ఈనాటి గోపిక అద్దాలమేడలో పరుండియున్నది. ఏ మేడ స్వచ్చమైన తొమ్మిది విధములగు రత్నములతో నిర్మించి ఉన్నది. ఆ భవనములో నిదురపోతున్న తీరును వారు చెప్పుకొని ఆనందించుచున్నారు.
శిత్తుం విళక్కెరియ:
చుట్టూను దీపములు ప్రకాశించుచుండగా. మణి మయ భవనములో మణుల కాంతిచేతనే ప్రకాశమున్నను దీపములు వెలిగించుట మంగళార్ధము. పగటివేళ భగవద్ సన్నిదిని దీపము వెలిగించుటలో అర్ధం అదే. దీపము అంటే శాస్త్ర జన్యమైన ఙ్ఞానదీపము . శాస్త్రములచే కలిగిన ఙ్ఞానము తోడైయుండుటచే భగవదఅనుభవము చక్కగా పొందును.
తూపమ్ కమళ:
అగరు మొదలగు వాని ధూపము పరిమళించుచుండగా, ఈమె దీపములే కాక అగరు పొగ కూడా వేసుకొని పరుండియున్నది. దూపము పోగాలేకుండా పరిమమలం మాత్రమె వున్నదిట. దీపము ఙ్ఞానదీపము వంటిది, పరిమళం అనుష్టానము వంటిది. ఏ రెండు కల్గి భగవదనుభావము కలది. ఈ రెండే దీపము-పరిమళం దగ్గర పెట్టుకొని నిదురిస్తున్నది. ఈమె భగవద అనుభవంలో నిమగ్నము అయ్యివున్నది అని అనుకుంటున్నారు.
మనసు పూర్తిగా పరమాత్మయందే నిలిపి ఉన్నది.
తుయిలణై మేల్ కణ్ వళరుమ్:
నిద్రను చక్కగా పట్టించు పడక పై నిద్రించుచున్నది ఈ గోపిక. ఈమె పూర్తిగా భగవంతుని అనుభవిస్తున్నది. నిద్ర పట్టిస్తున్న పానుపు భగవంతుడే. వానితో కలసి నిదురించుటనే నిద్ర. ఈమె నివృత్తి మార్గనిష్టూరాలు.
మామాన్ మగళే!:
అత్తా కూతురా! అని ఆమెను సంబోదిస్తున్నారు. గోపికాభావమును పొంది కేవలము ఆధ్యాత్మికముగానే కాక భౌతికంగా కూడా వార్తితో తనకు సంభందములను ఏర్పర్చుకోనుచున్నది గోదామాత. గోదా తననుకూడా గోపవనితగా భావించుకొని. గోపికను అత్తా కూతురా అంటోంది.
మణి క్కదవం తాళ్ తిఱవాయ్:
"మణులతో నిర్మింపబడిన తలుపుల గడియలను తెరువుము". ఆమె భవనం మణులతో వున్నది కదా దాని గడియలు ఎక్కడున్నావో తెలియటంలేదు. ఏది ద్వారమో, ఏది గోడో తెలియటంలేదు. ఆమెనే తలుపుతెరవమన్నారు. "మీరే తెరుచుకురండి" అని ఆమె అన్నా గోపికలు అంగీకరించక ఆమెనే తలుపు తెరవమన్నారు వీరు. మేము ఇలా చెప్పినా లేవకుండా పడుకుండుట తగదు అని చెప్పుచున్నారు.
మామీర్! అవళై ఎళుప్పీరో:
అత్తా! ఆమెను లేపుము. మా ఆర్తిని చూచి మేలుకోపోయినా, నీ అనునయము చేతనైనా మేల్కొనునట్లు చెయ్యి. భగవంతుడే ఉపాయమని విశ్వసించి ఆ భగవంతునికొరకు ఆర్తి కలిగిన ఇతరులకై తానుకూడా భాధపడుచు వారికి సాయపడుట తప్ప వేరే ఉపాయం లేదు. ఇది భగవంతుని పొందుటకు అనుకూలము అని తల్లే చెప్పి ఆ పరుండిన గోపికను మేల్కొల్పాలి. అలా మేల్కోకపొక పోవుట చూచి మనసులో భాధకల్గి
ఉన్ మగళ్ తాన్ ఊమైయో :
నీ కూతురు మూగదా! అని అనుచున్నారు. నీ కూతురు అని కోపముతో అనుచున్నారు. మారుమాటాడదా! పలకకుండా ఎవరైనా నోరు ముసినారా? నీ కూతురు భగవంతుడే ఉపాయము అనుకునేవారితో కలసి రాదా ఏమి ?
