Blogger Widgets

సోమవారం, డిసెంబర్ 27, 2021

లలితశయనా! చలిత (పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై)

సోమవారం, డిసెంబర్ 27, 2021

 వెనుకటి పాశురమున గోపికలును మేల్కొలుపుచు కృష్ణ సంకీర్తనం మాని శ్రీ రామ చంద్రుని గుణగణాలను సంకీర్తనం చేస్తూ శ్రీరాముడు మనోభిరాముడని గోపికలు అంటున్నారు.  దానిని విని నందవ్రాజమున సంచలనం ఏర్పడింది.  మధురలో పుట్టి శ్రీకృష్ణుడు గోపవంసమున చేరి తాను కూడా గోపాలుడే అనునట్లు కలసిమెలసి ఉంది వారిని కాపాడుచుండగా అలాంటి కృష్ణుని విడిచి రాముని కీర్తించుట ఏమి అన్యాయము? అప్పుడు అయోధ్యలో ప్రజలు రాముడు, రాముడు, రాముడని యనుచుండెడి వారు.  కానీ ఇతర ప్రస్తావనే లేదు కదా ! నందవ్రజమున మాత్రం కృష్ణుని తప్ప అన్యుని కీర్తించుట ఏమి హేతువు? శ్రీ రాముడా! మనోభిరాముడా.  రామునికంటే కృష్ణుడే సౌందర్యవంతుడు గదా అని ఇలా అనవద్దని కోపికలు వివాదంలో పడిరి.  రాముని కీర్తిమ్చినవారు రాముడుకు కృష్ణునికి పోలికలు చెప్పి ఇద్దరు ఒక్కరే అని నిరూపించి గెలిచినారు.  అప్పుడు ఇద్దరినీ కీర్తించుదుము అనుకొన్నారు.  ఈ పాసురములో మేల్కొల్పబడుచున్న గోపిక నేత్ర సౌందర్యమున విశిష్టస్థానం కలది.  తన నేత్ర సౌందర్యము వుండటం వల్ల ఆ కృష్ణుడు వేదక్కొని రాక ఎలా వుందగలడు అని భావించి ఆమె దైర్యముగా ఇంటిలోనే పరుండివున్నది.  ఇక్క నేత్రము అనగా ఙ్ఞానము.  ఙ్ఞానము కల చోటకు కృష్ణుడు తప్పక వచ్చును కదా అది ఆమె భావం.  అలాంటి గోపికను నేడు ఎలా మేల్కొల్పుచున్నారో చూద్దాం.   

పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము :
పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరుచీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పది తలలను హేలగా చిగుళ్ళు త్రుపినట్లు త్రుంపి పారవేసిన శ్రీ రాముని గానముచేయుచూ  పోయి మనతోడి పిల్లలందరును వ్రత క్షేత్రమును చేరినారు. లోపల ఉన్న తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులు కలదానా !
లేడిచూపులు వంటి చూపులు కలదానా ! శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు . పక్షులు కిలకిల కూయుచున్నవి . కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా అవగాహన మొనర్చి స్నాన మోనర్పక పాన్పుపై ఏల పడుకున్నావు. ఓ సుకుమార స్వభావురాలా! ఈ మంచి రోజున నీవు నీకపటమును వీడిచి మాతో కలసి ఆనందము అనుభవింపుము.
లలితశయనా! చలిత

లలితశయనా! చలిత
హరిణ నయనా! లెమ్మ!
తెలవారు చున్నదమ్మా
అలరు కొమ్మా! తళుకు
పసిడిబొమ్మా! లెమ్మా
తెలవారు చున్నదమ్మ! ||లలితశయనా||

పులుగు లవే మేతలకు తరలేను-
మెలమెల గురు డస్తమించేను-
అల శుక్రతార మింటను పొడిచెను!
కలసి మాతోరమ్మ! కపటమును విడవమ్మ  ||లలితశయనా||

బక దైత్య వైరి ఆ దశకంఠ సంహారి
అకలంక చరితముల ఒకచోట చేరి
ఈ పుణ్యదివసాన సఖియలు పాడేరు
తీపారు వలినీట తీర్థమాడగదమ్మా !

తెలవారు చున్నదమ్మా!
లలితశయనా! హరిణ నయనా!

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)