మా తాత శ్రీ సాధు శ్యాంప్రసాద్ గారి పదవీ విరమణ చేస్తున్న సంధర్భంగా
మా తాతయ్య చింతా రామకృష్ణారావు గారు రచించిన సన్మానకుసుమాంజలి సమర్పిస్తూ,
మన లహరి బ్లాగు ద్వారా అబినందనలు తెలియ జేస్తున్నాను.
శ్రీ సాధు శ్యాంప్రసాద్
శ్రీ సాధు శ్యాంప్రసాద్ (ఎడ్మినిష్ట్రేటీవ్ ఆఫీసర్. బీ.ఐ.యీ. )
తే.. 31 - 8 - 2010.ని పదవీ విరమణ చేయుచున్న సందర్భముగా సమర్పించిన
సన్మాన కుసుమాంజలి.
రచన:- చింతా రామ కృష్ణా రావు.(రిటైర్డ్ తెలుగు లెక్చరర్)
శాll శ్రీమత్ సాధు సు పూజ్య పాద యుగళా శ్రీయుక్త వక్షా! హరీ!
ధీమంతుండగు సాధు శ్యాముడిపుడే దేదీప్య మానంబుగా
ప్రేమన్ జేసెడి వృత్తిలో విరమణం బ్రీతిన్ యొనర్చెన్. తనన్
ప్రేమం గాచి; సుఖంబులిచ్చి నిలుమా! శ్రీమంత రక్షింపగన్. 1
ఉll సాధు సు పూజ్య వంశమున చక్కగ సుబ్బమ సత్య నార్యకున్
మాధవుడిచ్చు సత్ ఫలము మాదిరి పుట్టితి వీవు శ్యాంప్రసాద్!.
శ్రీధవుడట్లు పొందితివి సీతను. కంటిరి రామ కృష్ణునిన్;
మేదుర భావ పూర్ణుఁడగు మేధగ సత్ కిరణున్; సతాంవరా! 2
సీll పరగితి వెల్డీసి పదవిలో పందొమ్ది - వందల డబ్బది తొందిలోన.
ఎనుబది మూడులో నెనరున యూడీసి - పదవి నందితి వీవు ప్రబఁ జేయ.
రెండు వేల్రెండులో నిండగు మనమున - సూపరిండెంటువై శోభిలితివి.
రెండువేలెమ్దిలోనిండగు యేవోగ - పదవి చేపట్టి సత్ప్రభను గొలిపి;
గీll నేటి వరకును చూడ నీ సాటి లేరు
లేరు లేరను తీరున గౌరవమును
పెంచినాడవు పదవికి. ప్రీతితోడ
ముప్పదేడులు గడిపిన పుణ్య తేజ! 3
ఉll చేసిన సేవ లన్నిటిని శీఘ్ర గతిన్ గురితించె పాలకుల్.
బాసట నిల్చి నీదు ప్రతిభన్ గొనియాడుచు ప్రోత్సహించుచున్.
నీ సరి లేరనంగ వరణీయ మహాద్భుత సేవఁ జేసి నీ
వాసిని చూపినావు.వర భావ సముజ్వల దివ్య మూర్తిరో! 4.
సీll ఆకాశ వాణిలో నద్భుత నాటక - పాత్రలు వేసిరి ప్రతిభ చూపి;
దూరదర్శనునందు తులలీని నిపుణత - చూపి పాత్రలు వేసి శోభిలితిరి.
ప్రకటిత సేవల నుకళానికేతను - నందు జేసి బహుమతందినారు.
నాటక రంగాన మేటి నటనఁ జూపి; - రేకపాత్రలు వేసి రింపుతోడ.
ముచ్చటతో మీరు ముప్పదియారు నా - టకములలో వేసి రికద! మహిత!
అవధానముల పృచ్ఛకాగ్రణిగా నిల్చి; - గరికిపాటియె మెచ్చగా రహించి;
పెక్కు సంస్థలలోన ప్రఖ్యాత సేవలు - చేసి సజ్జనమదిఁ జేరినావు.
సాంఘిక సేవలు సారస్వతపు సేవ - నేత్ర దానాదులు నెరపినావు.
గీll మంచి వృత్తముఁ గలిగిన మాననీయ!
నేటి పదవీ విరమణను నెరపు నిన్ను
దైవమారోగ్యమిచ్చుత! దయను గనుత!
మంగళాత్ముఁడ! నీకు సన్మంగళములు. 5.
మంగళం మహత్
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
మీ తాతయ్య గారి గురించి మరో తాతయ్య చక్కగా వివరించారు. చిట్టి తల్లీ, వారిద్దరికీ నా తరపున నమస్కారాలమ్మా!
రిప్లయితొలగించండిఅమ్మా శ్రీ వైష్ణవి మీ తాతగారు అయిన శ్రీ సాధు శ్యాంప్రసాద్ గారికి పదవీవిరమణ సందర్భంగా శుభాకాంక్షలు. వారు తన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి వుంటారు. ఇక వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక
రిప్లయితొలగించండిభావిజీవితం ప్రశాంతంగా,సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందమయంగా సాగాలని మా ఆకాంక్ష,
Hai Vaishnavi, mee taathagaariki padavi viramana subhaakaamkshalu.
రిప్లయితొలగించండిHappy retirement Sir.
రిప్లయితొలగించండిచిన్నరి వష్ణవీ చాలా బాగుంది . తాత గారి పదవీ విరమణకి తాత గారి హౄదయ కుసు మాంజలి ఎంత బాగుందో ! ఇద్దరి తాత గార్ల మధ్యన నువ్వెంత గారాల పట్టివో నాకు తెలిసింది లే ! ఇంకేం ? బోలెడు కధలు కావ్యాలు అన్నీ నీకు సొంతం .కాస్త అప్పుడప్పుడు మాకు కుడా పంచు తూ ఉండు తాత గారి ఒడిలొ మమ్మల్ని మర్చి పోకేం ? మీ అందరికి నా అభినందనలు ఆశీర్వాదములు అని నా మాటగ చెప్పు సరేనా ? బై.
రిప్లయితొలగించండిhappy retired life.
రిప్లయితొలగించండిశ్రీ సాధు శ్యాంప్రసాద్ గారూ! నమస్తే. మీరు పదవీ విరమణ చేయుచున్న సందర్భముగా నాయొక్క మా కుటుంబము యొక్క హృదయ పూర్వక శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి