Blogger Widgets

శుక్రవారం, జనవరి 09, 2009

తిరుప్పావై ౨౬ వ పాశురం

శుక్రవారం, జనవరి 09, 2009

ఆండాళ్ తిరువడి గలే శరణం :
శ్రీ
కృష్ణ పరమాత్మ గోపికల మాటలకు పరమానందము తో వారిని చుచుతూ ఉండిపోయాడు. వారి ముఖ మండలమును, నేత్ర ములను , వక్షస్థలమును , నడుమును చూచుచు ఇతర స్పృహ లేనంతగా వ్యామోహముతో పరవశమై ఉన్నాడు .
వారి మాటలు విని మరి కొన్ని వినాలన్న కోరికతో ఒక ప్రశ్న అడిగెను " గోపికలారా ! నన్నే కోరి వచ్చాము అని చెప్పారు . మరలా నీకిష్టమైనచో పర అను వాద్యమును ఇమ్మని అంటున్నారు. నన్నే కలియవలేనని కోరిక ఉన్నవారు వేరోకదానిని కాంక్షించారు కదా?
మీరు పర అడుగుటలో ఉద్దేశ్యము మి? మీ కోరిక విషయములో నాకు సందేహముకలుగుతున్నది. అని శ్రీ కృష్ణుడు వారిని ప్రశ్నించెను.
వారు దానికి భగవద్ ప్రీతి కొరకు మా పెద్దలు ధనుర్మాస వ్రతము చెయ్యమన్నారు. మేము పెద్దల యెడ ఉపకారబుద్ధితో వ్రతము ఆచరించ బూనినాము. అని గోపికలు చెప్పారు.
అంత శ్రీ కృష్ణ పరమాత్మ సరే కానిండు. అయితే ఆవ్రతము ఏమి ? దానికి ప్రమాణము ఏమి ? దానికి కావలిసిన పదార్ధాలు ఏమి ? అవి ఎన్ని కావాలి? వివరాలు తెలపండి. అని అడిగెను. అంత గోపికలు వ్రతమునకు కావలసినపరికరములు అర్ధించుచున్నారు. పాశురములో
పాశురము:

మాలే మణివణ్ణా మార్-గరి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము:

ఆశ్రిత వ్యామోహముకలవాడా! ఇంద్ర నీలము అను మణిని పోలిన కాంతియు, స్వభావమును కలవాడా! ఘటిత ఘటనా సామర్ధ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరాలు అర్ధించి నీ వద్దకు వచ్చితిమి . స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలు విన్నవించేదము.

భూమండలమంతను వణుకుచున్నట్లు బ్ధము చేయు , పాలవలె తెల్లనైన , నీ పాంచజన్యమనబడే శంఖమును పోలి శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద "పర " అను వాద్యము కావాలి మంగళ గానము చేయు భాగవతులు కావాలి. మంగళ దీపములు కావాలి. ధ్వజములు కావాలి. మేలుకట్లు కావాలి. పై పరికరములు ను క్రుపచేయుము అని గోపికలు శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి.

సర్వ క్తిమంతుడవై మాకోరకు శ్రీ కృష్ణుడు వై సులభుడవైన నీవు మాపై దయ చూపి మా వ్రతమునకు కావలసిన పరికరములు నోసగుమని గోపికలు పాశురములోప్రార్ధించినారు.

