Blogger Widgets

మంగళవారం, అక్టోబర్ 17, 2017

ధన్వంతరీ త్రయోదశి

మంగళవారం, అక్టోబర్ 17, 2017

ఈరోజును ధనత్రయోదశి అని పిలుస్తారు ధనతెరాస్  అని ఐదు రోజుల సుదీర్ఘ దీపావళి సంబరాలలో మొదటి రోజు . ధనత్రయోదశి రోజున, ఐశ్వర్య దేవత అయిన మహాలక్ష్మీ పాలసముద్రము మథనం సమయంలో సముద్రము నుండి బయటకు వచ్చింది.  అందుకే, సంపద దేవుడు అయిన  కుబేరుడుతో  పాటు లక్ష్మీదేవిని , ఈ ధనత్రయోదశి రోజును  పవిత్రమైన రోజుగా  పూజిస్తారు. అయితే, లక్ష్మీ పూజ అమావాస్య రోజున మరియు ధనత్రయోదశి రెండు రోజుల్లోను  మరింత ముఖ్యమైన భావిస్తారు.  ఈరోజున నరకాసుని చెరనుండి మహాలక్ష్మిని విడుదల చేసి ఆమెని ధనమునకు మూలదేవతగా వుంచుతారు మహావిష్ణువు. ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.
 అందుకే ఈరోజును పవిత్రముగా పుజిస్తారు.  ఈరోజున బంగారము కొనుక్కోదలచినవారు కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తీ కొలది పూజిస్తారు.  ఆరోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ఆచరించే ఈ పండుగకు ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి.  ఈరోజు ధన్వంతరి జయంతి.  ఆయుర్వేద దేవుని జయంతి జరుపుకుంటున్నాం. పరిపూర్ణ ఆయువుకోసం యమధర్మరాజును ధన త్రయోదశినాడు పూజిస్తారు. ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వులనూనె పోసి దీపాల్ని వెలిగిస్తారు. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కాబట్టి, ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమదీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి.


ఈరోజు ధన్వంతరి జయంతి.   ఈరోజును ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి జయంతిని ఘనంగా జరుపుకుంటారు.  ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు. 
ధన్వంతరి అన్న పేరు మన భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాలు తెలిసిన ప్రతీ ఒక్కరికి తెలుసు . ధన్వంతరి అవతారం గురించి నాలుగు రకాలుగా చెప్తారు.  ఒకటేమో భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న విద్యార్ధులలో ధన్వంతరి ఒక్కరు. సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.  కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.  విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం కూడా వుంది.  పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి  చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. లక్ష్మీదేవి  అవతరించి విష్ణువును చేరింది. తరువాత ధన్వంతరి అవతరించాడు. 
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.
అందరు సుఖంగా, సంతోషంగా మరియు సిరిసంపదలతో తులతూగుతూ వుండాలని కోరుకుంటూ ధనత్రయోదసి  శుభాకాంక్షలు.

సోమవారం, అక్టోబర్ 16, 2017

గోవత్స ద్వాదశి పూజ

సోమవారం, అక్టోబర్ 16, 2017


ఈరోజు మహారాష్ట్రలో గోవత్స ద్వాదశి పండుగను జరుపుకుంటారు.  ఇది ధన్తేరాస్ కు  ఒకరోజు ముందు జరుపుకుంటారు. గోవత్స ద్వాదశి పూజ హిందువులు జరుపుకునే పండుగ . 
మనం ఆవులను ఆరాధించటానికి గుర్తుగా జరుపుకుంటారు.  మానవ జీవితాన్ని కాపాడుకోవటానికి అవి చేస్తున్న  సహాయంకు  కృతజ్ఞతలు చెప్పటమే  .  ఈ సంప్రదాయము 'ద్వాదశి ' రోజు జరుపుకుంటున్నాం . దీనిని 'నందిని వ్రతము ' అని కూడా  పిలుస్తారు.  గోవత్సా ద్వాదాషి హిందూ భక్తులు దైవ ఆవు అయిన నందినిని పూజిస్తారు. ఈ పూజ వల్ల  వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పండుగను  దేశంలో  అన్ని ప్రాంతాలలో అపారమైన ఉత్సాహంతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ రోజును  'వాసు బరస్' గా గుర్తించి పూజ చేస్తారు  మరియు దీనితోనే దీపావళి సంబరాలలో మొదటి రోజుగా పూజలు  మొదలుపెడతారు . గోవత్సా ద్వాదశి రోజునే , 'శ్రీపద వల్లభ ఆరాధన ఉత్సవ్' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం దత్తా మహాసాంధన్లో జరుగుతుంది, గుజరాత్లో 'వాగ్ బరాస్' గా జరుపుతారు.

