Blogger Widgets

బుధవారం, జనవరి 12, 2022

ఒకటే కోరిక మా కిక (శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్ )

బుధవారం, జనవరి 12, 2022

 మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షమునకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్ కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు. ప్రధానంగా తెలుసుకోవలసినవి రెండు విషయాలున్నవి ఇరవైఎనిమిది , ఇరవై తొమ్మిదో పాశురాలలో వివరించి వ్రతమును పూర్తి  చేస్తున్నారు. 

మొదటి పాసురమున గోపికలు ఈ వ్రతమును ప్రారంభించారు.


అయితే గోపికలు ఈ పాసురములో తమ హృదయము నావిష్కరిమ్చి తమ వ్రతమును సమాప్తము చేసి మనము కూడా తరించవలెనని ఈ పాశురములో స్పష్టముగా వివరించినారు.
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్ పాశురము :
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్

తాత్పర్యము: 
బాగా తెల్లవారకముందే నీ వున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.

ఒకటే కోరిక మా కిక

ఒకటే కోరిక మా కిక

 స్వామీగోవిందా!

మనసు నీకు తెలియదనా! ( మా)

మనవి చేసుకొనుట! ()

 

తెలవారక మున్నే దేవానీ సన్నిధి

చెలులము చేరినీ కొలువే కోరి,

సరస సుందరములు

సంపుల్ల సరోజములు నీ

చరణములకు మంగళా

శాసనమును చేయుట

ఒక పరవాద్యమున కనా?

 స్వామీ గోవిందా  ||ఒకటే||

 

ఆల మేపి బ్రతికే 

బేలలలో ఒకడవై

అవతరించు టేల ? మా

అనుగపు కానేల?

 బంధము నిలుపుము 

డేడు జన్మముల కైన

 కైంకర్యము మానము

ఏనాటికె ఎప్పటికీ   ||ఒకటే||

మంగళవారం, జనవరి 11, 2022

గాజుల గలగలలు ఆడపిల్లకి రక్షణట........😮(Bangles)

మంగళవారం, జనవరి 11, 2022

#bangles,#history#charminar bangles#organizing tips అందరికి నమస్కారం, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం. అతివలు అందానికే కాకుండా సంస్కృతి సాంప్రదాయంతో పాటుగా చేతి గాజులకు ఇంకా చాలా విషయాలు విశేషాలు వున్నాయి తెలుసుకుందామా -అమ్మమ్మ తో నేను మీరు ఈ వీడియో పూర్తిగా చూసి మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రిబ్ చేసుకుని, పక్కనే వున్న గంట బెల్ ని క్లిక్ చేయండి. మా వీడియో నచ్చితే , లైక్ చేయండి మరియూ అందరికీ షేర్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.

చికాకు పడకు చిడిముడి పడకు (కఱవైగళ్ పిన్ శెన్ఱు పాశురము )

 గోపికలు శ్రీ కృష్ణునితో అన్నారు మేము మార్గ శీర్ష స్నానము చేయవలెనని వచ్చాము . మాకు మా వ్రతమునకు కావలసిన పరికరములు అడిగారు. ఆ వ్రతము చేసిన తర్వాత తామూ పొందవలసిన ఆభరణములను, వస్త్రములను, భోగములను ప్రార్దిమ్చినారు .