తిరుప్పావై 26 వ పాశురము - విన్నపాలు వినవలె

ఆండాళ్ తిరువడి గలే శరణం :
శ్రీ
కృష్ణ పరమాత్మ గోపికల మాటలకు పరమానందము తో వారిని చుచుతూ ఉండిపోయాడు. వారి పాసురము పాసురము మండలమును, నేత్ర ములను , వక్షస్థలమును , నడుమును చూచుచు ఇతర స్పృహ లేనంతగా వ్యామోహముతో పరవశమై ఉన్నాడు .
వారి మాటలు విని మరి కొన్ని వినాలన్న కోరికతో ఒక ప్రశ్న అడిగెను " గోపికలారా ! నన్నే కోరి వచ్చాము అని చెప్పారు . మరలా నీకిష్టమైనచో పర అను వాద్యమును ఇమ్మని అంటున్నారు. నన్నే కలియవలేనని కోరిక ఉన్నవారు వేరోకదానిని కాంక్షించారు కదా?
మీరు పర అడుగుటలో ఉద్దేశ్యము మి? మీ కోరిక విషయములో నాకు సందేహముకలుగుతున్నది. అని శ్రీ కృష్ణుడు వారిని ప్రశ్నించెను.
వారు దానికి భగవద్ ప్రీతి కొరకు మా పెద్దలు ధనుర్మాస వ్రతము చెయ్యమన్నారు. మేము పెద్దల యెడ ఉపకారబుద్ధితో వ్రతము ఆచరించ బూనినాము. అని గోపికలు చెప్పారు.
అంత శ్రీ కృష్ణ పరమాత్మ సరే కానిండు. అయితే ఆవ్రతము ఏమి ? దానికి ప్రమాణము ఏమి ? దానికి కావలిసిన పదార్ధాలు ఏమి ? అవి ఎన్ని కావాలి? వివరాలు తెలపండి. అని అడిగెను. అంత గోపికలు వ్రతమునకు కావలసినపరికరములు అర్ధించుచున్నారు. పాశురములో
పాశురము:

మాలే మణివణ్ణా మార్-గరి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము:

ఆశ్రిత వ్యామోహముకలవాడా! ఇంద్ర నీలము అను మణిని పోలిన కాంతియు, స్వభావమును కలవాడా! ఘటిత ఘటనా సామర్ధ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరాలు అర్ధించి నీ వద్దకు వచ్చితిమి . స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలు విన్నవించేదము.

భూమండలమంతను వణుకుచున్నట్లు బ్ధము చేయు , పాలవలె తెల్లనైన , నీ పాంచజన్యమనబడే శంఖమును పోలి శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద "పర " అను వాద్యము కావాలి మంగళ గానము చేయు భాగవతులు కావాలి. మంగళ దీపములు కావాలి. ధ్వజములు కావాలి. మేలుకట్లు కావాలి. పై పరికరములు ను క్రుపచేయుము అని గోపికలు శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి.

సర్వ క్తిమంతుడవై మాకోరకు శ్రీ కృష్ణుడు వై సులభుడవైన నీవు మాపై దయ చూపి మా వ్రతమునకు కావలసిన పరికరములు నోసగుమని గోపికలు ప్రాసురమున ప్రార్ధించినారు.

గురువారం, జనవరి 08, 2009

తిరుప్పావై 25 వ పాశురము -శ్రీకృష్ణ జన్మ రహస్యము

గురువారం, జనవరి 08, 2009

ఆండాళ్ తిరువడి గలే శరణం :
గోపికలు ఈ విధముగా మంగళము పాడుతుఉంటే శ్రీ కృష్ణ పరమాత్మ వారి ప్రేమకు , వాగ్వైభవనమునకు చాలా సంతోష్మ్చి " ఓ గోపికలారా! మీకు జన్మసిద్దాముగా మా యందుగల ప్రీతిచే మంగళము నాకాక్షించుచున్నారు . చాలా సంతోషమే , కానీ ఈ రాత్రివేళ మంచులో నడచి శ్రమ పడి వచ్చారు . చాలా శ్రమ అయ్యింది. కేవలము మంగళ శాసనము కాంక్షతోనే యున్నట్లు చెప్పుతున్నారు . కానీ దానికంటే వేరొక ప్రయోజనము లేదా? ఉన్నచో చెప్పండి. తప్పక నేరవేర్చుతాను. అనెను . నీగుణ కీర్తనము చేయుచూ వచ్చుటచే మంచు , రాత్రి , మొదలగున్నవి మాకు ఇబ్బందిని కలిగించవు. మాకు ప్రధాన ప్రయోజనము నీకు మంగళము పాడుతయే. లోకులకై వ్రతమోనర్చుటకు పర నొసంగిన ఒసగుము. మేము మీ స్వరూపమును మా స్వరూపమును తెలిసిన వారమే. కావునా మంగళా శాసనమే ప్రధాన ప్రయోజనము అని తెలియచేయుచు శ్రీ కృష్ణ అవతార రహస్యమును తామెరుగుదుము అని దానిని ఈ పాశురములో వివరించినా మన గోపికలు.
గోపికలు ఈ పాశురములో శ్రీ కృష్ణుని జన్మ రహస్యమును కీర్తించుచు దానివలన శ్రమ తీరి ఆనందించుచున్నారు. అని చెప్పుచున్నారు.