గోవత్సా ద్వాదశి  సమయంలో ఆచారాలు:

గౌవ్సా ద్వాదశి రోజున ఆవులు ఆరాధించబడుతున్నాయి. ఒక సంప్రదాయ స్నానం చేయించి  నుదురు మీద తిలకం దిద్ది పూజ చేస్తారు. ఆవులు మరియు వారి దూడలను అందంగా ప్రకాశవంతమైన వస్త్రాలు మరియు పూల పూలలతో అందంగా అలంకరిస్తారు.
గోవత్సా ద్వాదశి రోజు కొందరు  భక్తులు ఆవుల విగ్రహాలను మరియు వారి దూడలను మట్టి తో  తయారు చేస్తారు. ఈ మట్టి విగ్రహాలు కు కుంకుం మరియు పసుపుతో అలంకరించి పూజ చేస్తారు . సాయంత్రం హారతి ' ని ఇస్తారు. 
గ్రామాలలో పశువులకు వివిధ రకాల ఆహార పదార్ధాలు సమర్పిస్తారు.
భక్తులు విష్ణువు అవతారంగా ఉన్న శ్రీ కృష్ణుడికి ప్రార్ధనలు చేస్తారు. ఆవుల పట్ల  కృతజ్ఞతలు మరియు ప్రేమను కలిగి ఉంటారు.
కొన్ని ప్రాంతాల్లో, ప్రజలు గోవత్సా ద్వాదాషి రోజున ఆవు పాలను త్రాగటం మరియు నెయ్యి ని ఉపయోగించటం మానివేస్తారు.
గోవత్సా ద్వాదాషి యొక్క ప్రాముఖ్యత మరియు దాని  పురాణము 'భవిష్య పురాణం' లో ప్రస్తావించబడింది. పురాణం లో నందిని యొక్క కథ కూడా ఉంది , దైవత్వం కల  ఆవు మరియు దూడ గా  పురాణం  చెబుతుంది. హిందూ మతంలో, ఆవులు చాలా పవిత్రంగా భావిస్తారు. వారు మానవాళికి పోషణ అందించేటప్పుడు వారు కూడా పవిత్ర మాతృమూర్తి గా  పూజిస్తారు. Govatsa Dwadashi రోజు న మహిళలు తమ పిల్లలు సుదీర్ఘ జీవితం కోసం ప్రార్ధిస్తారు . పిల్లలు లేని జంట జంటగా గోవత్సా ద్వాదాషి పూజ నిర్వహిస్తారు మరియు ఉపవాసం ఉంటే, వారికి పిల్లలతో  ఆనందంగా  ఉండే ఆశీర్వదము  కలిగి ఉంటారనే నమ్మకం ఉంది . ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, గోవత్సా ద్వాదాషి కూడా 'వాగ్' అని కూడా పిలుస్తారు, వాగ్  అనగా  ఆర్థిక రుణాలను తిరిగి చెల్లించాలని సూచిస్తుంది. అందువలన ఈ  రోజున  వ్యాపారవేత్తల్లో వారి ఖాతాల పుస్తకం ను  క్లియర్ చేసి, వారి నూతన  లావాదేవీలు దీవాలి తో మొదలుపెడతారు . గోవత్సా ద్వాదశి  రోజు ఆవులు ను పూజించి న వ్యక్తి సమృద్ధిగా మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతాడు అని నమ్ముతారు. మనం పూజించే ముక్కోటి దేవతలు  గోమాతలో ఉంటారుట.  గోవును పూజిస్తే మనం ఒకసారి ముక్కోటి దేవతలను పూజించినట్టే వారి దీవెనలు మనకు అందినట్టే.  
గోవత్స ద్వాదశి పూజ గురించి బాగుంది కద . 
"గోవులను పూజించండి.  గోవధను వ్యతిరేకించండి "అదే మన హిందూ సాంప్రదాయం . 