ఇదేనా నీకూతురుకు నేర్పిన విద్య! అని ఆక్షేపిస్తున్నారు. ఇలా చేయటం ఆమెకు అనుకూలము కాదు సరికదా ప్రతికూలమే అవుతుంది. భగవదనువిరోదులుతో మాటాడకూడదు కానీ భగవదప్రాప్తి కాలమగు మాతో మాటాడరాదా?
అన్ఱి చ్చెవిడో:
మూగయే కాక చెవుడు కూడనా? మామాటలు వినబడనట్లుగా అక్కడేవరైనా ఆమె చెవిలో మాటాడుతున్నారా?
అనన్ధలో :
ఏ వ్యాపారము చేయలేని అలసటలో వున్నదా ?
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో:
ఎవరైనా ఆమెను లేవవద్దని కాపలా ఉన్నారా? లేకపోతె గాఢనిద్ర పట్టునట్లు మంత్రించియున్నారా? మాకు నిద్ర పట్టకుండా చేసినవాడే ఈమెకు నిద్రపట్టించినాడా? అతడు కాపలాయుండి ఈమెను నిద్రనుండి మేల్కొననీయకుండా వున్నాడా? నిద్రకు, తెలివితెచ్చుకోనుటకు పరమాత్మే కారణం. అతనితో కలసినవారు నిద్రపోదురు. వీడినవారు నిద్రలేకుండా వుందురు. అనన్యఉపాయత్వమ్ తెలిసినవారు భగవన్నామమునకు వశులై ఆ సంకీర్తనమునకు అంతరనుభావంనుండి భాహ్యను భావమునకు వస్తారు. అదే మేల్కొనుట.
"మామాయన్, మదవన్, వైకుందన్," ఎన్ఱెన్ఱు నామం పలవుమ్ నవిన్ఱు:
'మహా మాయావీ! మాధవా! వైకుంఠ వాసా ! అని అనేక నామాలును కీర్తించినారు. ఈ మూడు నామాలలో భగవంతుని కళ్యాణగుణాలను కొన్నింటిని వీరు మరచినారు. మహామాయావి అనుటలో జగత్కారణం అయిన పరమాత్మ కృష్ణుని కీర్తిస్తున్నారు.
మాయ అనగా ప్రకృతి. ఈ ప్రకృతినే పరమాత్మగా భావిస్తున్నారు. మాయ అనగా భగవద సంకల్పరూపము.అది ఆశ్చర్యమైన శక్తీ కలది. అదే ఈ సర్వమునకు మూలము అని.
మాదవ అంటే మా = శ్రీ యొక్క, ధవః = శ్రీయఃపతీ అని కీర్తించాడు. జగత్కారణమైన ఆ పరతత్వము. సర్వసులభమై దిగుటకు శ్రీ మహా లక్ష్మే కారణం. ఆమెవద్ద శుశ్రూషచేతనే ఈ సౌలబ్యాము అతనికి అబ్బింది అని మాధవా అని కీర్తిస్తున్నారు. ఈ లక్ష్మీపతితత్వమే యితడు పరతత్వమని నిరుపిస్తోంది.
దీనితో ఆభాగావదనుభవ నిమగ్నమైన గోపిక ఆప్రత్యేకానుభూతిని వీడి వీరితో కలసి అనుభావిమ్చినాగాని నిలువలేని మనస్థితి గలది వెలికి వచ్చెను ఈ గోపిక. మొత్తానికి ఈ గోపికను కూడా నిదురలేపారు.