పాశురము:
ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్
ఒరుత్తి
మగనాయ్ యొళిత్తు వళర
తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద

కరుత్తై పిరపిత్తు కంజన్ వైత్తిల్
నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై
అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి

వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:

భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి , శంఖచక్రగధాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవి కుమారుడవై జన్మించి , శ్రీ కృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించి, కట్టను కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభావముగల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్ట భావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యతముచేసి వానికడుపులో చ్చిచ్చువై నిన్ను చంపవలెనని తలచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా! నిన్నే కోరి వచ్చినాము . పర అను వాద్యము నిచ్చిన ఇమ్ము . సాక్షాత్తు లక్ష్మీ దేవే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును , నీ వీర చరిత్రమును , కీర్తించి శ్రమను విడిచి పెట్టి సంతోషించు.

భగవానుని పాడుటకు సాధనానుస్టానము చేయుచున్నప్పుడు చాలా శ్రమలు కలుగును. ఆ శ్రమలు శ్రమగా కాక ఆనందముగా ఉండాలి. దానికి నామసంకీర్తనమే సాధనము అని గోపికలు ఇందులో వివరించారు.



బుధవారం, జనవరి 07, 2009

తిరుప్పావై 24 వ పాశురము - మంగళ హారతి

బుధవారం, జనవరి 07, 2009

ఆండాళ్ తిరువడి గలే శరణం:
ప్రస్తుతము గోపికలు మంచి దశకు చేరి ప్రేమదసలోనున్న వారగుటచే తమకు కలిగిన అమంగళ ములను అతనిని దర్శించి పోగొట్టుకోవాలని , తమకు లేని మంగళములను సంపాదించుట మాని ప్రేమైక హృదయులై శ్రీ కృష్ణునకు మంగళము పాడుచున్నారు.
ఇట్లే గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వలన తమ కార్యము నెరవేరునని , తమ ప్రభువు నడచి వచ్చి ఆసనము పై కుర్చొనగానే ఆ పాదాలు ఎర్రదనము చూచి తామూ చేసిన యపచారమునకు భాధ పడి మంగళము పాడిరి.

పాశురము:

అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోత్తి

కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోత్తి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోత్తి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి

ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము :
ఆనాడు బలి చక్రవర్తి తనదికాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడించగా ఈ లోకమునంతను వానివద్దనుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదములకు మంగళము .

రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావనుడుండు లంకకే వెళ్లి సుందరమగు భవనములు కోటయుగల దక్షినదిసనున్న లంకలో ఉన్నా రాక్షసులను చెండాడిన మీ భాహు పరాక్రమములకు మంగళము .

శ్రీ కృష్ణునకు రక్షణకై యుంచిన బండిపై ఆవేసించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము .

వత్సము పై ఆవేసించిన అసురునితో వెలగ చుట్టుపై నాఎసించిన యసురుని చంపుటకై ఓడిసేలరాయి విసరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసరనపుడు ముందువేనుకకు పాదములుంచి నిలచిన మీ దివ్య పాదములకు మంగళము.

ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినని కోపముతో రాళ్ళ వాన కురియగా గోపాలురకు గోవులకు భాధ కలుగకుండా గోవర్ధన పర్వతమును గోడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము.

శ త్రువులను సములముగా పెకలిచి విజయము నార్జించి ఇచ్చేది మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము.

ఈ విధముగా నీ వీర చరత్రములనే కీర్తించి పర అనే సాధనము నందగ మేమీనాడు వచ్చాము అనుగ్రహించుము.
అని ఈ పాశురములో మంగళము పాడుతూ భగవానుని అనుగ్రహించమని కోరుచున్నారు.

మంగళవారం, జనవరి 06, 2009

తిరుప్పావై 23 వ పాశురము- సింహములా ..............

