గోపికలు పురుష అహంకార భుతురాలగు నీలాదేవిని మేలుకోలిపిరి. ఆమె మేలుకొని "నేను మీలో ఒక్కదానినికదా! నన్ను ఆశ్రయించిన మీకేనాడు లోపముండదు. రండి! మనమందరమూ కలసి శ్రీ కృష్ణుని మేల్కొల్పి అర్దింతము . " అని తానూ వచ్చి గోపికలతో శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి మేలుకొలుపు జొచ్చెను. ఈ విధముగా శ్రీ కృష్ణుని మేలుకోల్పుతున్నారు.
ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప పాసురం
ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్
ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిర్ఱ శుడరే! తుయిల్ ఎరాయ్
మాత్త్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్కణ్
ఆత్తాదు వందు ఉన్-అడిపణియుమా పోలే
పోత్తియాం వందోం పుగరందు-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
పొదుగు క్రిందనుండి కడవలు చరాచర నిండి, పొంగిపొరలి నట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యకములగు, ఉదారములగు, బలసిన ఆవులుగల నందగోపుని కుమారుడా! మేల్కొనుము. ప్రమాణదార్ఢ్యముగల పరబ్రహ్మస్వరూపా ! ఆశ్రితరక్షణ పృతిజ్ఞాధార్ఢ్యముగల మహామహిమ సంపన్నా! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్స్వరూపా ! నిద్ర నుండి లెమ్ము. శత్రువులు నీపరాక్రమమునకు లోకి నీవాకిటికి వచ్చి నీ దాసులై నీపాదారవిందముల నాశ్రయించినట్లు మేముకూడా నిన్ను వీడి యుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి. గోపికలు వారి పరిస్తితిని శ్రీ క్రిష్ణునికి నివేధించినారు.బంగరు కడవలనిండ పాలు
బంగరు కడవలనిండ పాలు
పొంగి పొరల కురిపించె ఆలు
చాలా కలుగు నందుని గారాల నందనా!
మునిహృదయ స్యందనా!
వైకుంఠము విడిచి, లోక
లోకమ్ములు కడచి,
మా కోసము దిగివచ్చిన మా స్వామీ! మేలుకో!
మేలుకో తేజుమయ! నీలప్రియ! మేలుకో!
మేలుకో భక్తాశ్రితపాళీ నరసిజహేళీ!
వైరులు నీ శౌర్యమ్మున కోడి,
సైరింపక, నీ వాకిట కూడి,
బీర మేది శ్రీపదముల
వారక కొలిచే తీరున,
చేరి మంగళాశాసన
మును చేసి, ముదమ్మున కై
వారమ్ముల చేసి, వచ్చి
నార మయ్య, నిదురమాని మేలుకో!
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.