Blogger Widgets

ఆదివారం, సెప్టెంబర్ 13, 2015

Happy Grandparents Day

ఆదివారం, సెప్టెంబర్ 13, 2015

తే.గీ. గ్రేండు పేరెంట్సు డే టుడే. గ్రేట్టు డేట్టు.
గ్రేండు సన్సెండు డాటర్సు గ్రీటు దెమ్ము..
ఎక్సులెంట్దిస్సు సీక్వెన్సు. యెవ్విర్వేరు. 
గ్రేండు పేరెంట్సు విష్షెస్సు గిఫ్టు గాట్టు.

తే.గీ. తల్లిదండ్రుల పూజ్యులౌ తల్లిదండ్రు
లరయ తాత, మామ్మమ్మమ్మ లగుదురిలను.
వారి యొడిలోననాడుచు వారి మనుమ
లును, మనుమరాండ్రు సంతోషమనుభవింత్రు.

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2015

ఓమ్ శ్రీ కృష్ణ శరణం మమః.

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2015

ఈ  భారతావనిలో శ్రీకృష్ణుడు అంటే తెలియని వారుండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడు. శ్రీకృష్ణుని భగవంతుని అవతారంగా, మానవ రూపంలో, జన్మించిన దేవునిగా ఆరాధించామేగాని మానవుడిగా పుట్టిన ఆ దేవదేవుని మానవునిగాక; వారి లీలలను మానవ మనుగడతో సరిపోల్చుకుంటూ అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యంగా తెలుసుకోవాలి. అట్టి "శ్రీకృష్ణావతార జన్మదినం" మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం.  శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు. అంటే! (క్రీస్తు పూర్వం 3228 సం||)
కృష్ణజన్మాష్టమి అనగానే మనకు చిన్ని చిన్ని ముద్దుల మొహము కల నల్ల బాలుడు చేతిలో వెన్న పట్టుకుని వున్న యశోదనందనుడు చిన్ని కృష్ణుడు  గుర్తు వచ్చేస్తాడు.  శ్రీ మహావిష్ణువు మన లోకాన్ని కాపాడటానికి ఎన్నో జన్మలు ఎత్తారు.అందులో  ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడుగా జన్మించారు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని అంటారు .
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు కంసుడు వారిని బంధించిన  చెరసాలలో జన్మించాడు. 
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ జోల పాటలు కీర్తనలు పాడతారు.   వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
  దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రీ కృష్ణుడు జన్మించినాడు.  అప్పుడు శ్రీ మహా విష్ణు ఆవిర్భావంతో భూమాత పులకించింది. ప్రకృతి ఆనందానికి తిరుగులేదు.శ్రీ కృష్ణుని జన్మించిన విషయం ఎవరికీ తెలియకుండా వుంది. వాసుదేవుడు ఆ చిన్ని శ్రీ కృష్ణుని దేవకీ నుండి తీసుకుని యమునా నదిని దాటి మరి యశోదమ్మ దరికి చేరి ఆమె పక్కలో పడుకోబెట్టి.  యశోదకు జన్మించిన మాయను తీసుకుని వెళ్లి పోయాడు.  ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్థమాన మగుచూ తన లీలావినోదాదులచే బాల్యమునుండే, అడుగడుగునా భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట. వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లని కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞాన  జ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ వుంటారు.  
అలాగునే మరోచిన్నారి చేష్టలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూవుంటే, రాళ్లను విసిరిచిల్లు పెట్టేవాడట. అలా ఆకుండ మానవశరీరము అనుకుంటే ఆకుండలోని నీరు 'అహంకారం' ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని అంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.  కానీ ఇక్కడ గోపికలుకు మాయ ఆవహించి వుండటం వాళ్ళ ఆ నల్లవాడు చేసే అల్లరిని తట్టుకోలేక యశోదమ్మకు పిరియాదులు చేస్తున్నారు.  ఆ అల్లరిని వారు ఎంతో ఆనందంగా అనుభవించేవారు.  ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్టశిక్షణ శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్ఞానందకారాన్ని తొలగించుటకు "విశ్వరూపాన్ని" చూపించి గీతను బోధించి, తద్వారా మానవాళికి నామృతాన్ని ప్రసాదించాడు.
శ్రీ కృష్ణుని జననం :
సత్యసంకల్పుడైన పరమాత్మ స్వాయంభువమనువు కోరికెను తీర్చెందుకు, తొలి జన్మ లో పృశ్నిగర్భునిగా, రెండవ జన్మలో అదితి కస్యపులకు వామనునిగా, మూడవజన్మలో దేవకి వసుదేవులకు గొవిందునిగా జన్మించాడు.
తండ్రి వసుదేవుదు జాతకర్మ నిర్వహించలేని నిస్సహాయ స్థిథి లో ఉన్నాడు, స్వామి జననము కారాగౄహములో కాబట్టి !
పాడిరి గంధర్వోత్తము లాడిరి రంభాది కాంతలానందమునన్ గూడిరి సిద్ధులు, భయములు వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్!! అతి ప్రసన్నుడైన వెన్నుని కన్న దేవకి, పున్నమినాడు షోడశ కళాప్రపూర్ణుడైన చంద్రుని కన్న ప్రాగ్దిశవలె చెలువొందినదంటారు పోతన్నగారు. పదహారు కళల పూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినది అర్ధరాత్రి వేళ.