మంగళవారం, జనవరి 06, 2009

ఆండాళ్ తిరువడి గలే శరణం :
అననన్య గతికలమై వచ్చి నన్నాస్రయించినారము , కటాక్షిం చుము అని గోపికలు ప్రార్ధించగా శ్రీ కృష్ణునకు మనస్సులో చాలా భాద కలగినది. నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్నాశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్లి సాయపడి రక్షించవలసి ఉండగా వేరొక గతిలేని వారమైనాము అని దైన్యముగా పల్కు నట్లు ప్రేరేపించితినే ! ఎంత తప్పు చేసితిని అని శ్రీ కృష్ణుడు చాలా నోచ్చుకోనేను.
ఇలా పడుకున్న శ్రీ కృష్ణుని లేచి నడచి వచ్చి ఆ స్థానమున సింహాసనమున వేంచేసి తమ కోరి విని క్రుపచేయవలేనని గోపికలు ప్రార్ధించుచున్నారు.
పాశురము:
మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం

శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు
వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి

మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు
పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా ఉన్
కోయిల్ నిన్ఱు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ
శీరియ శింగాశనత్తిరుందు యాం వంద
కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:
పర్వత గుహలో వర్షాకాలములో కదలక మెదలక పడుకున్న సౌర్యముగల సింహము మేలుకొని , తీక్ష్ణమగు చూపులు నిటునటు చూచి , ఒకవిధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడు నట్లు చేసి, , అన్ని వైపులా దొర్లి , దులుపుకొని , వెనుకకు ముందుకు శరీరమును చాపి , గర్జించి , గుహనుండి వేల్వడునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ !
నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేయి రమణీయ సన్నీవేశము గల లోక్కోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుగ ప్రార్ధించుచున్నాము.
అలా కోరటంతో శ్రీ కృష్ణ పరమాత్మ తన శయనాగారమును వీడి నడచి వచ్చి సింహాసనము నధిరోహించి గోపికలను యుక్తరీతిని పలుకరించవచ్చునని అనుకోవచ్చును.

సోమవారం, జనవరి 05, 2009

తిరుప్పావై 22 వ పాశురము - శ్రీ కృష్ణ దృష్టి కోసం

సోమవారం, జనవరి 05, 2009

ఆండాళ్ తిరువడి గలే శరణం :
గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుకటి పాశురములో ప్రార్ధించారు. వేరొక గతిలేక నీకే చెందినవారమని చెప్పారు. ఈ పాశురములో తమ ను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసిందిగా అర్ధించుచున్నారు .

పాశురము :

అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే

శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్

ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు , మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విదియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.
సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షిమ్చితివా! మేము అనుభావిమ్చియే తీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును.

ఆదివారం, జనవరి 04, 2009

తిరుప్పావై 21 వ పాసురము-శ్రీ కృష్ణునికి నివేదన

ఆదివారం, జనవరి 04, 2009

ఆండాళ్ తిరువడి గలే శరణం :

గోపికలు పురుష అహంకార భుతురాలగు నీలాదేవిని మేలుకోలిపిరి. ఆమె మేలుకొని "నేను మీలో ఒక్కదానినికదా! నన్ను ఆశ్రయించిన మీకేనాడు లోపముండదు. రండి!
మనమందరమూ కలసి శ్రీ కృష్ణుని మేల్కొల్పి అర్దింతము . " అని తానూ వచ్చి గోపికలతో శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి మేలుకొలుపు జొచ్చెను.
ఈ విధముగా శ్రీ కృష్ణుని మేలుకోల్పుతున్నారు.

