శనివారం, డిసెంబర్ 25, 2021
ఈనాటి పాశురములో లేపబడుచున్న గోపిక , కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరుకంతకు ఆదరణీయుడై యున్నట్లే.యీమె కూడా ఊరులోని అందరి మన్ననలను అందిన పిల్ల. ఈ పాశురములోని నిద్ర పోతున్న గోపిక వంశము వారు భరతుని వంశము చెందినవారు. వీరు అభిజాత్యము -సౌందర్యము - ఐశ్వర్యము కల గోపిక ను ఇందు లెపబడుచున్నది. ఈమె సౌందర్యము ను స్త్రీలే పృశంచించుట విశేషము. గోపికలందురు కృష్ణతత్వమూ నేరిగినవారు. నాకు అయితే వారు చాలా అదృష్టవంతులుగా తోచుతున్నది. అయ్యో అప్పుడు నేను లేనే అని వుండివుంటే చాలా బాగుండును కదా, నేను ఒక గోపికగా వుండేదానను అనిపిస్తుంది. సరే ఈనాటి పాశురము గురుంచి ఎలా ఈ గోపికను నిదుర లేపుతున్నారో చూద్దాం.
కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
లేగ దూడలు కల ఆవులే అయినను దూడవలేనే లేత వయస్సులో ఉన్న ఆవుమందలను పాలు పితుకగలవారును శత్రువునుఎదుర్కొని బలము చూసి యుద్దము చేయగలవారు ఏ విధమగు దోషములు లేనివారును అయిన గోపాలకుల వంశములో జనించిన బంగారుతీగా! పుట్టలో పాముయోక్క పడగవలేనున్న నితంబ ప్రదేశము కలదానా! అడవిలోని నెమలితోకవంటి అందమైన కేశపాశము కలదానా? రమ్ము చుట్టములు చెలికత్తెలు అందరును వచ్చినారు. నీ వాకిలి ముందు చేరియున్నారు. నీలమేఘమువంటి వర్ణముగల శ్రీ కృష్ణుని నామమును కీర్తించుచున్నారు. ఆ విధముగా నందరు భగవంనామమును కీర్తించుచున్నాను కదలక మెదలక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా ! నీ నిద్రకర్ధమేమితో తెలియచేయుము.రావే! గోపవంశాన రాజిల్లే లతకూన!
రావే! గోపవంశాన రాజిల్లే లతకూన!
రావే! పాముపడగ బోలే కటికలదానా!
లేవే! నీరదశ్యామ మోహనుని నామముల
నీ వాకిటనే నిలిచి నీవారు పాడేరు ||రావే!||
మేలి పొదుగుల ఆలు వేలు కలవారు, ఆ
భీలరణమున అరుల బీర మడిచేవారు, గో
పాలకుల కులమున వెలసే ఓ వనమయూరీ!
లేవే కలుములనెలవౌ ఓ నారీ! ఒయ్యారీ ||రావే!||
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కొండమలహరి
ఏమో సేయఁగఁ బోగా నేమో ఆయ
ఏమో సేయఁగఁ బోగా నేమో ఆయ
యేమని చెప్పుదుఁ బను లిటువంటివే ॥పల్లవి॥
వుక్కుమీరి కృష్ణుఁడు మావుట్లు దించఁబోఁగాఁ
బక్కన నేఁ బారి తెంచి పట్టుకొంటినే
మొక్కలాన నతఁడు నా మోము చూచె నంతలోనె
మక్కువ నా మే నెల్ల మర పాయనే
॥ఏవె॥
కమ్మర నంతటఁబోక కాఁగులపాలంటఁ బోఁగా
బిమ్మిటిగాఁ గిందుమీఁదై పెనఁగితినే
యెమ్మెల నాతఁడు నా యిక్కువకుఁ జేయి చాఁచె
కమ్మి నా చిత్తము నీరై కరఁగితినే
॥ఏవె॥
వుద్దండాన గట్టి వెన్నముద్ద లారగించఁగానె
గద్దించి కాఁగిట నేఁ గమ్ముకొంటినే
వొద్దనె శ్రీ వెంకటేశుఁ డొంటి నన్నుఁ గూడఁగా
నిద్దరికిఁ బులకించి యేక మైతిమే
॥ఏవె॥
కవి భావము:
ఆయన చేసిన పనులు ఏమని చెప్పను ఇలాంటివి అని చెప్పలేకున్నాను. అతిశయముతో కృష్ణుడు మా ఉట్లు దించబోగా పక్కన నేను బరితెగించి పట్టుకొన్నాను. ధైర్యంగా అతడు నా ముఖము చూసి అంతలోనే ఇష్టముతో నాశరీరమంతా తన్మయం చెందినది. అతను కమ్ముకొనగా అంతలోనే కాగిన పాలు అంటుకోగా సంకోచముతో కిందమీద అయి కౌగిలించుకొనగా. విలాసముతో అతడు నాపై ఇష్టముతో చేయిచాచి చుట్టుకొనగా నా మనస్సుతో నీరై కరిగిపోయానే. ఎక్కువైన గట్టి వెన్నముద్దలా ఆరగించగానే బెదిరించి కౌగిలించుకొని నేను కమ్ముకొంటిని. సమీపములో శ్రీవేంకటేశుడు కన్నులు కలువగా ఇద్దరికీ పులకించి ఒకటైతిమి అంటు అన్నమయ్య కీర్తించాడు.
