Blogger Widgets

శుక్రవారం, జనవరి 30, 2015

(భీష్మ ఏకాదశి) విష్ణు సహస్రనామ స్తోత్రము జన్మదినం

శుక్రవారం, జనవరి 30, 2015


ఈరోజు భీష్మ ఏకాదశి.  ఇది ఏకాదశి లలో చాలా విశేషమైన ఏకాదశి.  ఈరోజు భీష్మ పితామహుల నోటినుండి విష్ణు సహస్ర నామము అందరికీ ఉపదేసించబదినది. నేడు విష్ణు సహస్రం పుట్టినరోజు అన్నమాట.  తండ్రి మాటకు తలొగ్గి శ్రీరాముడు ఆదర్శపురుషుడైతే. ఒక మెట్టు ఎక్కువగా తండ్రి సుఖం కోరి సింహాసనాన్ని వదులుకుని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు. అంపశయ్యపై నుండే విష్ణుసహస్రనామ కీర్తన చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధ ఏకాదశిని తన పేరిట భీష్మ  ఏకాదశి గా బహుమానంగా పొందిన గొప్ప పురాణ పురుషుడు. 
అది ద్వాపరయుగం. శోభకృతు నామ సంవత్సరం. మాఘశుద్ధ అష్టమి. ప్రత్యక్ష నారాయణుడు తీక్షణ కిరణాలతో వెలిగిపోతుండగా ఆ మిట్టమధ్యాహ్నం వేళ  శ్రీమహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయాడు భీష్ముడు. ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే.  భీషాష్టమి. మరణించే ముందు కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం మూడురోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురువృద్ధుని పేరిట భీష్మఏకాదశిగా ప్రసిద్ధి పొందింది. 

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన హిందూ ప్రార్థనలలో ఒకటి. పేరును బట్టి ఇది శ్రీమహావిష్ణువు వేయి నామాలను సంకీర్తనం చేసేస్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.
విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో 149వ అధ్యాయంలో ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద పండుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠురు నకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి)లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడినది.
విష్ణు సహస్రనామ స్తోత్రము ఆవిర్భవించిన పరిస్థితులు ఆసక్తి కరమైనవి. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన జనక్షయం, కష్టాలవలన పాండవాగ్రజుడు యుధిష్ఠిరుడు కృంగిపోయి ఉన్నాడు. తన వంశోన్నతిని కోరిన భీష్ముడు అంపశయ్యపై మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అనితర జ్ఞాననిలయమైన భీష్ముని ఆశ్రయించి ధర్మాన్ని, నీతిని తెలిసికొనమని యుధిష్ఠిరుని వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు ఆదేశించారు. భీష్ముడు కృష్ణునితో "ప్రభూ! జగద్గురువువైన నీయెదుట నేను ఉపదేశము చేయజాలినవాడను కాను. ఆపై క్షతగాత్రుడనైన నా బుద్ధి, శక్తి క్షీణించినవి. క్షమింపుడు" అనెను. అప్పుడు శ్రీకృష్ణుడు "భీష్మా! నా ప్రభావము చేత నీ క్లేశములన్నీ ఇపుడే తొలగిపోవును. సమస్త జ్ఞానము నీ బుద్ధికి స్ఫురించును. నీచేత నేను ధర్మోపదేశము చేయించుచున్నాను" అని అనుగ్రహించెను. అలా భీష్ముడు అంపశయ్యపైనుండే యుధిష్ఠిరునకు సమస్త జ్ఞాన, ధర్మములను ఉపదేశించెను.  అలా జ్ఞానబోధను గ్రహించే సమయంలో యుధిష్ఠిరుడు ఆరు ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నల సారాంశము: "దుఃఖముతో కృంగి ఉన్న నాకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితమును ఇచ్చే ఉపాయమేది? ఎవరిని స్తుతించాలి?" దానికి భీష్ముడు చెప్పిన ఉపాయము: "భక్తితో, శ్రద్ధతో విష్ణువు వేయి నామాలను జపించు. అన్ని దుఃఖములు, కష్టములు, పాపములనుండి విముక్తి పొందడానికి ఇదే సులభమైన మార్గము". అలా భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామ స్తోత్రము.
విష్ణు సహస్రనామ స్తోత్రపఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ. చాలా స్తోత్రాలలో లాగానే విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివిధ విభాగాలున్నాయి.