బుధవారం, అక్టోబర్ 11, 2017

"ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు"

బుధవారం, అక్టోబర్ 11, 2017


ఈరోజుకొక విశేషము వుంది అది ఏమిటంటే.  మనందరికీ చీకటి నుండి తెల్లవారాక ముందే వారికి  తెల్లవారుతుంది. చకాచకా పరిగెడుతూ పరిగెడుతూ సైకిల్ మీద వార్తా పత్రికలు ప్రతి ఇంటికి ప్రతీ వీధి  వీధి కీ  వార్తాపత్రికలును వేసి తొందర తొందరగా వార్తా పత్రికలను అందిస్తూ ఉంటాడు.    పల్లెటూరులో అయితే కొక్కొరోకో అనే కోడి అరుపుతో తెల్లారుతుంది. మరి  మన ఇంటి ముందర పాల పేకట్లు తో పాటు  ప్రఫంచం అంతటా ఎమి జరిగిందో,  ఏమి జరగబోతోందో తెలపటానికి వార్తా పత్రిక కూడా వుంటుంది.  వార్తాపత్రికలు  చూస్తే  కానీ మనకు తెల్లవారిన అనుభూతి రానే రాదు.  వేడి వేడి కాఫి పట్టుకొని పేపర్ చదవటం ప్రతి ఇంట్లో జరిగే రోజు జరిగే మొదటి పని. అందరు దేవదేవుని సుప్రభాతము వింటారో వినరో కానీ పేపరు చదవకుండా వుండలేరు.   ఆ పేపర్ చేరటం ఆలస్యం అయితే మనమే అతని కోసం ఎదురు చూస్తాం.  ఈ పేపరు మన ఇంటికి చేర్చేది పేపర్ బోయ్ నే.  వాతావరణం ఎలా వున్నా.  తెల్లారేసరికి మన ఇంటికి పేపర్ అందిస్తాడు పేపర్ బోయ్.    

ఈరోజు ప్రపంచం అంతా  "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" జరుపుకుంటున్నారు.  
మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). చదువుకుంటూనే పేపర్ బాయ్ లుగా పని చేసి ఎంతో మంది సమాజంలో ఉన్నతస్థాయికి ఎదిగారు.  ఉదాహరణకు రామేశ్వరంలో పుట్టిన అబ్దుల్ కలాం పేపర్ బాయ్‌ నుండి జీవితాన్ని మొదలుపెట్టి భారత రాష్ట్రపతి వరకు ఎదిగారు. 

అలాగే పేపర్ బాయ్ గా సంపాదన మొదలు పెట్టి ఇండియాన్ ఐడల్ 2017 రేవంత్ విజేతగా నిలిచాడు.  ఇలాంటి వారిని చూసి మనం ఆదర్శంగా తీసుకోవాలి.  మనం జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే చాలా కష్టపడాలి.  అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలకు చేరగలం.  
పేపర్ బోయ్స్ అందరికి "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" శుభాకాంక్షలు.

శనివారం, అక్టోబర్ 07, 2017

చంద్రోదయ గౌరీవ్రతము

శనివారం, అక్టోబర్ 07, 2017




   


ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదమహాముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి. ఇందుకే ఈ నోముకు చంద్రోదయ గౌరీవ్రతమని కూడా పేరు.
అట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్
చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు
అంటూ ఆటపాటలతో, కోలాహలంగా సాగే నోము అట్లతద్దె. ఈ నోమును కన్నెపిల్లలు సలక్షణమైన భర్త కోసం ఆచరిస్తే, వివాహితలు తమ కాపురం చల్లగా సాగాలని, కడుపు పండాలనీ నోచుకుంటారు. ఈ వ్రతం చేసేవారు ఆశ్వయుజ బహుళ తదియనాడు తెల్లవారు ఝామున లేచి చద్దెన్నం, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో విందారగించి, తాంబూలం వేసుకోవాలి. ఆ తర్వాత ఆటలు ఆడాలి. ఊయల ఊగాలి. స్నానపానాదులు పూర్తి చేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయిన అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి అమ్మవారికి పది అట్లు నివేదించాలి తర్వాత ఓ ముత్తయిదువకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనమివ్వాలి.
వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి,  అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే. వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు. 
''ఇస్తినమ్మ వాయనం''
''పుచ్చుకుంటినమ్మ వాయనం'' 
''అందించానమ్మా వాయనం''
''అందుకున్నానమ్మా వాయనం''
''ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం''
''ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం''  
ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో ''అట్లతద్ది'' జరుపుకోవడం ఒకటి.  మనం జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే ''కార్వా చౌత్'' వేడుకతో సమానం.
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
పూర్వం పాటలీపుత్రాన్ని సుశీలుడనే రాజు పాలిస్తుండేవాడు. వారికి లేకలేక పుట్టిన కుమార్తెకు ‘సునామ’ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సునామకు యుక్తవయస్సు రాగానే రాజదంపతులు ఆమెకు ఎన్నో సంబంధాలు చూశారు. అయితే అన్నీ ఏదో ఒక కారణంతో తప్పిపోతుండేవి. దాంతో విరక్తి చెందిన సునామ గౌరీదేవి ఆలయానికెళ్లి ఆత్మహత్యకు సిద్ధమైంది. సరిగ్గా ఆ తరుణంలో ‘‘చంద్రోదయ గౌరీవ్రతం ఆచరించినట్లయితే యోగ్యుడు, సర్వలక్షణ సంపన్నుడైన భర్త లభిస్తాడని, సంసారం సౌఖ్యంగా సాగిపోతుంద’’ని ఒక అదృశ్యవాణి పలుకుతూ, ఆ వ్రతవిధానాన్ని వివరించింది.
ఆ మాటలతో ఉత్సాహం తెచ్చుకున్న సునామ ఆశ్వయుజ బహుళ తదియనాడు పొద్దున్నే మేల్కొని, రాత్రి చంద్రోదయం అయ్యేవరకూ కఠిన ఉపవాసం ఉంది. సునామ ఎంతో సుకుమారి కావడంతో సాయంత్రానికల్లా నీరసంతో పడిపోయింది. దాంతో ఆమె సోదరులు చెల్లెలి మీద ప్రేమతో చేరువలో ఉన్న చింతచెట్టుకి ఒక అద్దాన్ని కట్టి, దానికెదురుగా గడ్డిమోపుకు నిప్పంటించి, ఆ మంట వెలుగు అద్దంలో ప్రతిబింబించేలా చేశారు. చెల్లెల్ని లేపి, ‘‘సోదరీ! అదుగో ఆ చింతచెట్టు కొమ్మల్లోంచి చంద్రుడు కానవస్తున్నాడు చూడు’’ అన్నారు. సునామ ఆ వెలుగు చంద్రుడేనని భ్రమించి ఎంగిలిపడింది.
తెలియక చేసినప్పటికీ వ్రత ఉల్లంఘన దోషం కారణంగా ఆమెకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో విసుగు చెందిన తల్లిదండ్రులు వయసు ముదిరిన వరులను వెదకడం ఆరంభించారు. దాంతో ఒకనాటి రాత్రి సునామ అడవిలోకి పారిపోయి ఆత్మహత్యకు సిద్ధపడింది. అప్పుడు భూలోక సంచారం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఆమెకు ఎదురై, ఆమెని వారించారు. ఆమె అన్నలు చేసిన పని వల్ల వ్రతోల్లంఘనమయిందనీ, అందువల్లే సరైన సంబంధం కుదరడం లేదని, తిరిగి నియమ నిష్టలతో వ్రతాన్ని ఆచరించమని చెప్పి అదృశ్యమయ్యారు. ఈసారి వారు చెప్పిన విధంగా సజావుగా వ్రతాన్ని నిర్వహించింది సునామ. దాంతో ఆమెకు అతి స్వల్పకాలంలోనే  అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
పదిమంది ముత్తయిదువలకు ఒక్కొక్కరికి ఒక నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలంతో పది అట్లు చొప్పున వాయనం ఇచ్చి, వారి ఆశీస్సులందుకోవాలి.
నవగ్రహాలలోని కుజునికి అట్లంటే ప్రీతి కాబట్టి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవడమేగాక సంసారం సాఫీగా సాగుతుంది. గర్భధారణలో సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చెయ్యడానికి వాడేది మినప పిండి, బియ్యప్పిండి మిశ్రమం కదా, అందులో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించినవి. ఈ రెండూ కలిసిన అట్లను వాయన మివ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖప్రసవం అవుతుందని విశ్వాసం.
గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతంలో భాగంగా ఆడపిల్లలంతా తెల్లవారుజామున వెన్నెల్లో ఒక చోటికి చేరి బలంగా ఉన్న చెట్లకొమ్మకి ఉయ్యాలలు కట్టి తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. అట్లతద్దిరోజు ఆటలాడటం వల్ల నడుము గట్టిపడుతుంది. తద్దెపాటలు లోకంలో బతకాల్సిన తీరు గురించి సందేశమిస్తాయి. అందుకే అట్లతద్దెకు ఆంధ్రదేశంలో అంత ప్రాధాన్యత.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)