సోమవారం, జనవరి 03, 2022
ముందు పాసురములో నీలాదేవిని మేలుకొల్పి, శ్రీ కృష్ణుని మేలుకొలిపి కృష్ణుడుని ఎలాంటివాడో కీర్తిస్తూ నీలా దేవిని ఎలాంటిదో వర్ణిస్తూ ఆమెను శ్రీ కృష్ణుని వారితో స్నానం చేయుటకు పంపమని అర్ధిస్తున్నారు. మరి ఎలా వర్ణిస్తున్నారంటే...
ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు పాశురము:
ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
కప్పం తవిర్క్కుం కలియే! తుయిల్ ఏరాయ్
శెప్పం ఉడైయాయ్! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు
వెప్పం కొడుక్కుం విమలా! తుయిల్ ఎరాయ్
శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్
నప్పినై నంగాయ్! తిరువే! తుయిలెరాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్-మణాళనై
ఇప్పోదే ఎమ్మై నీరాట్టు-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
ముప్పది మూడుకోట్ల అమరులకు వారికింకను ఆపద రాక ముందే పోయి , యుద్ధ భూమిలో వారికి ముందు నిలిచి , వారికి శత్రువుల వలన భయమును తొలగించే బలసాలీ ! మేల్కొనుము అర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము గలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శ త్రువులుగా భావించి వారికి భయ జ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకో ! బంగారు కలశములను పోలిన స్థానములను, దొండపండువలెఎర్రని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవి! పరిపుర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేలుకొనుము. వీచుటకు ఆలవట్టమును (hand fan) కంచుతద్దమును మా కోసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానము చేయునట్లు చేయుము.
మేలుకో శ్రీకృష్ణ! మేలుకొనవేమి!
మేలుకో శ్రీకృష్ణ! మేలుకొనవేమి!
చాలుబడి గల దేవ! మే లొసగు స్వామి!
మున్నేగిముప్పదియు మూడుకోటుల సురల
బన్నముల బాపు బలసాలి! వనమాలీ!
వెన్నుదవిలి విరోదివితతికి వనట గూర్చి
చెన్ను తొలగించు ఆపన్న జనతావనా! ||మేలుకో శ్రీకృష్ణ! ||
మేలుకో ఓ సిరీ! శాతోదరీ!
మేలుకో ఓ నీల! పరిపూర్ణురాలా!
మేలుకో నవకిసలయాధరా!
కలశోపమపయోధరా! ||మేలుకో శ్రీకృష్ణ! ||
ఆలవట్టము అద్ద మొసగి నీ స్వామిని
ఆలసింపక పంపవమ్మ నీరాడ! ||మేలుకో శ్రీకృష్ణ ||
ఆదివారం, జనవరి 02, 2022
ముందు పాశురములో పొడుగు జుట్టు గల నీలాదేవి ని మేల్కొల్పి . ఈ రోజు నీలాదేవిని మేలుకొలిపినా ఈ పాశురములో శ్రీ కృష్ణుని,నీలాదేవిని కూడా మేలుకోల్పవలసినది గా అర్ధించుచున్నారు. లేచి వారితో మాటాలాడమని కోరుకొని నీలాదేవిని అర్ధిస్తున్నారు కాసేపు అయినా మాతో మాటాడనీ అంటున్నారు. మరి ఎలా అన్నది తెలుసుకుందాం. నీలాదేవిని కీర్తిస్తున్నవారు ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు.
కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్ పాశురము
కుత్త విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
ఒక గుత్తి దీపములు చుట్టును వేలుగుచుండగా , ఏనుగు దంతము లతో చేయబడిన కోళ్ళు గల మంచముపై నున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము,ఎత్తు , వెడల్పు కలిగిన పాన్పులపై ఎక్కి , గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకోనిన కేశ పాశము గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండి విశాలమైన వక్షస్థలము గల శ్రీ కృష్ణా నోరు తెరచి మాట్లాడు . కాటుక పెట్టికోనిన విశాలమైన కన్నులు కల ఓ నీలాదేవి ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీవు?ఇంత మాత్రపు ఎడబాటుకుడా ఓర్వ లేకుండుట నీ స్వరుపమునకు, నీ స్వభావమునకు తగదు.
పలుకవా నళినేక్షణా!
పలుకవా నళినేక్షణా!
బదులైన
పలుకవా నవమోహనా!
పలుకవా రవ్వంత? పవళింతువు గాని
కలికి చనుగవపైని తలగడ కేలూని ||పలుకవా||
తళ్ళుకు దంతపుకోళ్ళ మంచమ్ముపై,
లలిత సురభిళ పంచతల్పమ్ము పై
ఒరిగి కొప్పుర దివ్వె వెలుగులో, అల నీల
నెరుల విరతావిలో, నిదురింతువేగాని ||పలుకవా||
గడెయైన వల్లభుని ఎడబాయవు:
తడవైనగాని నిద్దుర లేపవు:
సొగసు కాటుక రేక సోగకన్నుల దాన!
తగదమ్మ నీ వంటి సుగుణవతి కో చాన! ||పలుకవా||
శనివారం, జనవరి 01, 2022
గోపికలు కృష్ణుని పొంది యనుభవించాలని ఆవేసముచే కృష్ణపరమాత్మ కనిపించగానే తామూ అనుభవించ వచ్చునని తొందరగా మేలుకొన్నారు. కాని శ్రీ కృష్ణుడు మేలుకోలేదు. తరువాత బలరాముని మేలుకోల్పారు . అప్పుడు కుడా కృష్ణుడు మేలుకోలేదు . తెలివి తెచ్చుకొని నీలాదేవి ద్వారా మేలుకోల్పవచ్చని ఆమెని మేలుకోల్పుతున్నారు ఈ పాశురములో .
ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్ పాశురము:
ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము :
ఏనుగులతో పోరాడగలిగినవాడును, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలముకలవాడును, మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును, యుద్దములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లు కేశ పాశము గల ఓ నీలాదేవి ! తలుపు గడియ తెరువుము . కోళ్ళు అంతటా చేరి అరుస్తున్నాయి . మదవీలతప్రాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చొని కోకిలలు కూస్తున్నాయి. కావున తెల్లవారినది , చూడు. బంతిని చేతిలో పట్టుకోన్నదానా! మీ బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి . నీవు సంతోషముతో లేచి నడచి వచ్చి. ఎర్ర తామర పూలు ను పోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము. అని నీలాదేవిని కీర్తిస్తున్నారు . ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు.
నందగోపుని కోడలా
నందగోపుని కోడలా! ఓ నీల!
ఎందుకమ్మా తలుపు తీయవు?
విందువా కోళ్ళు కూసేను, ఆ వంక గురి
వింద పోలందు పలికేను గోరింక! || నందగోపుని||
కందుకము వ్రేళ్ళ సందిటను కలదాన!
అందమగు కురుల నెత్తాని కల లలన!
కుందనపు కంకణాల్ చిందులాడీ పాడ
కెందమ్మి పోలేటి నీ సోగ కేల ||నందగోపుని||
సుందరుడు నీ స్వామి శుభనామములను మన
మందరమునూ కూడ పాడుకుందాము!
క్రందుకొను గంధసింధురబలముతో, వైరి
బృందముల క్రిందపడజేయగలిగే వాని ||నందగోపుని||
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