ప్రార్థన

ప్రార్ధన శ్లోకములు, స్తోత్రము ఆవిర్భవించిన సందర్భ వివరణ ఈ పూర్వపీఠికలో ఉన్నాయి. ముందుగా వినాయకునకు, విష్వక్సేనునకు, వ్యాసునకు, ఆపై విష్ణువుకు ప్రణామములతో స్తోత్రము ఆరంభమౌతుంది.

ముఖ్య స్తోత్ర:

అనేక పవిత్ర ధర్మములను విన్న తరువాత ధర్మరాజు భీష్ముని అడిగిన ఆరు ప్రశ్నలు:
  1. కిమ్ ఏకమ్ దైవతం లోకే - లోకంలో ఒక్కడే అయిన దేవుడు ఎవరు?
  2. కిమ్ వాపి ఏకమ్ పరాయణమ్ - జీవితానికి పరమపదమైన గమ్యము ఏది?
  3. స్తువంతః కమ్ ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును?
  4. కమ్ అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని అర్చించుట వలన మానవునకు శుభములు లభించును?
  5. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః - మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది?
  6. కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ - ఏ దేవుని జపించుటవలన జన్మ సంసార బంధనములనుండి ముక్తి లభించును?    అన్న ప్రశ్నలు అడుగగా.....
అందుకు భీష్ముడు చెప్పిన సమాధానం: జగత్ప్రభువును, దేవదేవుని, అనంతుని, పురుషోత్తముని వేయి నామములను నిశ్చలమైన భక్తితో స్తుతిసేయట వలనను, ఆరాధించుట వలనను, ధ్యానించుట వలనను, ప్రణామము చేయుట వలనను సర్వదుఃఖములనుండి విముక్తి పొందవచ్చును. ఆ బ్రహ్మణ్యుని, పుండరీకాక్షుని ఆరాధించుట ఉత్తమ ధర్మము. ఆ దేవదేవుడు పరమ మంగళ ప్రదుడు. సకల సృష్టి-స్థితి-లయ కారకుడు. ఈ వేయి గుణ కీర్తనకరములైన నామములను ఋషులు గానము చేసినారు.
విష్ణు సహస్రనామాలను గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యలు రచించిన భాష్యము వీటిలో ప్రధమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము భగవద్గుణ దర్పణము అనే గ్రంధం విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించినది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.  ఇది మహాభారతమునకు సారము.  విష్ణువు అంశావతారము, వేదవిదుడు అనబడే వేదవ్యాసుడు దీనిని మనకు అందించాడు. ఇది ధర్మములలోకెల్ల ఉత్తమము, సులభము, సకల కర్మబంధ విముక్తి సాధకము అని భీష్ముడు చెప్పాడు. ఈ స్తోత్రపారాయణం దుఃఖములనుహరిస్తుందనీ, శాంతి సంపదలను కలుగజేస్తుందనీ విస్తృతమైన విశ్వాసం
ఈరోజు అందరు ఇళ్ళల్లోను, గుళ్ళలోను విష్ణుసహస్రనామ స్తోత్రం పూజలు  చేస్తున్నారు.  నేడు విష్ణువు గురించి, భీష్ములవారి గురించి , విష్ణుసహస్రము గురించి తెలుసుకున్నాము. మనజన్మ ధన్యము అయినట్టే కదా.  విష్ణుసహస్రనామస్తోత్ర జన్మదిన శుభాకాంక్షలు.
జై శ్రీమన్నారాయణ

