Blogger Widgets

మంగళవారం, ఆగస్టు 31, 2010

వసుదేవ సుతం దేవం

మంగళవారం, ఆగస్టు 31, 2010


వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

అతసి పుష్ప సంకాశం హార నూపుర శోభితం 
రత్న కంకణ  కేయూరం కృష్ణం వందే జగద్గురుం

కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం
విలసత్ కుండల ధరం కృష్ణం వందే జగద్గురుం




మందార గంధ సంయుక్తం చారు హాసం చతుర్భుజం
బహి: పింఛావ చూడాంగం  కృష్ణం వందే జగద్గురుం 

ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభమ్

యాదావానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్

గోపికానాం కుచద్వందం కుంకుమాంకిత   వక్షసం
శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుసోభితం
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం




 శ్రీ వత్సాంగం మహోరస్కం వనమాలా విరాజితం
శంఖ చక్ర ధరం దేవం  కృష్ణం వందే జగద్గురుం 

గురువారం, ఆగస్టు 26, 2010

శ్రీ సాధు శ్యాంప్రసాద్ గారి పదవీ విరమణ

గురువారం, ఆగస్టు 26, 2010

మా తాత  శ్రీ సాధు శ్యాంప్రసాద్ గారి పదవీ విరమణ  చేస్తున్న సంధర్భంగా 
మా తాతయ్య  చింతా రామకృష్ణారావు గారు రచించిన సన్మానకుసుమాంజలి సమర్పిస్తూ, 
 మన లహరి బ్లాగు ద్వారా  అబినందనలు తెలియ జేస్తున్నాను. 

శ్రీ సాధు శ్యాంప్రసాద్

శ్రీరస్తు                 శుభమస్తు               అవిగ్నమస్తు.
శ్రీ సాధు శ్యాంప్రసాద్ (ఎడ్మినిష్ట్రేటీవ్ ఆఫీసర్. బీ.ఐ.యీ. ) 
తే.. 31 - 8 - 2010.ని పదవీ విరమణ చేయుచున్న సందర్భముగా సమర్పించిన
సన్మాన కుసుమాంజలి.
రచన:- చింతా రామ కృష్ణా రావు.(రిటైర్డ్ తెలుగు లెక్చరర్)

శాll శ్రీమత్ సాధు సు పూజ్య పాద యుగళా శ్రీయుక్త వక్షా! హరీ!
ధీమంతుండగు సాధు శ్యాముడిపుడే దేదీప్య మానంబుగా
ప్రేమన్ జేసెడి వృత్తిలో విరమణం బ్రీతిన్ యొనర్చెన్. తనన్
ప్రేమం గాచి; సుఖంబులిచ్చి నిలుమా! శ్రీమంత రక్షింపగన్. 1

ఉll సాధు సు పూజ్య వంశమున చక్కగ సుబ్బమ సత్య నార్యకున్
మాధవుడిచ్చు సత్ ఫలము మాదిరి పుట్టితి వీవు శ్యాంప్రసాద్!.
శ్రీధవుడట్లు పొందితివి సీతను. కంటిరి రామ కృష్ణునిన్;
మేదుర భావ పూర్ణుఁడగు మేధగ సత్ కిరణున్; సతాంవరా!  2

సీll పరగితి వెల్డీసి పదవిలో పందొమ్ది - వందల డబ్బది తొందిలోన.
ఎనుబది మూడులో నెనరున యూడీసి - పదవి నందితి వీవు ప్రబఁ జేయ.
రెండు వేల్రెండులో నిండగు మనమున - సూపరిండెంటువై శోభిలితివి.
రెండువేలెమ్దిలోనిండగు యేవోగ - పదవి చేపట్టి సత్ప్రభను గొలిపి;
గీll నేటి వరకును చూడ నీ సాటి లేరు
లేరు లేరను తీరున గౌరవమును
పెంచినాడవు పదవికి. ప్రీతితోడ
ముప్పదేడులు గడిపిన పుణ్య తేజ!  3

ఉll చేసిన సేవ లన్నిటిని శీఘ్ర గతిన్ గురితించె పాలకుల్.
బాసట నిల్చి నీదు ప్రతిభన్ గొనియాడుచు ప్రోత్సహించుచున్.
నీ సరి లేరనంగ వరణీయ మహాద్భుత సేవఁ జేసి నీ
వాసిని చూపినావు.వర భావ సముజ్వల దివ్య మూర్తిరో!  4. 

సీll ఆకాశ వాణిలో నద్భుత నాటక  - పాత్రలు వేసిరి ప్రతిభ చూపి;
దూరదర్శనునందు తులలీని నిపుణత - చూపి పాత్రలు వేసి శోభిలితిరి.
ప్రకటిత సేవల నుకళానికేతను - నందు జేసి బహుమతందినారు.
నాటక రంగాన మేటి నటనఁ జూపి; - రేకపాత్రలు వేసి రింపుతోడ.
ముచ్చటతో మీరు ముప్పదియారు నా - టకములలో వేసి రికద! మహిత!
అవధానముల పృచ్ఛకాగ్రణిగా నిల్చి; - గరికిపాటియె మెచ్చగా రహించి;
పెక్కు సంస్థలలోన ప్రఖ్యాత సేవలు - చేసి సజ్జనమదిఁ జేరినావు.
సాంఘిక సేవలు సారస్వతపు సేవ - నేత్ర దానాదులు నెరపినావు.
గీll మంచి వృత్తముఁ గలిగిన మాననీయ!
నేటి పదవీ విరమణను నెరపు నిన్ను
దైవమారోగ్యమిచ్చుత! దయను గనుత!
మంగళాత్ముఁడ! నీకు సన్మంగళములు. 5.

మంగళం                                                                                మహత్         
   శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ 

మదర్ థేరిస



మదర్ థెరీసాగా పేరు పొందిన ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు . జన్మదినము నేడు ఆగస్టు 26 వ తేదీన. మాసిడోనియాలోని అల్భేనియన్స్ కి పుట్టినారు.  మదర్ ధేరిస పేద రోగులు సేవచేసి  అందరికీ మదర్ అయ్యారు.  ఆమెసేవకు నోబుల్ బహుమతి ని అందించారు అంతే కాదు మన భారత దేశపు ప్రముఖ  అవార్డు భారతరత్న ని ఇచ్చి ఆమెను గౌరవించారు.  ఆమె రోమన్ కేధలిక్ సన్యాసి గా జీవించారు.  
ఈ రోజు ఆమె చెప్పున గొప్ప మాట తలుచుకుందాం ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అన్నమాట అన్నారు ఆమె చాలా బాగా అన్నారు కదా ఆమె మాటని ఆధర్సంగా తీసుకుందాము మరి . 

మంగళవారం, ఆగస్టు 24, 2010

Happy Rakhi

మంగళవారం, ఆగస్టు 24, 2010

The festival of Raksha Bandhan is entirely dedicated to the love and affection shared between a brother and a sister. On this day, sisters pray for long life of their brothers and ask God to bless them with his blessings. Brothers, in turn, give them enticing rakhi gifts and promise to care life long. This custom has been there since time immemorial. Various other believes are associated with Rakhi and therefore, people follow certain custom and tradition to celebrate this festival.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)