Blogger Widgets

బుధవారం, డిసెంబర్ 29, 2021

"ఓ చిరుత రాచిలుక! " (ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో )

బుధవారం, డిసెంబర్ 29, 2021

 ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పదవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు.  దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహేనవ పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచే  ఈ వ్రతము నాకు పుర్వరంగామును తెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత. అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈనాడు మేల్కొల్ప బడుచున్నది.   ఈమెను ఏవిదంగా లేపుచున్నారో కదా! ఈ పాశురము న లోపల ఉన్నా గోపిక కుబయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. వారి మద్య సంబాషణ ఎలావుందంటే.

ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో పాశురము:
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్
 
తాత్పర్యము:
బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి. నేను ఇదే చెప్పుచున్నాను.
బయటి గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను.
బయటి గోపిక : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా.
బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక: సరే , నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను , మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము.   లెమ్ము మాతో వచ్చి చేరుము అని లోపలి గోపికను లేపినారు.
"ఓ చిరుత రాచిలుక! 
"ఓ చిరుత రాచిలుక! లేచి రావేమే! వేచియున్నామే!"
"వేచేవారి నిదుర దోచుకున్నానో!
ఓ చెలులు! నా నిదుర దాచుకున్నానో లేచి వచ్చేనే!"

"భళిభళీ! సఖి! ఎంత నుడికారితనమే!
తెలుసులే నీ నంగనాచితనము మాకు!"

"మీరు గడుసరులు కారేమో పాపము!
నేనే కాబో లంత నేరవని దాన! 
వచ్చిరో అందరును నెచ్చెలులు?

"ఆ వచ్చి నీవే లెక్కపెట్టుకోవే
విచ్చేయవే, అమ్మ చెచ్చర! లేకున్న
మచ్చిక పని యున్నదేమో ఏదయిన
!"  ||"ఓ చిరుత ||

"ఉరు మత్తగజకుంభ మురయ మొత్తినవాని,
అరుల దర్పమ్ము నరవర చేయువాని
అరిది గుణములవాని, హరిని కీర్తింప
అరుగగా వలయు బిరబిర రమ్మ ! ఓ అమ్మ " ||"ఓ చిరుత || 

మంగళవారం, డిసెంబర్ 28, 2021

కలువ కనుమూసినది (ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్)

మంగళవారం, డిసెంబర్ 28, 2021

 ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపుతానని చెప్పినది  ఆ గోపిక ఈనాడు  మేల్కొల్పబడుచున్నది . ఈమె వీరి సంఘమున కంతకూ నాయకురాలై నడిపించగల శ క్తిగాలది .

తన పూర్వ అనుభావముచే ఒడలు మరచి తానూ చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరిచి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తానూ ఉండిపొయినది .
ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట గలదు . పెరటివైపున వున్నా ఆ తోటలో దిగుడు బావికలదు. ఆ దిగుడు బావిలో తామర పూలు , కాలువలు , ఉన్నవి ఆమె తన్మయత్వముతో అనుభావిచుచు ఇతర విషయాలనే  మరచిఉన్నది. అట్టి స్థితిలో ఉన్నా గోపికను నేడు మేల్కొల్పుతున్నారు .
ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్ పాశురము: 
ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:  
స్నానము చేయుటకు గోపికల నేల్లరను మేల్కొల్పుతాను అని చెప్పి నిద్రపోవుచున్న ఒక గోపికను ఈ పాసురములో లేపుచున్నారు.  ఈ బాలికకు ఊరివారినందరాను ఒకతాటిపై నడుపగల శక్తి కలది.  ఓ పరిపూర్ణురాలా! నీ పెరటిలో నున్న  గుడుబావిలో ఎరుపుతామర పూలు వికసించినవి. తెల్లకాలువలు ముడుచుకుంటున్నాయి. అంటే తెల్లవారుచున్నాడని భావము.  లెమ్ము ఎర్రని కాషాయ వస్త్రములు దరించి తెల్లని పలువరుసలు గలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమతమ నివాసములలో ఆరాధనము చేయుటకు వేల్లుచున్నారు లెమ్ము.  నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపెడియట్లు మాట ఇచ్చినావు మరచిపోయావా? ఓ లజ్జలేనిదానా! లెమ్ము.  ఓ మాతనేర్పు గలదానా! శంఖమును చక్రమును ధరించినట్టి ఆజాను బాహుడగు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము. అని ఈనాటి గోపికను మేల్కొల్పినారు.

కలువ కనుమూసినది

కలువ కనుమూసినది
కమలమ్ము పూచినది
కలికిరో! నీ పెరటి కొలనులో!