ఆదివారం, జనవరి 25, 2015

మనప్రత్యక్ష దేవుడు భానుడి జన్మదినము

ఆదివారం, జనవరి 25, 2015

ధసప్తమి అనగా మనప్రత్యక్ష దేవదేవుడు సూర్యుడు జన్మదినమును జరుపుకుంటాం.   రధసప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను (ఏడు  గుర్రముల పేర్లు వరుసగా గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ణుప్, అనుష్ణుప్, పంక్తి )  వంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏడురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు, శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు. ఎముకలకు  బలముగా వుంటాయి.  కేన్సర్ రాకుండా కాపాడతాయి.  ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.. ప్రజలకు అసలు 'విటమిన్‌-డి' లోపమనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువుచేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్‌-డి లోపం ఉంది.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.
శుద్ధ సప్తమికి ’రథసప్తమి’ అని పేరు. ఈరోజు ఒక పరిపూర్ణ పర్వం. దీక్షానిర్వహణకి, వ్రతాచరణకి, సాధనాలకు ఈ సప్తమి ప్రసిద్ధి. ఏడాది పొడుగునా సూర్యారాధన చేసిన ఫలం ఈ దినం లభిస్తుంది.
సూర్యునికి రాగి పాత్ర ద్వారా అర్ఘ్యాన్నివ్వడం, ఎర్రచందనం, ఎర్రపువ్వులతో అర్చన చేయడం వంటివి ఈ రోజు ప్రత్యేకతలు.ఆవుపాల పాయసం నివేదించడం, అది కూడా ఆరుబయట సూర్యకిరణాలు పడే తావున ఆవుపేడ పిడకలను మండించి, దానిపై పాయసాన్ని పొంగించడం ఒక చక్కని ప్రక్రియ. వైద్యవిధానం, దేవతా మహిమ కలబోసిన పద్ధతి ఇది.
’రథ’శబ్దం గమనంలోని మార్పుని సూచిస్తుంది. సూర్యకిరణ ప్రసారం భూమికి లభించే తీరులో ఈ రోజునుండి ఒక మలుపు. ఈ మలుపులోని దేవతా ప్రభావాన్ని పొందేందుకు మన సంస్కృతిలో ఈ ఆనవాయితీని ప్రవేశపెట్టారు.
రామాయణంలో రావణవధి సమయంలో శ్రీరాముడు ’ఆదిత్యహృదయం’తో సూర్యోపాసన చేసి విజయం సాధించాడు. భారతంలో ధర్మరాజు ధౌమ్యుని ద్వారా సూర్యాష్టోత్తర శతనామ మంత్రమాలను ఉపదేశం పొంది , ఆదిత్యానుగ్రహంతో అన్న సమృద్ధిని, అక్షయపాత్రని సంపాదించాడు.
శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసన ద్వారా కుష్టువ్యాధి నుండి విముక్తుడయ్యాడు. చారిత్రకంగా మయూర కవి సూర్యశతక రచనతో ఆరోగ్యవంతుడయ్యాడు.
ఇలా పౌరాణిక చారిత్రకాధారాలు రవికృపా వైభవాన్ని చాటి చెబుతున్నాయి.  ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వున్నాయి. 
సూర్య రశ్మిలో విటమిన్ D ఉంటుంది అది ఎముకల పటుత్వానికి అవసరం అని చెబుతారు. అంతే కాకుండా విటమిన్ D కణ విభజనలో కూడా తోడ్పడుతోంది. దీన వలన గాయాలు మానడమే కాకుండా కాన్సర్ రాకుండా కూడా ఉపయోగం ఉంటుంది. సూర కాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయిన వారిలో చాలా రకాల కాన్సర్ తక్కువగా వస్తుంది అని డాక్టర్స్ చెబుతారు. ముఖ్యంగా పెద్ద పేగు, మల ద్వారానికి సంబంధించిన కాన్సర్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. 

  
నమస్కారిస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష దేవుడు సూర్యనారాయణ మూర్తి జన్మదినం నే రథసప్తమి గా జరుపుకుంటున్నాము.  భాస్కరునికి క్షీరాన్నం నైవేద్యం సమర్పించాలి.  అందరికి రధసప్తమి శుభాకాంక్షలు. 

శుక్రవారం, జనవరి 23, 2015

చేతిరాత దినోత్సవ శుభాకాంక్షలు.

