మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షమునకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్ కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు. ప్రధానంగా తెలుసుకోవలసినవి రెండు విషయాలున్నవి ఇరవైఎనిమిది , ఇరవై తొమ్మిదో పాశురాలలో వివరించి వ్రతమును పూర్తి చేస్తున్నారు.
ఒకటే కోరిక మా కిక
ఒకటే కోరిక మా కిక
ఓ స్వామీ! గోవిందా!
మనసు నీకు తెలియదనా! ( మా)
మనవి చేసుకొనుట! (ఈ)
తెలవారక మున్నే దేవా, నీ సన్నిధి
చెలులము చేరి, నీ కొలువే కోరి,
సరస సుందరములు
సంపుల్ల సరోజములు నీ
చరణములకు మంగళా
శాసనమును చేయుట
ఒక పరవాద్యమున కనా?
ఓ స్వామీ గోవిందా ||ఒకటే||
ఆల మేపి బ్రతికే ఈ
బేలలలో ఒకడవై
అవతరించు టేల ? మా
అనుగపు కానేల?
ఈ బంధము నిలుపుము ఏ
డేడు జన్మముల కైన
ఈ కైంకర్యము మానము
ఏనాటికె ఎప్పటికీ ||ఒకటే||
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.