పాశురము :
ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్

ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిర్ఱ శుడరే! తుయిల్ ఎరాయ్

మాత్త్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్కణ్
ఆత్తాదు వందు ఉన్-అడిపణియుమా పోలే
పోత్తియాం వందోం పుగరందు-ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము:
పొదుగు క్రిందనుండి కడవలు చరాచర నిండి, పొంగిపొరలి నట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యకములగు, ఉదారములగు, బలసిన ఆవులుగల నందగోపుని కుమారుడా! మేల్కొనుము. ప్రమాణదార్ఢ్యముగల పరబ్రహ్మస్వరూపా ! ఆశ్రితరక్షణ పృతిజ్ఞాధార్ఢ్యముగల మహామహిమ సంపన్నా! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్స్వరూపా ! నిద్ర నుండి లెమ్ము. శత్రువులు నీపరాక్రమమునకు లోకి నీవాకిటికి వచ్చి నీ దాసులై నీపాదారవిందముల నాశ్రయించినట్లు మేముకూడా నిన్ను వీడి యుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి.
గోపికలు వారి స్ఠితిని శ్రీ క్రిష్ణునికి నివేధించినారు.

శనివారం, జనవరి 03, 2009

తిరుప్పావై 20 వ పాశురం - కృష్ణుని తో స్నానము

శనివారం, జనవరి 03, 2009

ఆండాళ్ తిరువడి గలే శరణం :

శ్రీదేవి తో కలసి ఉన్న యన్న నారాయుణుఢే పరతత్వము. శ్రీ మాన్నారాయునుడే ఉపేయము . అనగా మోక్ష ఛాయా గలవారి చే పొంద బడువాడు. శ్రీ దేవి అంసే నీలాదేవి . ఈ పాసురమునను గూడా శ్రీ , శ్రీయః పతుల యతారమగు నీలాదేవి శ్రీ క్రిష్ణులను మేలుకోల్పుతున్నారు .
పాశురము
:
ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
కప్పం తవిర్క్కుం కలియే! తుయిల్ ఏరాయ్

శెప్పం ఉడైయాయ్! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు
వెప్పం కొడుక్కుం విమలా! తుయిల్ ఎరాయ్
శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్

నప్పినై నంగాయ్! తిరువే! తుయిలెరాయ్

ఉక్కముం తట్టొళియుం తందు ఉన్-మణాళనై

ఇప్పోదే ఎమ్మై నీరాట్టు-ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము:
ముప్పది మూడుకోట్ల అమరులకు వారికింకను ఆపద రాక ముందే పోయి , యుద్ధ భూమిలో వారికి ముందు నిలిచి , వారికి శత్రువుల వలన భయమును తొలగించే బలసాలీ ! మేల్కొనుము అర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము గలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శ త్రువులుగా భావించి వారికి భయ జ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకో !
బంగారు కలశములను పోలిన స్థానములను, దొండ పండువలె ఎర్రని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవి! పరిపుర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేలుకొనుము. వీచుటకు ఆలవట్టమును (hand fan) కంచుతద్దమును మా కోసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానము చేయునట్లు చేయుము.

తిరుప్పావై 19 వ పాశురం - నీలాదేవిని అర్ధించుట

ఆండాళ్ తిరువడిగళే శరణం :
నిన్నటి పాశురములో నీలాదేవిని మేలుకొలిపి ఈ పాశురములో శ్రీ కృష్ణుని,నీలాదేవిని కూడా మేలుకోల్పవలసినది గా అర్ధించుచున్నారు.
పాశురము:
కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము: ఒక గుత్తి దీపములు చుట్టును వేలుగుచుండగా , ఏనుగు దంతము లతో చేయబడిన కోళ్ళు గల మంచముపై నున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము,ఎత్తు , వెడల్పు కలిగిన పాన్పులపై ఎక్కి , గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకోనిన కేశ పాశము గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండి విశాలమైన వక్షస్థలము గల శ్రీ కృష్ణా నోరు తెరచి మాట్లాడు . కాటుక పెట్టికోనిన విశాలమైన కన్నులు కల ఓ నీలాదేవి ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీవు?ఇంత మాత్రపు ఎడబాటుకుడా ఓర్వ లేకుండుట నీ స్వరుపమునకు, నీ స్వభావమునకు తగదు.

