Blogger Widgets

మంగళవారం, జనవరి 04, 2022

అమ్మమ్మ తో అరిసలు ఎలా చేయించుతానో మీరే చూడండి. 👍👍👍

మంగళవారం, జనవరి 04, 2022

సోమవారం, జనవరి 03, 2022

మేలుకో శ్రీకృష్ణ! మేలుకొనవేమి! (ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు)

సోమవారం, జనవరి 03, 2022

ముందు పాసురములో నీలాదేవిని మేలుకొల్పి,  శ్రీ కృష్ణుని మేలుకొలిపి కృష్ణుడుని ఎలాంటివాడో కీర్తిస్తూ నీలా దేవిని ఎలాంటిదో వర్ణిస్తూ ఆమెను శ్రీ కృష్ణుని వారితో స్నానం చేయుటకు పంపమని అర్ధిస్తున్నారు.  మరి ఎలా వర్ణిస్తున్నారంటే...

ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు పాశురము:
ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
కప్పం తవిర్క్కుం కలియే! తుయిల్ ఏరాయ్
శెప్పం ఉడైయాయ్! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు
వెప్పం కొడుక్కుం విమలా! తుయిల్ ఎరాయ్
శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్
నప్పినై నంగాయ్! తిరువే! తుయిలెరాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్-మణాళనై 
ఇప్పోదే ఎమ్మై నీరాట్టు-ఏలోర్ ఎంబావాయ్  

 తాత్పర్యము:

ముప్పది మూడుకోట్ల అమరులకు వారికింకను ఆపద రాక ముందే పోయి , యుద్ధ భూమిలో వారికి ముందు నిలిచి , వారికి శత్రువుల వలన భయమును తొలగించే బలసాలీ ! మేల్కొనుము అర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము గలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శ త్రువులుగా భావించి వారికి భయ జ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకో ! బంగారు కలశములను పోలిన స్థానములను, దొండపండువలెఎర్రని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవి! పరిపుర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేలుకొనుము. వీచుటకు ఆలవట్టమును (hand fan) కంచుతద్దమును మా కోసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానము చేయునట్లు చేయుము.

మేలుకో శ్రీకృష్ణ! మేలుకొనవేమి!


మేలుకో శ్రీకృష్ణ! మేలుకొనవేమి!
చాలుబడి గల దేవ! మే లొసగు స్వామి!

మున్నేగిముప్పదియు మూడుకోటుల సురల
బన్నముల బాపు బలసాలి! వనమాలీ!
వెన్నుదవిలి విరోదివితతికి వనట గూర్చి
చెన్ను తొలగించు ఆపన్న జనతావనా!  ||మేలుకో శ్రీకృష్ణ! ||

మేలుకో ఓ సిరీ! శాతోదరీ!
మేలుకో ఓ నీల! పరిపూర్ణురాలా!

మేలుకో నవకిసలయాధరా!
కలశోపమపయోధరా!  ||మేలుకో శ్రీకృష్ణ! ||

ఆలవట్టము అద్ద మొసగి నీ స్వామిని
ఆలసింపక పంపవమ్మ నీరాడ! ||మేలుకో శ్రీకృష్ణ ||

మధుమేహం తో ప్రయాణం.... నా బ్యాగ్ లో ఏముంది

ఆదివారం, జనవరి 02, 2022

పలుకవా నళినేక్షణా! (కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్)

ఆదివారం, జనవరి 02, 2022

ముందు పాశురములో పొడుగు జుట్టు గల నీలాదేవి ని మేల్కొల్పి .  ఈ రోజు నీలాదేవిని మేలుకొలిపినా ఈ పాశురములో శ్రీ కృష్ణుని,నీలాదేవిని కూడా మేలుకోల్పవలసినది గా అర్ధించుచున్నారు.  లేచి వారితో మాటాలాడమని కోరుకొని నీలాదేవిని అర్ధిస్తున్నారు కాసేపు అయినా మాతో మాటాడనీ అంటున్నారు. మరి ఎలా అన్నది తెలుసుకుందాం.   నీలాదేవిని కీర్తిస్తున్నవారు ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు.

కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్ పాశురము 
కుత్త విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము: 
ఒక గుత్తి దీపములు చుట్టును వేలుగుచుండగా , ఏనుగు దంతము లతో చేయబడిన కోళ్ళు గల మంచముపై నున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము,ఎత్తు , వెడల్పు కలిగిన పాన్పులపై ఎక్కి , గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకోనిన కేశ పాశము గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండి విశాలమైన వక్షస్థలము గల శ్రీ కృష్ణా నోరు తెరచి మాట్లాడు . కాటుక పెట్టికోనిన విశాలమైన కన్నులు కల ఓ నీలాదేవి ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీవు?ఇంత మాత్రపు ఎడబాటుకుడా ఓర్వ లేకుండుట నీ స్వరుపమునకు, నీ స్వభావమునకు తగదు.

 పలుకవా నళినేక్షణా!
పలుకవా నళినేక్షణా!
బదులైన
పలుకవా నవమోహనా!
పలుకవా రవ్వంత? పవళింతువు గాని
కలికి చనుగవపైని తలగడ కేలూని ||పలుకవా||

తళ్ళుకు దంతపుకోళ్ళ మంచమ్ముపై,
లలిత సురభిళ పంచతల్పమ్ము పై 
ఒరిగి కొప్పుర దివ్వె వెలుగులో, అల నీల
నెరుల విరతావిలో, నిదురింతువేగాని  ||పలుకవా||

గడెయైన వల్లభుని ఎడబాయవు:
తడవైనగాని నిద్దుర లేపవు:
సొగసు కాటుక రేక సోగకన్నుల దాన!
తగదమ్మ నీ వంటి సుగుణవతి కో చాన! ||పలుకవా||

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)