ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం బాగా చేసుకున్నాము కదా ఈ రోజు ఆఖరి పాసురము. ఈ వ్రతము సర్వఫలముల నొసంగు నది. అందరు ఆచరించదగినది. ఇట్టి ఈ వ్రతము నాచరింపలేక పొయినను నిత్యము ఈ ముప్పై పాశురములు తప్పక అభ్యాసము చెయువారికి కూడా తాను చేసిన వ్రత ఫలము లభించాలని గొదాదెవి ఈ పాసురములొ ఆశించినది నిత్యము ముప్పై పాసురాలు చదువుటయే ముక్తికి హేతువు . ఈ లోకమున ఐశ్వర్యప్రధము అగు ఇట్టి వ్రతమును తప్పక అందరు ఆచరించి తరింతురుగాక.
గోదాదేవి తాను గోపికగనే వ్రతమునుచెసినది. ఫలము భగవత్ప్రాప్తి , అట్టి భగవానుడే పొదుటకై చేసినయత్నము పాల సముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చేయుటకంటె స్వామియే మనము పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమౄతమధన వృతాంతము నిందు కీర్తించుచున్నారు. ఈ ముప్పై పాశురములు పఠించిన వారికి ఆనాడు పాలసముద్రమును మధింపచెసిన లక్ష్మి ని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నంచి పొందును. ఇల్లా ఫలశ్రుతిని ఈ పాశురములో చేయుబడుచున్నది.
వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై పాశురము:
ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో , వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును గూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే , పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బాహుశిరస్సులు గలవాడును అగు శ్రీ వల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును. అని ఫలశ్రుతి పాడిరి.
శుభమగుగాత! సుఖమగుగాత!
శుభమగుగాత! సుఖమగుగాత!
ఉభయ విభూతి నాయకుడౌ శ్రీ
విభుని, ప్రపన్న సులభుని దయచేత !
విలిపుత్తూరున వెలయు భట్ట నా
థుల కూతురు ముప్పదులు తమిళ కృతు
లలరుమాలగా నల్లె - అన్నిటిని
ఎలమి తవిలి పఠియించిన వారికి
శుభ మగుగాత! సుఖమగుగాత!
నావలుగల వనధిని మధియించిన
శ్రీ వల్లభుని కేశవుని దరిసిన
ఆ విధువదనులు దివ్యాభరణాలు
ఏ విధి వ్రత మూని ఏ వర మందిరొ
ఎరిగిన వారికి ఇహపరములలో
శుభమగుగాత! సుఖమగుగాత!
కలిత పద్మాక్ష శిశిర మాలికా
విలసితుడౌ శ్రీ పెరియాళ్వారుల
తులసి మొలక, శూడి కొడుత నాంచారు
సెలవిచ్చిన ఈ తిరుప్పావై
ఎలమి తవిలి పఠియించినవారికి
శుభమగుగాత! సుఖమగుగాత!
గిరుల వంటి నాలుగు పెనుభుజములు,
అరుణనేత్రములు, శ్రీ ముఖమును గల
ఉభయ విభూతి నాయకుడౌ శ్రీ
విభుని ప్రపన్న సులభుని దయచేత || శుభము||