దేవతలకు కూడా దొరకని ఆ పరమ పురుషుడు గోపబాలురతో ఆడి పాడాడు. స్వయంగా అమృతాన్ని పంచిన మోహినీవేషుడు వ్రజవాడలో వెన్న దొంగిలించాడు. ఆకపటనాటక సూత్రధారి రాబోయే యుగాసందికి సంకేతంగా తల్లి చేతి తాళ్ళకు కట్టుబడ్డాడు. ఆ గోవిందుడు గోకులంలోని క్షీరాన్నే కాదు, జలాన్ని కూడా అమృతమయం చెయ్యాలని భావించాడు. అందుకే ప్రతి పసిప్రాణిలోనూ వసివాడని కన్నయ్య పసితనాన్నిభావించగలిగితే అదే జన్మ సాఫల్యం. జీవన మాధుర్యపు ఊటగా మారి ఆ దివ్య నర్తకుని చరణాలమీద అశ్రు అభిషేకం చేయదా!

లోకాలన్నిటినీ కడుపున దాచిన విశ్వంభరుడు గోపాల బాలుడై యశోదానందుల కొడుకైనాడు.

చతుర్భుజాలతో, శంఖు, చక్రాలతో శ్రీవత్సలాంచనాలతో ఉద్భవించిన శ్రీ మహా విష్ణువు దేవకి వసుదేవులకు కన్నులపండుగ చెసాడు . అటువంటి శ్రీ కృష్ణ పరమాత్మ అవతరించిన శ్రావణ బహుళాష్టమి పర్వదినము నేడే. కృష్ణుడు భూమి పై పుట్టింది మొదలు ఎనిమిది సంఖ్యతో ఆయన జీవితం ముడిపడింది. దశవతారాలలో కృష్ణవతారం ఎనిమదవది.  స్వామి జన్మించింది ఎనిమిదవ నెలలోనే...అష్టమి తిధి నాడు. కృష్ణసావర్ణ మన్వంతరం ఎనిమదవిది.

దేవతల విశిష్ట గుణాలను అభివర్ణిస్తు , సహస్రనామస్తోత్రాలను మహర్షులు మానవ జాతికి అందించారు.
అయితే , ఒక్క విష్ణు సహస్రనామం మాత్రం శ్రీ కృష్ణుని ఎదుట ఉంచుకుని చెప్పబడింది.
ఫ్రతి విశేషాణాన్ని స్వామి ఆమోదిస్తునట్లు భావిస్తు, భీష్ముడు సహస్ర నామాలను అభివర్ణించాడు.
ఈ చెప్పిన భీష్మపితామహుడు అష్టమి వసువైన ప్రభాసుడు.
స్వామి మతౄగర్భం నుండి ఎనిమదవ నెలలోనే ఆవిర్భవించాడని, అందుకే ఆయనను పద్మపత్రాలలో ఉంచారని ఒక నమ్మకం ఉంది. వటపత్రశాయి ఈ అవతారములో అంబుజపత్రశాయి అయ్యాడు.
నిర్గుణ పరబ్రహ్మం ధర్మ సమ్రక్షణార్ధం అవతరించిన శుభసమయములోనే యోగమాయ చెల్లెలుగా ఆవిర్భవించింది. అందుకే ఆమె కృష్ణ సహోదరి . అన్న చెల్లెలకి అండగా ఉండాలని ,ఆడబిడ్డకు పుట్టింటి అండ ఎప్పటికి అవసరమే అని , ఈ సత్సంప్రదాయాన్ని మనకి నేర్పినవాడు శ్రీ కృష్ణుడు ! మేనత్త కుంతిని గౌరవించాడు. చెల్లెలు వరుసైన ద్రౌపదిని కాపాడాడు. ఇలాగ ఆయన లోక కల్యాణము కోసము ఎన్నో చేసాడు.
భారతయుద్ధం ప్రారంభములో విజయదాయినీ అయిన దుర్గను ధ్యానించమని కృష్ణుడు అర్జునునితో చెప్తాడు.
చాలామంది ముగ్గులతో కృష్ణ పాదాలను ఇంటి ముందు చిత్రిస్తారు. స్వామికి ఆహ్వానంగా. బాలకృష్ణ రూపంనుండి అన్ని కృష్ణ రూపాలూ ఆరాధనీయాలే. అందుకే 
కన్నయ్యా తవ చరణం మమ శరణం!!
పెను చీకటికి ఆవల ఎకాకృతితో వెలుగు దివ్యజ్యోతి శ్రీ కృష్ణ పరమాత్మ !
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సంప్రదాయం. టీచర్లను గౌరవించడానికి   భారతీయ దేశాల్లో ప్రత్యేకమైన రోజుల్లో గురు పూజోత్సవాలు నిర్వహిస్తారు. గురు దినోత్సవానికి సెలవు ఇవ్వడం కొన్ని దేశాల్లో సంప్రదాయంగా వస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీన మన దేశంలో టీచర్స్ డే నిర్వహించుకుంటున్నాం. అంటే, అది గురు పూజోత్సవం రోజన్న మాట.
శ్రీ రాధా కృష్ణ అసలు పేరు సర్వేపల్లి రాధాకృష్ణ 1888 సెప్టెంబరు 8వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు. ప్రాధమిక విద్యాభాసం తిరుత్తణిలో జరిగినప్పుడు పాఠశాలలో అతని పేరును రాధాకృష్ణకు బదులుగా రాధాకృష్ణన్ గా రాయడం వల్ల అదే పేరును చివరి వరకు ఉంచుకోవటం జరిగింది. చదువుకునేటప్పుడు అతడు తన ఉపాధ్యాయులను ఎంతో గౌరవిస్తూ, టీచర్లను అల్లరి పట్టించే విద్యార్ధులను మందలిస్తూ "మనకు చదువునేర్పి, మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటానికి కృషిచేస్తున్న ఉపాధ్యాయులను వెక్కిరించటం, వారి వెనుక చెడుగా మాట్లాడటం మహపాపం. వారు మనకు దైవం లాంటివారు" అని చేప్పేవారు. 

