గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుకటి పాశురములో ప్రార్ధించారు. వేరొక గతిలేక నీకే చెందినవారమని చెప్పారు. ఈ పాశురములో తమ ను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసిందిగా అర్ధించుచున్నారు .
అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన పాసురము:
అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు , మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విదియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షిమ్చితివా! మేము అనుభావిమ్చియే తీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును.
ఏది ఏదీ! నీదయావీక్షణము ఏది ఏదీ!
ఏది ఏది! నీ దయా వీక్షణము ఏది ఏది!
ఇంచించుంక పరపుము మాపై, మాపై!
చిరుగజ్జెల వలె విరిసే ఎరనెర్రని తామరల
తెరగున వికసించే ఆ కెంజాయి కందోయి! ||ఏది ఏదీ||
అందమగు ఈ లోకమందలి ఏలికలు
అందరును మానాభిమానములు వీడి
సుందరము నీ గద్దె బృదములులైన
చందమున, నిలుచు మా డెందములు చల్లబడ! ||ఏది ఏదీ||
ఒక్కకనుకొన చూపేచాలును, చాలును-
పాపముల పరిమార్పను!
ఒక్క కనుకొన ప్రాపె చాలును, చాలును-
తాపముల చల్లార్పును! ||ఏది ఏదీ||