శుక్రవారం, జనవరి 23, 2015

చేతిరాత 
చదువుకు ఎంత ప్రాముఖ్యత వుందో చేతి రాతకు కూడా అంతే ప్రాముఖ్యత వుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ఈమధ్య నాకు స్కూల్ లో చేతి రాత పరీక్షా జరిగింది. అంతే కాదు ఈరోజు చేతి రాత దినోత్సవం కదా అందుకే.  మనం విధి రాతను మార్చలేం కాని మన చేతిరాతను ప్రాక్టిస్ తో అందంగా ముత్యాలు పరచినట్టు అందంగా రాయచ్చు. మంచి రైటింగ్‌ విద్యార్థులకు ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే నేటి సమాజంలో విద్యార్థులు చక్కటి చేతిరాత లేకపోవడం వల్ల పోటీ పరీక్షల్లో మంచి మార్కులను కోల్పోతున్నారు. అందువల్ల చేతిరాత చక్కగా ఉండాలంటే కొన్ని నియమాలను తప్పక పాటించవల్సి ఉంటుంది. అందులో కొన్ని మంచి మార్కులును తెచ్చి పెడుతుంది కూడా. అదే విధంగా చదివి అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఒక్కసారి రాయడం, వంద సార్లు చదివిన దానితో సమానం అని టీచర్లు కూడా ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. చేతిరాత బాగా రాయలేకపోతే వచ్చే నష్టాలూ తక్కువే కాదు. మన చేతిరాత అర్థం కాకపోతే చదివేవాళ్లకు విసుగు వస్తుంది. పరీక్ష పేపర్లు దిద్దేవాళ్లకు అర్థం కాకపోతే మార్కులు తక్కువ వేస్తారు. ఇక్కడ చెప్పకునేది ఏమిటంటే ఏది రాసినా ఎదుటివారికి అర్థమయ్యేలా రాయడం ముఖ్యం. అందుకని చిన్నప్పటినుండే పిల్లలకు రాయడం ప్రాక్టీసు చేయించాలి. ఏ పరీక్షలో విజయం సాధించాలన్నా ఎక్కువగా రాతతోటే పని. వాటిల్లో బాగా రాయగలిగితేనే మంచి మార్కులు సాధించగలుగుతారు. అందుకని చిన్నపిల్లలకు పలకా, బలం ఇచ్చి అక్షరాలను గుండ్రంగా రాయించడం నేర్పించడం అవసరం. కొంతమంది పిల్లలు చదివింది చెప్పగలరు కానీ రాయబోయేసరికి అది సరిగా రాయలేరు. కొంతమంది రాయగలరు కానీ చెప్పలేరు. ఇలా రకరకాలుగా వుంటారు. చదువుకునేవారు చదివింది రాయడం తప్పనిసరి. చదువుకునేవారు ఎంత ఎక్కువగా రాస్తే అంత బాగా చదివింది వస్తుంది. పరీక్షల సమయంలో అవి వెంటనే ఈజీగా రాయగలరు. చిన్న వయసునుండి మొదలుకొని పెద్దవారయ్యేవరకు వయసుతో సంబంధం లేకుండా ఏ హోదాలో వున్నవారైనా ఏవో పోటీ పరీక్షలు రాస్తూనే ఉండవచ్చు. అందుకు తోడ్పడేది ఈ రాయడం అనేది. ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా ఒక్కటని కాదు ఎన్నో రంగాలకు మరెన్నింటికో రాయవలసిన అవసరం ఉంటుంది. అందుకని చేతిరాత సరిగా రాని వారు రోజూ కొంచెంసేపు రాస్తూ వుంటే చేతి రాత మెరుగవుతుంది. నేషనల్ చేతివ్రాత డే కూడా జాన్ హాన్కాక్ యొక్క పుట్టినరోజు. చేతిరాత ప్రాముఖ్యత చాలా ఉంది. 
నేషనల్ చేతివ్రాత డే రాయడం ఇన్స్ట్రుమెంట్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (WIMA) వెబ్సైట్ ద్వారా కనుగొన్నారు, ప్రతి సంవత్సరం జనవరి 23 న జరుపుకుంటారు. చాలా మంది ఈ రోజుల్లో ఒక కంప్యూటర్లు వాడటం మరియు టైపింగ్ ద్వారా చేతి రాత రాయకుండా పని చేస్తున్నారు. నేను కూడా ఈ వ్యాసం టైపింగ్ ద్వారానే చేస్తున్నా ) .
చేతిరాత అనేది ఒక కళ. ఎ ఒక్క మనిషి చేతిరాత కాని చేతివ్రాత వేలిముద్రలు కాని ఒకేరకంగా వుండవు. చేతివ్రాత విశ్లేషించు టను గ్రాఫాలజి అంటారు. చేతితో రాయడానికి వివిధ ఫాంట్లు వున్నాయి.మీ లక్ష్యాలను, కలలు, మరియు ఆశలు రాసుకుంటే రోజు చూసుకుని మన లక్ష్యాలు, కలలు, మరియు ఆశలు చేతిరాతద్వారా మరింత వ్యక్తిగత స్వభావం వాటిని సాధించడానికి 33% ఎక్కువగా ప్రేరణగా వుంటుంది అని విశ్లేషకులు చెప్తారు.
 పూర్వ కాలం నుండి చేతిరాతను రాయటానికి అనేకమైన విధానాలు వాడేవారు.  తాటిఆకులమీద  ఘంటం తో రాసేవారు.  నెమలి ఈక ను సిరాలో ముంచి రాసేవారు. అప్పట్లో కాగితం కలం లేక వారు అలా రాసేవారు.  ఇప్పుడు అయితే కాగితములు , పెన్సిల్స్, పెన్స్ చాలా రకాలు వున్నాయి. అవి ఉపయోగించుకొని చేతిరాతను రాయండి.  చేతిరాత దినోత్సవ శుభాకాంక్షలు