భారతదేశం యొక్క రెండవ అధ్యక్షుడు, విద్యా తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంపిక చెయ్యబడిన పుట్టినరోజు [5 సెప్టెంబరు 1888], లేదు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సాధారణ గా పాఠశాల నివేదిక అయితే సాధారణ చర్యలు మరియు తరగతులు వేడుక, ధన్యవాదాలు మరియు గుర్తుంచుకోబడతాడు యొక్క చర్యలు స్థానంలో అక్కడ, ఒక "వేడుక" రోజు భావిస్తారు. ఈ రోజున కొన్ని పాఠశాలలు వద్ద, బోధన యొక్క బాధ్యత వారి ఉపాధ్యాయుల ప్రశంసలు చూపించడానికి సీనియర్ విద్యార్థులు అప్ తీసుకోవాలి.

"మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.
ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది". అని అనేవారు సర్వేపల్లి.
ఉత్తమ ఉపాధ్యాయుడిగా, మానవతావాదిగా, విద్యావేత్తగా, దేశాధ్యక్షుడిగా అందరి హృదయాల్లోనూ పదిలమైన స్థానం సంపాదించుకున్న రాధాకృష్ణన్ కు భారత ప్రభుత్వం "భారతరత్న" బిరుదునిచ్చి, ఆ బిరుదు విలువను పెంచింది. శ్రీ రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్ 17న తన 87వ యేటన స్వర్గస్థుడయ్యాడు.
సర్వేపల్లి రాధా కృష్ణుని పుట్టిన రోజున మనం గురుపుజోత్సవం జరుపుకుంటున్నాము. ఆ రోజు స్కూల్ లో మన టీచర్స్ మేము మాకు నచ్చిన టీచర్ లా తయారు అయ్యి ఒక గంట మేము టీచర్ లా  పాటాలు చెప్తాము. తరువాత మా టీచర్స్ కు పువ్వులు ఇచ్చి సత్కరించి వారినుండి wishes తీసుకుంటాము. మీము మా  school లో teachers day బాగాజరుపుకుంటున్నాము. 

శనివారం, ఆగస్టు 29, 2015

రాఖి విశేషం

శనివారం, ఆగస్టు 29, 2015

భారతీయ సంప్రదాయములో రాఖి పౌర్ణమి విశిష్టమైన స్థానం కలిగివుంది.  ఈ పండుగను రక్షాబంధనం (రాఖీ) పండుగ గానూ, జంద్యాల పూర్ణిమ, వైఖానస మహర్షి జయంతి గాను, హయగ్రీవ జయంతి గాను , వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటుంటారు. 
మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం.
'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః, 
తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'
దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది.  బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి.  చరిత్రలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్‌ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్‌ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని అంటారు.  శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది దీనినే జంద్యాల పౌర్ణమి గా అంటారు.శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. మరి 
 బ్లాగ్ మిత్రులుకు రక్షాబంధన శుభాకాంక్షలు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)