Blogger Widgets

ఆదివారం, జులై 28, 2013

తల్లిదండ్రుల పూజోత్సవ శుభాకాంక్షలు

ఆదివారం, జులై 28, 2013

కుటుంబం అంటే సమాజంలోని ప్రాథమిక ప్రమాణం మరియు తల్లిదండ్రులు, పిల్లలు దానికి మూలస్తంభాలుగా వుంటారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శముగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలను గొప్పవారిగా మరియు బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుటకు మరియు  పిల్లల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారు వారి పిల్లలు సౌకర్యవంతమైన జీవితం గడుపుటకు ఎన్నో త్యాగాలు చెయ్యటానికి కూడా వెనుకాడరు.

తల్లిదండ్రులు ఒక గురువుగా, శ్రేయోభిలాషిగా, గురువుగా, అనేక పాత్ర నమూనాలుగా మరియు వారి పిల్లలకు సంరక్షకులుగా ఉంటారు. వారి ప్రేమకు మనము ఏమి చేసినా ఋణం తీర్చుకోలేము.  వారి ప్రేమకు షరతులు ఏమి వుండవు.  వారి పిల్లలు పెరిగి గొప్పవారు అయ్యి మరియు వారు ఎటువంటి కష్టాన్ని అయినా సులువుగా ఎదుర్కొనే సామర్థ్యం కలవారిలా తయారుచేస్తారు.
Parents' Day
వారి రుణం తిరిగి చెల్లించబడుట అనేది సాధ్యం కాదు. ఇంకా పిల్లలు వారి తల్లిదండ్రుల సంరక్షణ కోసం వారి తల్లి-తండ్రి గౌరవించటానికి ప్రతి సంవత్సరం "Parents Day" గా జరుపుకుంటారు. "Parents Day" ప్రతి దేశంలో ఒకే రోజు జరు   పుకొనబడుతుంది,  ప్రపంచంలోని చాలా దేశాలు ఈ  వేడుకను  జూలై నాల్గవ ఆదివారం జరుపుకుంటున్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు మంచి బహుమతులను ఇచ్చి , శుభాకాంక్షలు తెలపాలి. 
తల్లిదండ్రుల పూజోత్సవ  శుభాకాంక్షలు.  

గురువారం, జులై 25, 2013

శ్రీవాణి వీణాపాణీ

గురువారం, జులై 25, 2013


శ్రీవాణి వీణాపాణీ
జయగీర్వాణి శ్రీకల్యాణి

శ్రీవాణి వీణాపాణీ
జయసంగీత సాహిత్యవాణీ
శ్రీవాణి వీణాపాణీ
శ్రీవాణి వీణాపాణీ

రసరమ్య సరచరులోనా
నిను అభిషేకించెద తల్లీ
నీచరణాల పూజింతునమ్మా 
అమ్మ శ్రీవాణి వీణాపాణీ

సాహిత్య శాస్త్రాలలోనా 
వ్యాకరణ సుత్రాలలోనా 
నీతేజంబు కొలువాయనమ్మా 
అమ్మ శ్రీవాణి వీణాపాణీ

శ్రీవాణి వీణాపాణీ
జయసంగీత సాహిత్యవాణీ
శ్రీవాణి వీణాపాణీ
శ్రీవాణి వీణాపాణీ

సోమవారం, జులై 22, 2013

గురుపౌర్ణమి /వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు.

సోమవారం, జులై 22, 2013


ఓం గురుబ్రహ్మ గురుర్విఘ్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవేనమః||

తాత్పర్యము: గురువు బ్రహ్మ, విష్ణు, శివ లక్షణములు కలవాడు. అట్టి సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవులకు నమస్కరిస్తున్నాను.

ఈరోజు గురుపూర్ణిమ.   వ్యాసుని పుట్టిన దినమును మనము గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము.  ఈరోజు  గురువులను (Teachers) , పెద్దవారిని పూజించేరోజు.  గురుపూర్ణిమను వ్యాసుని పుట్టిన దినము రోజు జరుపుకుంటున్నాముకావున దీనిని వ్యాస పూర్ణమ అని కూడా అంటారు.  హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు.  శ్రీ మహావిష్ణువుని అవతారంగా వ్యసుని గురించి చెప్తారు.  ఈయన పేరు  కృష్ణద్వైపాయనుడు 

శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌపునః పునః 

వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి.అంతే కాదు,విష్ణావతారంగా భావించే వ్యాసుడ్ని పూజించి విష్ణుపురాణం దాన మివ్వడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి. సోమకాసురుడు వేదాలను ఎత్తుకెళ్ళి సముద్రంలో దాచేసాడుట.అప్పుడు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారం లో ఆ వేదాలను తిసుకు వచ్చాడు.అలా వచ్చిన వేదాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి పోయి గజిబిజి గా ఉన్నాయట.అప్పుడు వ్యాస మహర్షి వాటిని విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. వ్యాస పూర్ణిమ నాడు వ్యాసభగవానుడిని, గురు పరంపరనూ పూజించాలి.వేదాలను  నాలుగు బాగాలుగా చేసాడుకావునా ఈయనికి వేదవ్యాసుడని పేరు వచ్చింది.