శుక్రవారం, డిసెంబర్ 24, 2021
శ్రీకృష్ణ పరమాత్మ ను విడిచి గోపికలు విరహముచే నిద్ర లేక , వ్రతము చేయవలెనని బయలుదేరి వచ్చుచుండగా పదిమంది నిద్రించుట ఆశ్చర్యముగా ఉండును. వారిలో ఒక్కొక్కరిని ఒక్కొక్కవిదముగా మేల్కొల్పుచున్నారు. వారి నిద్ర కుడా లౌకిక నిద్ర వంటి తామస నిద్ర కాదని అది భావదనుభావము చేత కలిగిన తామస నిద్ర అని తెలియుచున్నది. భగవదనుభావమున్న వారిని మేల్కొల్పుట అనగా వారి అభిముఖ్యమును సంపాదించి వారి విశేషకటాక్షమునకు పాత్రులై పాత్రులై భగవదనుభావయోగ్యతను కలిగించుకోనుతయే! భాగాత్ప్రాప్తికి ఉపాయములు భిన్న భిన్నముగా ఉన్నట్లు కన్పట్టుచుండును. నిష్కామకర్మ, ఆత్మస్వరుప జ్ఞానము , భగవద్భక్తి , భాగాత్ర్పాప్తికి ఉపాయములుగా భగవద్గీతలో నిర్దేశింపబడెను . ఆల్వారాలను ఈ పదియవ పాసురమున మేల్కొలుపు చున్నారు.ఈ గోపిక ఫలమును ఆశించినది కాదు . లాభనష్టాలు అన్ని పరమాత్మవే కాని తనవి కావని నిశ్చలంగా ఉన్నది. ఇతర ఇంద్రియములు పనిచేయక కేవలము ఒక్క మనస్సు మాత్రమె పనిచేయుచున్నది. ఆ మనసు లో పరమాత్మ దురులకు ఆటంకములేదని సూచించుటకు కృష్ణుని పొరిగింటి పిల్ల ఈమె . ఫలము సిద్దింపక దుఃఖము కలిగినా ఉద్వేగము చెందదు . తనను పాడుట భగవానునికి ఫలముగా భావించి భాద కలిగినా భగవంతుడే ఉద్వేగము చెందాలని . ఆమె భావిచేది. ఆ సుఖాలమీద తనకి మమకారము లేదు . ఇలాంటి పారతంత్ర్య పరాకాష్ట తో ఉన్న గోపిక ఈ గాఢ నిద్రలో మునిగి యున్న కృష్ణుని పొరిగింటి పిల్ల - ఈ వేళ మేల్కొల్పుచున్నారు.
నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
మేము రాక ముందు నోమునోచి , దాని ఫలముగా సుఖనుభావమును పోందినతల్లీ! తలుపుతెరవకపోయినా పోదువుగాక, ఒక మాటనైనను పలుకవా! పరిమళముతో నిండిన తులసిమాలలు అలంకరింఛిన కిరీటము గల నారాయణుడు, ఏమియులేని మావంటివారము మంగళము పాడినను `పర ' అను పురుషార్ధమును ఓసంగేడి పుణ్యముర్తి , ఒకనాడు కుంభకర్ణుని మృత్యువు నూతి లో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడించబడి తనసోత్తగు ఈ గాఢ నిద్ర ను నీకు ఒసగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ ! మాకందరకు శిరోభుషణమైనదానా! నిద్రనుండి లేచి, మత్తును వదలించు కొని, తేరుకొని వచ్చి తలుపు తెరువు , నీ నోరు తెరచి మాటలాడు. కప్పుకొని ఉన్న దుప్పటిని తొలగించి ఆవరణములోకి వచ్చినీ దర్శనము మాకు కలిగించు. అని ఈ పాశురములో అంటున్నారు.
పోనీ తలుపు తీకుంటే
పోనీ తలుపు తీకుంటే
మానేవు గానీ!
ఔనే! ఒక మాటైనా
మాతో అనవేమీ?
చానా! నోమూని స్వ
ర్గామాస బోగముల
ఆనందించేదాన!
మా తల్లి కాన! ||పోనీ తలుపు తీకుంటే||
నారాయణుడు కోమలామోద తులసీ
శ్రీరుచిరమౌళి మనపాలి వరదాయి!
గారాన మనకు పరవాద్యమ్మ కరుణించు!
నోరార చేయు కైవారముల ఆలించు! ||పోనీ తలుపు తీకుంటే||
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