శ్రీ కృష్ణునకు వారు హృదయము తెలియును. ఇదంతయు లుకిక వ్రత గాధ కాదు. వీరు కోరునవి లుకిక వ్రతోపకరనములు కావు. ఆముష్మిక ఫలమునండుతకే వీరు కోరుచున్నారు. కాని వీరి నోటివేమ్తనే దానిని చెప్పిమ్చవలెను అని తలంచి ఇట్లు అడిగినారు.
ఓ గోపికలారా ! మీరు కోరినవన్నియు చాలా చక్కగా వున్నాయి. మీరు " పరిశీలించి కృపచేయమని" అనిఅన్నారు.
కదా పరిశీలించినా మీ అభిప్రాయమేమో నాకు తోచటంలేదు. వ్రతము చేసి మహత్తరమైన అలంకరనములను భోగములను అందవలెనన్నా దానికొక అదికారము ఉండాలి కదా? ఫలమునాశించిన మీరు ఆ ఫలాప్రాప్తికి ఏదోఒక యత్నము కుడా చేసి యుండాలి కదా? మా కది కావాలని అన్నంత మాత్రమున నేను ఇచ్చుటకు వీలుకాదు. దానికి తగిన యోగ్యతా మీకున్న ఇవ్వగలను. కావున మీకున్న అధికారము అనగా మీ యోగ్యతా ఎట్టిదో వివరించుము. ఫలమును అందగోరు వారు దానికి సాధనమునుగూడ సంపాదిమ్పవలేనుగాడా? మీరు అట్టి సాధనమును దేనినైనా ఆర్జించినారా ?
ఇట్లు అడుగగానే గోపికలు తమ హృదయము విప్పి చెప్పుచున్నారు .
గోపికలు కామ్క్షిమ్చునది పరమ పుశార్ధముఅగు నారంట భగవత్ పురక భవత్కైమ్కర్యము. దానికి వరేమియు యోగ్య తను సంపాదించుకొని రాలేదు . పరమాత్మే ఉపాయముగా నమ్మిన వారు, వాటి కంటే వేరే ఉపాయము తాము పొందుటకు ప్రతిభందకములని తెలుసుకున్నవారు. కర్మలు చేసి, జ్ఞానము సంపాదించి, భక్తి తో ఉపాసించి పరమాత్మను పొందాలని తలంపు వీరికి లేదు. వాడె వానిని పొందించ వలెనని నమ్మినవారు. అందుచే ఇట్లు భగవానుడే యుపాయమని నమ్మకము కలవారు. భగవానుని ముందు ఏమి విజ్ఞాపనము చేయవలెనో ఆమాటలను గోపికలు ఈ పాసురమున వివరిచుచున్నారు .
కఱవైగళ్ పిన్ శెన్ఱు  పాశురము : 
కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్

తాత్పర్యము:
పశువుల వెంట వానిని మేపుటకై అడవికిపోయి. అచటనే శుచినియమములు లేక తిని, జీవిమ్చియుమ్డుతయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియు జ్ఞానములేని మాగోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మిచిన పుణ్యమే మాకున్న పుణ్యము . మాకెన్ని లోపాలున్నా తీర్చగాల్గినట్లు ఏ లోపము లేని వాడవు కదా నీవు. గోవిందా! ఓ స్వామీ ! నీతో మాకుగల సంబంధము పోగొట్టుకోన వీలుకాదు . లోక మర్యాదనేరుగని పిల్లలము. అందుచే ప్రేమవలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలచినాము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక ఉండకుము. మాకు ఆపేక్షితమగు పరను పరను ఇవ్వుము.

చికాకు పడకు చిడిముడి పడకు -

చికాకు పడకు చిడిముడి పడకు -

నీ కరుణ వినా మా కేమ్మున్నది చెప్పు!


మా పున్నెము వలనగదా,

మా కోసమేగాదా, మా

గోపకులములో దిగి

గోవిందుడ వైనావు! || చికాకు||


గోకుల వెంబడి ఏవో

కోనల కొనలలో బడిపోవు

నట్టి  వెర్రిగొల్ల

పొలతులము!


చిన్ని పేర పిలిచాము! ఎన్నో మాట లన్నాము!

ఎన్ని జన్మములదో ఈ వీడిని మనబంధము!

ఇక దయచేయుము వరము పరవాద్యము! ||చికాకు||


సోమవారం, జనవరి 10, 2022

వేడవచ్చునా మరికొన్ని (కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై )

సోమవారం, జనవరి 10, 2022

 గోపికలు తామూ చరించబోవు మార్గ శీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాసురమున విన్నవిమ్చినారు. అందు వారడిగిన ద్రవ్యములు సులభాములేయైననాను వారు కోరిన వారు కోరిన గునముఅలు గల ద్రవ్యము దుర్లభాములు. అందుచే శ్రీ కృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను గోరుట కాదు , నన్నే కోరి వీరీ వస్తువులను కోరినారు. అనుకొనెను.పాచజన్యమును పోలిన శంఖములను కోరారు. మరి అల్లాంటి శంఖము దొరకదు. ఆ శంఖము శ్రీ కృష్ణుని వీడదు. అందుచే శ్రీ కృష్ణుడే శంఖధరుడై తమతో నుండవలెనని వారు కోరారు.