బుధవారం, మే 14, 2014

అన్నమయ్య జయంతి

బుధవారం, మే 14, 2014

అప్పని వరప్రసాది అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు . 
గురుదేవ స్తుతి 

శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్య 
పీత్వాపినైవ సుహితా మనుజా భవేయుః 
త్వం వేంకటాచలపతే నివ భక్తి సారం 
శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే 

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 32 వేల సంకీర్తన కుసుమాలతో అర్చన చేసి తన జీవితాన్ని తరింపచేసుకున్న పరమ భక్తాగ్రేశ్వరుడు , తొలితెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళపాక  అన్నమయ్య.   15 వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య తల్లిదండ్రులు శ్రీమతి లక్కమాంబ, శ్రీ నారాయణ సూరి దంపతులు.   తాళ్ళపాక గ్రామం లో అన్నమయ్య వంశీయులు నందవరీక  బ్రాహ్మణ కుటుంబములో క్రీ.శ . 1408 లో వైశాఖమాసం లో, విశాఖ నక్షత్రంలో మంచి గ్రహస్తితిలో జన్మించారు.  
తెలుగులో మనకు తెలిసినంత వరకు మొట్టమొదటి తెలుగుపదాలు అన్నమయ్యవె.   అన్నమయ్య ఆలపించిన తెలుగు పదాలు పండితులకు అటు పామరులకు అందరికి అర్ధమయ్యే విధంగా వుంటుంది.  ఆయన అత్యాధునిక స్వాతంత్ర్యభావాలు కలవాడు . సమాజాని అతిసూక్ష్మద్రుష్టి తో పరిశీలించి జనబాహుళ్యంలో వున్నా జానపదాన్ని గ్రహించాడు.  అన్నమయ్య పదాలు దేనికదే ప్ర్యతేకతను కలిగివుంటాయి. భక్తి , వైరాగ్యాలలోనే కాకుండా నాటి సాంఘీక రాజకీయ,సామాజిక స్థితిగతులకు కూడా అద్దంపట్టయి అనుటలో ఎటువంటి సందేహం లెదు.  అన్నమయ్య  పదాలు తెలుగువారికి తరగని నిధులు.  తెలుగు తనానికి పెట్టనికోటలు.  తెలుగువారి హృదయాలమునకు చెరగని ముద్రలుగా వున్నాయి.  ఆయన పదమే తెలుగుపాటకు జీవం.    అన్నమయ్య అనేక సంకీర్తనలు తో పాటు సంస్కృతములో వేంకటాచల మహాత్మ్యం, సంకీర్తన లక్షణం, తెలుగు ద్విపద రామాయణం, 12 శతకాలు వ్రాసినట్లు తెలుస్తోంది. వెంకటేశ్వర శతకం ప్రసిద్ది పొందినది.  అన్నమయ్య ఇతర రచన లెన్ని చేసినా ఇతర భాషలలో ఎన్ని ప్రభందాలు  రాసినా సుప్రసిద్దముగా నిలిచినవి సంకీర్తనలే.  నిత్యము స్వామిని తన సంకీర్తనలతో ఆరాధింఛి తరించిన అన్నమయ్య క్రీ.శ . 1503 లో ఫాల్గుణ బహుళ  ద్వాదశి దినమున స్వామిలో లీనమైనాడు.  ఈ తిధిని పురస్కరించుకొని తాళపాక వారు 
"దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు
జనకు(డ అన్నమాచార్యు(డ విచ్చేయవే

అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే

వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశు(గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే

సంకీర్తనముతోడ సనకాదులెల్ల(బాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభు(డు నీవు
నంకెల మాయీంటి విందు లారగించవే"
అని ఆరాధించారు.  అన్నమయ్యను అప్పని వరప్రసాదిగా కీర్తించి తరించారు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)