తెలిదంతముల జియ్యరులు, కావి తాలుపులు
తరలేరు, కుంచెకోలల తెరవ కోవెలలు ||కలువ కనుమూసినది||

మిమ్ము నేనే వచ్చి మేలుకొలెపెద నని
అమ్మ చెల్లా! నీవు నిదురింతువే!
కమ్మగా నెరవాది మాటలన్నీ ఆడి
ఎమ్మెలాడి! నీవు సిగ్గుపడవే  ||కలువ కనుమూసినది||

వరశంఖచక్రదారిని, హరిని, శౌరిని,
పురుషోత్తముని వికచజలజ లోచనుని
తరుణు లందరితోడ తనివారగ పొగడ
తరలిరావమ్మ! నిద్దురమాని, ఓ కొమ్మ! ||కలువ కనుమూసినది ||

సోమవారం, డిసెంబర్ 27, 2021

వంటింటి పోపుసామానులో క్వీన్ మెంతులు

సోమవారం, డిసెంబర్ 27, 2021

లలితశయనా! చలిత (పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై)

 వెనుకటి పాశురమున గోపికలును మేల్కొలుపుచు కృష్ణ సంకీర్తనం మాని శ్రీ రామ చంద్రుని గుణగణాలను సంకీర్తనం చేస్తూ శ్రీరాముడు మనోభిరాముడని గోపికలు అంటున్నారు.  దానిని విని నందవ్రాజమున సంచలనం ఏర్పడింది.  మధురలో పుట్టి శ్రీకృష్ణుడు గోపవంసమున చేరి తాను కూడా గోపాలుడే అనునట్లు కలసిమెలసి ఉంది వారిని కాపాడుచుండగా అలాంటి కృష్ణుని విడిచి రాముని కీర్తించుట ఏమి అన్యాయము? అప్పుడు అయోధ్యలో ప్రజలు రాముడు, రాముడు, రాముడని యనుచుండెడి వారు.  కానీ ఇతర ప్రస్తావనే లేదు కదా ! నందవ్రజమున మాత్రం కృష్ణుని తప్ప అన్యుని కీర్తించుట ఏమి హేతువు? శ్రీ రాముడా! మనోభిరాముడా.  రామునికంటే కృష్ణుడే సౌందర్యవంతుడు గదా అని ఇలా అనవద్దని కోపికలు వివాదంలో పడిరి.  రాముని కీర్తిమ్చినవారు రాముడుకు కృష్ణునికి పోలికలు చెప్పి ఇద్దరు ఒక్కరే అని నిరూపించి గెలిచినారు.  అప్పుడు ఇద్దరినీ కీర్తించుదుము అనుకొన్నారు.  ఈ పాసురములో మేల్కొల్పబడుచున్న గోపిక నేత్ర సౌందర్యమున విశిష్టస్థానం కలది.  తన నేత్ర సౌందర్యము వుండటం వల్ల ఆ కృష్ణుడు వేదక్కొని రాక ఎలా వుందగలడు అని భావించి ఆమె దైర్యముగా ఇంటిలోనే పరుండివున్నది.  ఇక్క నేత్రము అనగా ఙ్ఞానము.  ఙ్ఞానము కల చోటకు కృష్ణుడు తప్పక వచ్చును కదా అది ఆమె భావం.  అలాంటి గోపికను నేడు ఎలా మేల్కొల్పుచున్నారో చూద్దాం.   

పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము :
పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరుచీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పది తలలను హేలగా చిగుళ్ళు త్రుపినట్లు త్రుంపి పారవేసిన శ్రీ రాముని గానముచేయుచూ  పోయి మనతోడి పిల్లలందరును వ్రత క్షేత్రమును చేరినారు. లోపల ఉన్న తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులు కలదానా !
లేడిచూపులు వంటి చూపులు కలదానా ! శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు . పక్షులు కిలకిల కూయుచున్నవి . కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా అవగాహన మొనర్చి స్నాన మోనర్పక పాన్పుపై ఏల పడుకున్నావు. ఓ సుకుమార స్వభావురాలా! ఈ మంచి రోజున నీవు నీకపటమును వీడిచి మాతో కలసి ఆనందము అనుభవింపుము.
లలితశయనా! చలిత

లలితశయనా! చలిత
హరిణ నయనా! లెమ్మ!
తెలవారు చున్నదమ్మా
అలరు కొమ్మా! తళుకు
పసిడిబొమ్మా! లెమ్మా
తెలవారు చున్నదమ్మ! ||లలితశయనా||

పులుగు లవే మేతలకు తరలేను-
మెలమెల గురు డస్తమించేను-
అల శుక్రతార మింటను పొడిచెను!
కలసి మాతోరమ్మ! కపటమును విడవమ్మ  ||లలితశయనా||

బక దైత్య వైరి ఆ దశకంఠ సంహారి
అకలంక చరితముల ఒకచోట చేరి
ఈ పుణ్యదివసాన సఖియలు పాడేరు
తీపారు వలినీట తీర్థమాడగదమ్మా !

తెలవారు చున్నదమ్మా!
లలితశయనా! హరిణ నయనా!

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)