ఆదుకుంటాయి.
తమ జీవనాధారానికి తోడ్పాటుని అందించే దేవతను ... పెద్దలను ... పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది. గ్రామదేవతను ఆరాధిస్తూ ... వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను చాటుకుంటూ వుంటుంది. 

ఇక కధ విషయానికి వస్తే:
"ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులుఅందరికీ పెళ్లిళ్ళు చేస్తారుఅందులోఏడో కోడలికి ఏట పిల్లాడు పుడతాడుకానీ పోలాల అమావాస్యరోజు చనిపోతాడుఅలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుందిఅప్పటికే ఆమె తోడికోడళ్ళు దేప్పటం మొదలుపెడతారు - ఆమె వలన వారు పండుగ జరుపుకోలేకపోతున్నారు అని బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసిఉంచేస్తుందిఅందరూ పూజ చేసుకుంటారుఅది అయ్యాకఆమె  బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుందిఅదిచూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి  "ఎవరమ్మా నీవుఎవరా బాబుఎందుకు ఏడుస్తున్నావు?" అనిఅడుగుతారుదానికి ఆమె - "ఎవరైతే ఏమిటమ్మ - మీరు ఆర్చేవారా తీర్చేవారా?" అని అడుగుతుందిదానికి వారు - "మేమే ఆర్చేవారము -తీర్చేవారము - చెప్పవమ్మాఅంటారుఆమె తన గోడు చెప్పుకుంటుందివారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు.అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహాఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారువారిని చూసిన ఆశ్చర్యంలో దంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరుఅప్పుడు - అది పార్వతీపరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికివెళ్ళిపోతుందిఅక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారుఅప్పటినుండి ఆమె ప్రతి ఏటతప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటుంన్నారు."
 కథ విన్న తరువాత చెప్పినవారు:"పోలేరమ్మనీ ఇల్లు పాలతోనేతితో అలుకుతానునా ఇల్లు ఉచ్చతోపియ్యతో అలుకు", అంటారు.వినడానికి కొంచం వింతగా వుంటుంది.  కాని  అది వారి  పిల్లల మీద ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది  కథ అక్షింతలు చదివినవాళ్ళు,విన్నవాళ్లు తలపై వేసుకుంటారు.  తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి  తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు.  అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు.

ఆదివారం, సెప్టెంబర్ 17, 2017

అమరెగదె నేడు అన్ని సొబగులును

ఆదివారం, సెప్టెంబర్ 17, 2017

అమరెగదె నేడు అన్ని సొబగులును | 

సమరతి చిన్నలు సతి నీమేన ||


చెలపల చెమటలు చెక్కిళ్ళ | 

మొలకల నవ్వులు మొక్కిళ్ళ |
సొలపుల వేడుక చొకిళ్ళ | 


తొలగని యాసలు తొక్కిళ్ళ ||


నెరవగు చూపులు నిక్కిళ్ళ | 

మెర్కసెను తమకము మిక్కిళ్ళ |
గుర్కుతగు నధరము గుక్కిళ్ళ | 


తర్కచగు వలపుల దక్కిళ్ళ ||


ననుగోరికొనలు నొక్కిళ్ళ | 

పొనుగని తములము పుక్కిళ్ళ ||
ఘనుడగు శ్రీ వేంకటపతి కౌగిట | 

ఎనసెను పంతము వెక్కిళ్ళ ||

గురువారం, ఆగస్టు 24, 2017

గణపతి పూజ

గురువారం, ఆగస్టు 24, 2017

ఓం గం గణపతేనమః 

🙏విధానం , గణపతి పూజ, కథ 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)