చల్లా పెద్ద పర కావలెనని గోపికలు కోరారు . శ్రీ కృష్ణుడు త్రివిక్రమావతారమున జాంబవంతుడు త్రివిక్రముని విజయమును చాటుచు వాయించిన పరయోకటి కలదు. శ్రీ కృష్ణ రుపముననున్న నేను కుంభ నృత్యము చేయునప్పుడు కట్టుకొని వాయించిన పర చాల పెద్ద పర. ఈ మూడింటిని ఇచ్చెదనని శ్రీ కృష్ణుడు గోపికలకు చెప్పెను. మంగళా శాసనము చేయువారు కావలెనని కోరిరి. మంగళా శాసనము చేయువారెచట నున్న పరమాత్మయే వారి వెంట నుండునని వీరీ అభిప్రాయము.
తమ దేవేరియగు శ్రీ మహాలక్ష్మి నే మంగళ దీపముగా వారితో ఉండునట్లు అంగీకరించెను . జెండా గరుత్మంతుడు . వారికి గరుడునికుడా ఒసగుటకు శ్రీ కృష్ణుడు సమ్మతించెను.
తరువాత చాందినీగా అనంతునే పంపనంగీకరించెను. మధురా నగరమున జన్మించి వ్రేపల్లెకు వచ్చిన ఆ రాత్రి వర్షమున శ్రీ కృష్ణునకు మేలు కట్టుగా తన పడగలనుపయోగించిన మహానీయుడు కదా! అనంతుడు, పడగ, ఆసనము, వస్త్రము, పాదుకలు, తలగడ, చత్రము, చాందిని మొదలగున్నవి విధముల సర్వేస్వరునకు తన శరీరమును భిన్న భిన్న రుపములుగాకుర్చి యుపయోగపడి తనచేతలచే శేషుడు అను పేరు పొందిన మహనీయుడు. వీరు కూడా శేషత్వమునే కోరుతున్నవారగుటచే , శేషునే వారికి చాందినిగా ఇచ్చెను .
ఇలా పరికరములన్నీ సమకూరినవి కదా ! ఇక మీ వ్రతమునకు ఫలమేమో వివరించమని స్వామీ కోరగా . గోపికలు ఈ పాసురమున ఈ వ్రతాచరణముచే తామూ పోందకోరిన ఫలమును వివరించుచున్నారు.  ఈ పాసురము విశేషమైనది నేటి నివేదన చక్కెరపోంగళి ఆరగింపుగాఇస్తారు.  గోపికలు ఈ పాసురము రోజు 108  గిన్నెలు చెక్కరపొంగలి నెయ్యి ఎక్కువ వేసి మోచేతి నుండి కారునట్లు వేసిచేస్తారు.  ఎందుకుఅంటే 26  రోజులు వీరు నెయ్యి వాడలేదు కదా.  అందువల్ల ఈ పాసురము రోజు మంచిగా చెక్కెర పొంగలి నివేదిస్తారు.
కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై పాశురము:
కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై
ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు మురంగైవరివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్ 

తాత్పర్యము:
తనతో కూడని శత్రువులను జయిమ్చేది కళ్యాణ గుణ సంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పర అను వాద్యమును పొంది పొందదలచిన ఘన సన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండును. చేతులుకు గాజులు మొదలుగు ఆభరణములు , బాహువులకు డందకదియములు , చెవి క్రిందు భాగమున దాలెచేది దుద్దు, పై భాగమున పెట్టుకొనే కర్ణపువ్వులు, కాలి అందెలు మొదలుగు అనేక ఆభరణాలు మేము ధరించాలి. తరువాత మంచి చీరలను దాల్చి వుండాలి. దాని తరువాత పాలు అన్నము మున్నగున్నవి నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా హాయిగా భుజిమ్చవలెను. గోపికలు తమ వ్రత ఫలమును ఇందులో వివరించారు.
 వేడవచ్చునా మరికొన్ని, మా

వేడవచ్చునా మరికొన్ని, మా
వేడుకకై కొన్ని,
కూడనివారిని ఓడించే శుభ
గుణములు గల గోవిందా!

ఆడువారి కోరికలు అనుకోకు!
కూడదనకు గోవిందా! నీ
రాడి వచ్చి వ్రత మూనిన ముదమున
అదిగెద మంతే స్వామి!

సూడిగములు, జుమికీలు, చెనాకులు
పాడగములు, కేయూరములు,
తొడవులన్ని కయి సేయగ వలదో!
తొడగవలదో పలువన్నెల పలువలు! ||వేడవచ్చునా||

ఇంతకన్నా శుభవేళ ఏది?
ఇంతకన్నా ఆనంద మేది?
బంతులుగా నీతోడ గూడి
ఇంతుల మెల్లరము

నెయ్యి వెన్న మీగడలు
తీయని తీయని పాయసము
చేయి మునుగగా ఆరగింప
చేయవా! చిత్తగింపవా!    ||వేడవచ్చునా||

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)