Blogger Widgets

సోమవారం, జనవరి 25, 2010

Happy Republic Day

సోమవారం, జనవరి 25, 2010






A republic is an area or a nation, which is free to choose its own laws and government. India became a republic on 26 Jan 1950 when a constitution adopted by the government of India came into force.

This occasion is celebrated every year on January 26 as the republic day.
The Republic Day was once called the independence day! At the Lahore Session of the Indian National Congress in 1930, the party members decided to celebrate January 26 as the "Independence Day" to mark India's struggle for independence. When India won independence and the national constitution was made the government decided to implement it on the 26th of January 1950, which came to be known as the republic day.

బుధవారం, జనవరి 13, 2010

సంక్రాంతి శుభాకాంక్షలు

బుధవారం, జనవరి 13, 2010

నమస్కారం
రంగు రంగులు ముగ్గులతో, ముంగిట్లో గొబ్బెమ్మలు, హరినామ సంకీర్తనలు, బసవయ్యవిన్యాసాలతో,ఆకాశాన గాలిపటాలు, ఇవన్నీ సంక్రాతి మహాలక్ష్మికి, ఉత్తరాయణ పుణ్యపురుషునికి మనం స్వాగతినిస్తున్నాయి.ఈ సంక్రాంతికి
బ్లాగ్ మిత్రులందరకు,నా స్నేహితులకు,నాకుటుంబసభ్యులకు, అన్నిరకాలగా నాకు సహకరించిన వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Sankranti Subhakankshalu

ఈ పండగను అందరు ఆనందంగా జరుపుకొవాలని కోరుకుంటు.
శ్రీ వైష్ణవి

తిరుప్పావై ఇరవై తొమ్మిదవ పాశురం

ఆండాళ్ తిరువడి గలే శరణం :
మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షము నకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి.
కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్
కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు.
ప్రధానంగా తెలుసుకోవలసినవి రెండు విషయాలున్నవి ఇరవైఎనిమిది , ఇరవై తొమ్మిదో పాశురాలలో వివరించి వ్రతమును పుత్ర్తి చేస్తున్నారు. ముప్పైవ పాసురములో ఫలశ్రుతి.
మొదటి పాసురమున గోపికలు ఈ వ్రతమును ప్రారంభించారు.
అయితే గోపికలు ఈ పాసురములో తమ హృదయము నావిష్కరిమ్చి తమ వ్రతమును సమాప్తము చేసి మనము కూడా తరించవలెనని ఈ పాశురములో స్పష్టముగా వివరించినారు.

శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్


Pasuram29-HH.mp3

తాత్పర్యము:
బాగా తెల్లవారకముందే నీ వున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.

మంగళవారం, జనవరి 12, 2010

కొలని దోపరి్కి గొబ్బిళ్ళో

మంగళవారం, జనవరి 12, 2010

నమస్కారం
రేపు బోగిపండుగ కదా అందరికి పండగ శుభాకాంక్షలు. నాలాంటి వారందరు ఉదయాన్నేలేచి ముగ్గులు పెట్టి వాటికి రంగులు వేసి గొబ్బిళ్ళు పెడతారు కదా. చిన్ని కృష్ణుని కీర్తిస్తు పాటలు పాడతారు అందరు. వారికోసమే ఈ పాట.
ఈ పాటను అన్నమాచార్యులవారు రచించారు. ఎంతబాగుందో కదా.







కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో

కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో
దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో

పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో

దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో



My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)