శుక్రవారం, జనవరి 02, 2009

తిరుప్పావై 18 వ పాసురము -నీలాదేవిని మేల్కొల్పుట

శుక్రవారం, జనవరి 02, 2009

ఆండాళ్ తిరువడి గలే శరణం :
గోపికలు కృష్ణుని పొంది యనుభవించాలని ఆవేసముచే కృష్ణపరమాత్మ కనిపించగానే తామూ అనుభవించ వచ్చునని తొందరగా మేలుకొన్నారు. కాని శ్రీ కృష్ణుడు మేలుకోలేదు. తరువాత బలరాముని మేలుకోల్పారు . అప్పుడు కుడా కృష్ణుడు మేలుకోలేదు . తెలివి తెచ్చుకొని నీలాదేవి ద్వారా మేలుకోల్పవచ్చని ఆమెని మేలుకోల్పుతున్నారు ఈ పాశురములో .

పాశురం:

ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము :
ఏనుగులతో పోరాడగలిగినవాడును, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలముకలవాడును, మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును, యుద్దములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లు కేశ పాశము గల ఓ నీలాదేవి ! తలుపు గడియ తెరువుము . కోళ్ళు అంతటా చేరి అరుస్తున్నాయి . మదవీలతప్రాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చొని కోకిలలు కూస్తున్నాయి. కావున తెల్లవారినది , చూడు. బంతిని చేతిలో పట్టుకోన్నదానా! మీ బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి . నీవు సంతోషముతో లేచి నడచి వచ్చి. ఎర్ర తామర పూలు ను పోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము.

అని నీలాదేవిని కీర్తిస్తున్నారు . ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు.

గురువారం, జనవరి 01, 2009

తిరుప్పావై 17 వ పాశురం - నంద కుటుంబం ను లేపుట

గురువారం, జనవరి 01, 2009

ఆండాళ్ తిరువడిగలే శరణం :
గోపికలు , పదిమంది గోపికలను మేల్కొలిపికొని నందగోపభావనమును చేరినారు. భావనపాలకుని ద్వారపాలకుని. ప్రార్ధించి వారి యనుమతిని పొందినారు. ద్వారపాలకుడు తలుపు తెరచి వాడలేను. గోపికలందరూ ను నందగోపభావనములోకి ప్రవేశించినారు.నందగోపుడు , యశోద, శ్రీ కృష్ణుడు, బలరాముడు వరసగా మంచాలపై సయనించినారు. వారిని ఈ రోజు మేలుకోల్పుతున్నారు. రాక్షసులు వచ్చి కృష్ణునికి ఏమి కీడు చెయునో అని ! లేక గోపికలు ఎత్తుకుపొతారెమో ! అని భయముతో జాగరుడై ముందు మంచము మీద నందుడు శయనించియుండెను. లేక లేక లభించిన కృష్ణుని వీడ లేక ఒక ప్రక్క కృష్ణుని మరో పక్క బలరాముని మద్యలొ యశొద శయనించి యుండెను. వారిని ఒక్కొక్కరిని ఇందులొ మెలుకొల్పుతున్నారు.

పాశురం :
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్

శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్



తాత్పర్యము:
వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచి నీరు , అన్నము కావసినవారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మ బుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము , ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా! మా వంశమునకు మంగలదీపము వంటిదానా! మా స్వామినీ ! యశోదా! మేలుకొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చు కొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారుముతో చేయబడిన కడియము కాలిని దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను.
అని గోపికలు ప్రార్ధించిరి.

బుధవారం, డిసెంబర్ 31, 2008

2009 నూతన సంవత్సర శుభాకాంక్షలు

బుధవారం, డిసెంబర్ 31, 2008



నా తరపున మా అమ్మమ్మ తరపున బ్లాగుల లోకానికి మా అభిమాన మా ప్రియ బంధు వర్గంనకు , మా స్నేహితులకు హృదయ పూర్వక నూతనసంవత్సర శుభాకాంక్షలు .

నూతన సంవత్స్తర శుభాకాంక్షలు- నవ్వులు నవ్వులు

ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
Many Smiles








I'm sending these smiles to you,
to help you fight the blues.



Why spend a minute being sad...



when a smile will give you
the best day you've ever had?



There's only one way to
start the day right,
and make each hour bright.



And that's to look for the good
in everyone and every place
with a king size smile on your face.



So go ahead and smile.
It's not so hard to do.



Let the happiness and
sunshine shine through.



I hope you're smiling now!




My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)