Blogger Widgets

సోమవారం, సెప్టెంబర్ 16, 2024

కష్టాలు తొలగించే అనంత పద్మనాభస్వామి వ్రతం అమ్మమ్మ చెప్పిన కధ పూజ విధి An...

సోమవారం, సెప్టెంబర్ 16, 2024

బుధవారం, ఆగస్టు 21, 2024

అమ్మమ్మతో నేను

బుధవారం, ఆగస్టు 21, 2024

 అమ్మమ్మతో నా అనుభవాలు చాలా ప్రత్యేకమైనవి. నేను అమ్మమ్మతో గడిపిన సమయం చాలా అద్భుతం గా వుందెది. నాకు అమ్మమ్మతో  గడిపిన చిన్ననాటి  ప్రత్యేకమైన మధుర జ్ఞాపకాలు చాలా వున్నాయి.  😊 నా అనుభవాలు మీతో పంచుకుంటాను. 

అమ్మమ్మతో నేను



అమ్మమ్మతో గడిపిన సమయం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రతి వేసవి సెలవుల్లో, నేను అమ్మమ్మ తో చలా సమయం గడిపేదానిని. ఆమె వంటలు చాలా రుచిగా ఉండేవి. నన్ను పక్కన కుర్చోపెట్టుకొని వంటలు చేసేది. అప్పుడు కధలు చేప్పేది. టేబెల్స్ అదే ఎక్కాలు చదివించేది, అలా ప్రథీరొజు చేసేది.  ప్రతి ఉదయం, ఆమె నన్ను పక్కన కూర్చోబెట్టి, పాత కథలు చెప్పేది.

రోజూ అమ్మమ్మ నన్ను ఇంట్లో మొక్కలుదగ్గరకు  తీసుకెళ్ళింది. అక్కడ పూల మొక్కలు, మరియు కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఆమె నాకు ప్రతి మొక్క గురించి వివరంగా చెప్పింది. ఒక రోజు నేను ఒక చిన్న మొక్కను నాటాను. అది పెరిగి పెద్ద చెట్టుగా మారింది. కాయలు కాసింది. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. 

అమ్మమ్మతో గడిపిన ఆ రోజులు నాకు ఎప్పటికీ మరిచిపోలేనివి. ఆమె ప్రేమ, జ్ఞానం, మరియు సహనం నాకు ఎప్పటికీ స్ఫూర్తిగా ఉంటాయి.

మీకు అమ్మమ్మతో నేను నచ్చిందా? మీకు ఇంకా జ్ఞాపకాలు పంచుకోవాలనుకుంటే, దయచేసి చెప్పండి! 😊 


గురువారం, జులై 25, 2024

శుక్రవారపు మహాలక్ష్మి ముఖమును ఇంట్లోనే కొబ్బరికాయతో ఎలాగో అమ్మమ్మ జ్ఞాప...

గురువారం, జులై 25, 2024

బుధవారం, జులై 17, 2024

తొలి ఏకాదశి

బుధవారం, జులై 17, 2024

 





ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం అందరికీ అలవాటు కదండి . మొత్తం సంవత్సరం పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశిని  తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.

పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యముడి కోర. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ గా జరుపుకున్నేవారు.  ఆనాడు  ఉపవాస  తొలి ఏకాదశి దీక్ష చేస్తారు.
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు.  విష్ణువు పాలకడలి పై శేష తల్పమున పవళిస్తాడు.  అదే రోజును తొలి ఏకాదశి గా భావిస్తారు.

సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు.  ఇంత ప్రాముఖ్యము కల శయన ఏకాదశి రోజు విష్ణు సహస్రము పారాయణ చేసెదరు. 
అందరికీ ఈ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)