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వై బ్రహ్మనిధ్యే వాసిష్ఠాయ నమోనమ:||

వ్యాస మహర్షి జన్మ తిధి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమ ను గురు పూర్ణిమగా జరుపుకుంటాం.లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిధిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. భారత భాగవతాలు,అష్టాదశ పురాణాలు,ఉప పురాణాలు అందించిన మహానుభావులు వ్యాస భగవానుడు.

నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే
పుల్లార విన్దాయత పత్రనేత్ర|
యేన త్వయా భారత తైలపూర్ణ:
ప్రజ్వాలిలో జ్ఞానమయ: ప్రదీప:||

విశాల బుద్ధిగల వ్యాస మహర్షీ! వికసించిన పద్మ దళముల వంటి నేత్రములుగల వాడా! మహాభారతమనే తైలముచే నింపబడిన జ్ఞానదీపము నీచే వెలిగించబడింది. అట్టి నీకు నా నమస్కారములు.
మనకు  మంచి చెప్పే ప్రతీవారు గురువులే.  ఈరోజు పెద్దవారి ఆశిర్వాధములు మనము తీసుకోవాలి.   ఈరోజు షిరిడి సాయిబాబాగారికి, దత్త్తాత్రయుని వారికి ప్రత్యేక దినముగా పూజిస్తారు.

పూర్వము నారదుడు వైశంపాయనుడికి "ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ "స్వధర్మసింధూ" అనే గ్రంధములోను వివంగా చెప్పబడి యున్నది. దీనిని బట్టి వ్యాసులవారి యొక్క జన్మ ఆషాఢ శుద్ధపాడ్యమి అని విదితమవుచున్నది.

ఇంకా గురువు తత్వాన్ని  దత్త్తాత్రయులవారు మనకు చాలా విషయాలలో చెప్తారు.  అందులో నాకు అర్ధం అయినవి మీకు చెప్తాను.  దత్త్తాత్రయులు వారు అన్నారు మనకు 24 మంది గురువులువున్నారు అని చెప్పారు.  మనకు వరసగా తన గురువులు గురించి చెప్పారు.   
మొదటి గురువు:  భూమి.  
రెండవ గురువు:  వాయువు
మూడవ గురువు: ఆకాశము 
నాల్గవ గురువు: అగ్ని 
ఐదవ గురువు:  సూర్యుడు 
ఆరవ గురువు:  పావురము
ఏడవ గురువు: కొండచిలువ 
ఎనిమిదవ గురువు: సముద్రము 
తొమ్మిదవ గురువు : మిడత 
పదవ గురువు: ఏనుగు 
పదకొండవ గురువు: చీమ 
పన్నెండవ గురువు: చేప 
పదమూదవ గురువు: పింగళ  అనే వెశ్య
పదునాల్గవ గురువు: శరకారుడు 
పదిహేనవ గురువు:  ఒక బాలుడు  
పదహారవ గురువు: చంద్రుడు 
పదహేడవ గురువు: తేనెటీగ 
పద్దెనిమిదవ గురువు: లేడి 
పంతొమ్మిదవ గురువు: గ్రద్ద 
ఇరవైవ గురువు: కన్య 
ఇరవైవోకటివ గురువు: సర్పము 
ఇరవై రెండవ గురువు: సాలెపురుగు 
ఇరవై మూడవ గురువు: భ్రమరకీటకము 
ఇరవై నాల్గవ గురువు: జలము 


ఇలా తనగురువులు గురుంచి చెప్పారు.  మనకు  ప్రతీజీవి ఒక గురవే అని చెప్పారు దత్తాత్రయులవారు.  వీటినుండి ఏమి నేర్చుకోవాలో తరువాత తెలుసుకుందాం.

ఈనాటి గురుపూర్ణిమ / వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు.

ఆదివారం, జులై 21, 2013

నాతో మాట్లాడాలి అంటే

ఆదివారం, జులై 21, 2013

ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో  , సరదా సరదా మాటలతో ,  కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో ,  మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా,  రోజు అంతా సంతోషంగా వుంచటానికి  మీ ముందుకు వచ్చేస్తున్నాను 
మీ చిన్ని  RJ Sree Vaishnavi ని .  ఎలా అంటే ప్రతీ ఆదివారము    05:00 pm to 06:00 pm వరకు  
మీ అభిమాన ఆన్లైన్ రేడియో RadioJosh  Masth Maza Masth Music :)  లో  నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా!   మరి నాతో మాట్లాడాలి అంటే   ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడే యండి .  
INDIA= +91 04042410008
USA = +19142147574
Skype Me™!
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com
Thank u very much.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)