నిన్నటి దినమున రెండవ గోపికను లేపుటకు. తెల్లవారింది అనిచేప్పుటకు. వారు భరద్వాజ పక్షులు ఎలా మాటాడుకుంతున్నాయో గోపికలు పెరుగు చిలుకుతున్నపుడు వచ్చు నగలసవ్వడి, పెరుగు సవ్వడి రకరకాలుగా తెల్లవారుటకు గుర్తులు చెప్పి ఆమెను పిచ్చిదానిగాను, నాయకురాలుగాను, తెజస్సుకలదానివి అని పిలచి నిద్రమేల్కొల్పారు. మరి ఈ రోజు మూడవ గోపికను నిడురలేపుచున్నారు మరి ఆమెను ఎలా లేపుచున్నారు అంటే. క్రింది పాసురములో చూద్దాం.
పాశురం :
కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము: తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది. తెల్లవారినది మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించుచున్నవి. మనతోటి పిల్లలు వ్రతస్తలమునకు వెళ్ళుటకు కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు. అట్లు వెళ్ళుచున్నవారిని నిలిపివేసి మేము నిమ్ము పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి యున్నాము. కుతూహముగల ఓ లలనా ! లేచి రమ్ము. శ్రీ కృష్ణుని దివ్యమంగళ "పర" అను సాధనము గ్రహించి కేశియను రాక్షసుని చీల్చి సంహరించినట్టియు మల్లుర ప్రాణములను కొల్లకోట్టినట్టియు దేవతలందరకు ఆ దేవుడైన వానిని సమీపించి సేవించినట్లు అయితే అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావలెననుకొనుచుండగా మీరే వచ్చితిరే అని మానను పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచి రమ్ము అని తోటి కన్యను మేల్కొల్పుతున్నారు.
విశేషార్దము:
కీళ్ వానమ్ వెళ్లెన్ఱు:
ఇంతకు ముందే తెల్లవారుటకు గుర్తుగా కొన్ని శబ్దములు చెప్పారు కదా. ఆ శబ్దములు అర్ధరాత్రి సమయమునైనా రావచ్చునని కావునా తూర్పు దిక్కున తెల్లవారుచున్నది అది చూడమని ఇందు చెప్పుచున్నారు. లోపలనున్న స్త్రీ అంతలో ఇలా అంది మీలో ఏ ఒక్కరి ముఖము భగవద్ అనుగ్రహం వల్ల కాంతివంతమగుచున్నది. వారు తూర్పు వైపు న వుండుట వల్ల తెల్లవారినది అనుకుంటున్నారు మీరు.
ఎరుమై శిఱు వీడు మేయ్ వాన్ పరందనకాణ్:
గేదెలు చిన్న బీడు మేయుటకు పోవుచున్నవి. తెల్లవారు జాముననే రాత్రి మంచుపడిన పచ్చికను మేయుటకు గేదెలను బీడులోకి వదులుతారు. మరలా తోలుకు వచ్చి పాలు పితికి తరువాత పగలంతా మేయుటకు అడవిలోకి తోలుచుందురు. అది తెల్లవారుటకు గుర్తుగా చెప్పుచున్నారు. రాత్రియే కృష్ణ సమాగమమును పొందగల్గెడి వారు కనుక తెల్లవారినచో ఇక కృష్ణుడు కనబడడని బెంగతో మేల్కొని నీవు రావలదా? అలా ఎందుకు పడుకుంటివేలా అని అడుగుచున్నారు? ఆమె లోపలనుండి అవి గేదెలుకావు మీ ముఖ కాంతి వల్ల చుట్టూ నల్లగా విరిసిన చీకట్లు గుంపు మీకు అలా తోచుచున్నట్లుఉంది. అని ఉరకుండెను.
మిక్కుళ్ళ పిళ్ళైగళుం పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్
కాత్తు ఉన్నైక్కూవువాన్ వందు నిన్ఱోం:
మిగిలిన పిల్లలును అదే పోవుటగా పోవుచున్నారు. వారిని వెళ్లకుండ ఆపి నిన్ను పిలుచుటకై వచ్చి నిలిచితిమి.
మేమేగాడు, ఊరిలోని పడతులందరును పెద్దసమూహముగా పోవుచున్నారు. ఆపోవుట కృష్ణపరమాత్మను చేరుటకే. అయినను తర్వాత చేరుదుమో చేరామో అన్న విచారము లేక వానికోరకు ఈ దారిని పడుచుటయే పరమానందముగా నడచుచున్నారు.
మావాయ్ పిళందానై:
గుర్రపు నోటిని చీల్చినావాడు . అసురావేశము కల్గిన గుర్రమును రెండు దవడలు పట్టి చీల్చి తనను మనలను కాపాడినవాడు. ఆ కేశి అను రాక్షసుడు శ్రీ కృష్ణుని చంపచూసాడు. కృష్ణుడు అన్నవాడు లేకపోతె మనము కూడాలేము. శ్రీ కృష్ణుడు తనను కాపాడుకోటమే కాక మనలను కూడా కాపాడారు. ఇక్కడ కేళి అనునది అహంకారము గా దానిని నశింపచేయువాడు. మనలను అహంకారం నుండి కాపాడువాడు.
మల్లరై మాట్టియ:
మల్లురను చంపినవాడు. ఆ మల్లురను చంపుట మధురాపుర స్త్రీల మనస్సులను ఆకర్షించుతకే. ఆ మల్లురే కామ క్రోదాలు. అవి పరమాత్మతో మనము చేరకుండా అడ్డగించును. వీనిని కృష్ణపరమాత్మను చంపుటకై కంసుడు ప్రయోగించాడు. దానిని మట్టి పెట్టినాడు. కామక్రోధములు మొదలుగు వాటిని జయించినాడు. కానీ ఆత్మకు అమ్తుకోనిన ఆవిద్య తొలగదు. అందుచే కీర్తించి పరమపురుషార్ధమును పొందుదాము. అతనిని శంకించకు.
దేవాది దేవనై:
బ్రహ్మరుద్రెంద్రాది దేవతలకు కారణమైన దేవుడు. శ్రీ కృష్ణుడే సర్వభుతములకు కారకుడు, ప్రళయ హేతువు అని చెప్పుచున్నారు. అతడే ఉపాస్యుడు, పురుషార్ధప్రదుడు, లేచి కీర్తించి పురుషా పొందుదము. అబలలను చూచునా అన్న ఆలోచన నీకు అవసరంలేదు.
శేన్రూ నాం శేవిత్తాల్ ఆవా ఎన్ఱారాయుందరుళ్ :
చేరి మనము సేవించినచో అయ్యో! అయ్యో అని భాదపడి మనలను పరామర్శించి కృపచేయును. పరమాత్మను మనము పొందుట మనకొరకుకాదు. అతని కొరకే! అతని వస్తువులమైన మనం అతని కొరకే. కానీ మనము చైతన్యము కలవారమగుటచే, అతను విలక్షణమైన గుణపరిపూర్తి కలవాడు అగుటచే వీడివుండలేకపోతున్నాం కదా. అలాంటిది అతను వచ్చేవరకు వుండలేకపొతే అతడెంత భాధపడునో కదా. అందుకే మనము పాడి పురుషార్ధం పోమ్దేదము. పోయి అతనికి ప్రియమైన కైంకర్యము చేద్దాం. లెమ్ము ముందు నడువు అని ఆ గోపికను నిడురలేపినారు.