Blogger Widgets

సోమవారం, డిసెంబర్ 23, 2013

తూమణి మాడత్తు

సోమవారం, డిసెంబర్ 23, 2013

ఇంతవరకు ముగ్గురు గోపికలను లేపినారు . ముదడవ గోపికను లేపుచున్నప్పుడు గేదెలు మొదలగున్నవి ఆహారము సంపాదించుటకు వెళ్తున్నాయని .అంటే తెల్లవారుటకు గుర్తుగా వారు గేదేలగురుంచి చెప్పారు. మిగిలిన పిల్లలు కుడా
అదేపోవటం అయితే వారి ని ఆపి నిన్ను పిలుచుటకు వచ్చాము.గుర్రపు నోటిని చీల్చిన వాడు ,మల్లురను చంపినవాడు అయిన పరమాత్మ మనలను చేరి మనము సేవించినచో అయ్యో, అయ్యో,అని భాదపడి మనలను పరామర్శించి కృపచేయును.
అటువంటి ప్రేమ మనకు కావాలికదా, అవి పరతంత్రాలు కదా. మనకి ప్రియమైన వానికి సేవలు చేయటమే కదా మన స్వరుఉపము. లెమ్ము ముందుగా లెమ్ము అని మూడవ గోపికను మేల్కొల్పినారు.
ఇంతవరకు ముగ్గురును లేపారు ఇప్పుడు నాల్గో గోపికను లేపుచున్నారు .ఈమె పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పరినిస్తితురాలు. భాగావంతునికంటే వేరేఉపాయము లేదని . నమ్మినది . అలాంటి ఆమె నిద్రను చూచి గోదా మిగిలిన గోపికలు మొదటి రెండు పాశురాలు విన్నావు కదా ! మరి విని కుడా పరుంటివా ? లెమ్ము అని మెలొల్పుతున్నరు . మొదటి నాలుగు పాశురాలలొ నిద్ర నుండి మేల్కొల్పు తొ ఉన్న పాశురాలే. నిద్ర గురించి భగవద్గీత లో నాలుగు అవస్తలు గురించి నాలుగు శ్లొకాలలొ వివరించారు. నాలుగు అవస్తలు 1 యతమానవస్థ 2. వ్యతిరేకావస్థ, 3. ఏకేంద్ర్దియావస్థ, 4. వశీకారావస్థ. వీటిగురించి గీతలొ బాగా వివరించారు.
మొదటి రెండు పాశురాలలో శ్రవణము చెప్పబదింధి. తరువాత పాశురములో మననము నిరూపించబదినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించబడినధి. అట్టి ధ్యానములో పరకాస్టనందియున్న గోపిక ఈనాడు మేల్కొల్పబదుచున్నధి.
పాశురము : 
తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:
పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మించబదిన మేడలో సుఖ శయ్యపై చుట్టును దీపములు వెల్గుచుండగా అగరు ధూపము గుమగుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతురా ! మణికవాటపుగడియ తీయుము. ఓయత్తా! నీవైనను ఆమెను లేపుము- నీకుమార్తెమూగదా? లేక చెవిటిదా ? లేక జాడ్యముకలదా? లేక ఎవరైన కదలిన ఒప్పమని కావలియున్నారా? లేక గాఢ నిద్రపట్టునట్లు మంత్రించినారా?
"మహామాయావీ ! మాధవా! వైకుంఠవాసా!" అని అనేక నామము లను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము.
ఈ సందర్బములో గోదాదేవి భగవంతునికీ భక్తునికి మధ్యా సంబంధమును వివరించినారు.
1. మనందరిని తండ్రి ఆయనే 2. మనందరిని రక్షించేవాడు ఆయనే 3. మనందరిని నావాల్లు అని కల్గిన వాడు ఆయనే- శేశి అంటార 4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు 5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే-జ్ఞేయము అంటారు 6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే 7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు 8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు 9. భోక్తా ఆయనే.
లోకంలో మనం ఎదో ఒక సంభందం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంభందం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంభందాలు కల్గి, శాశ్వతంగా వీడని సంభందం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! కుడా అదే ప్రేమ కల్గి వుంటుంది. ఈ విదముగా భగవద్ సంబందమును వివరించారు మన గోదామాత.

ఆదివారం, డిసెంబర్ 22, 2013

కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై

ఆదివారం, డిసెంబర్ 22, 2013

ఈ ధనుర్మాస వ్రతము చాలా విలక్షణమైన వ్రతము . ఈ వ్రతము వల్ల మన శరీరము మంచి అలవాట్లు నేర్చుకొనుటకు బాగా దోహదపడుతుందని అర్దమవుతుంది.
గోపికను లేపుటకు కీచు కీచు మని పక్షుల అరుపులు వినలేదా ? రేపల్లె గోపికలు తరచూ పెరుగు తరచుట నిత్యకృత్యములు . వారు పున్యస్త్రీలే . వారు
 తెల్లవారుజామున లేచి తలడువ్వుకొని పూలు ముడుచు కొని శ్రీ కృష్ణుని పాటలు పాడుతూ పెరుగు చిలుకుతారు. అప్పుడు పెరుగు చిలుకుతున్నప్పుడు వచ్చే శబ్దము ఆకాశానికి వ్యాపించే టంత ఎక్కువ వస్తుంది. అయితే వారు చిలుకుతున్నప్పుడు వారి మెడలో వున్న నగలు శబ్దములు కూడా వస్తున్నాయి కదా అవి నీకు వినబదటం లేదా ఓనాయకురాలా నీవు మిక్కిలి తెజస్సు కలదానివి . నీ తెజస్సు మాకు కనబడుతున్నది,తలుపు తెరువు నీ తెజస్సు చుచి మేము అనందించునట్లు చెయి. అని లేపారు.
ఇంతవరకు మేల్కొలినన పిల్లలిద్దరును తమతో చేర్చుకొని వారు ముందు నడచుచుండగా నిద్రపోతున్న మరో గోపికను లేపుటకు బయలుదేరారు.
ఆండాళ్ తల్లి మనిషి లక్ష్యం ఏమిటి ? వాటిని చేరుటకు ఏమిచేయ్యలని వారికి వేదాలలోని సారాన్ని తిరుప్పావై రూపములో వివరించింది. ఆ వివరణలోమైత్రేయి సహిత కాత్యాయిని యాజ్నవల్క్య మహర్షి గురించి
 వివరించింది. ఆమె మెట్ట వేదాంతమ్ వివరించలేదు. ఆమె మార్గమద్యలో ఏదిమమ్చిదొ ఏది చెడ్డదో అనుభవద్యులయిన పెద్ద వాళ్ల సలహాతీసుకొని ముందుకు సాగాలని వారికి ఏ ఋషి గురించి చెప్పింది. శ్రీ కృష్ణుని పొందుటకు తొందరగా లేచిరమ్మని మరో గోపికను లేపుతున్నారు.
పాశురం :
కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము: తూర్పు తెల్లవారుతున్నది . చిన్న బీడులోనికి మేయుతకు విదువబడిన గేదెలు విచ్చలచీడిగా పోవుచున్నవి. మిగిన్లిన పిల్లందరును గుడా వ్రతస్తలమునకు పోవుటకు బయలుదేరి, అట్లు పోటమే తమకు ప్రయోజన మనునట్లు పోవుచున్నారు. ఆ పోయేవారిని మేము ఆపి మేము నిన్ను పిలుచుటకు నీవాకిట వచ్చి నిలచినాము . కుతూహలము కలదానా!.ఓ పడతీ! లేచి రా! కృష్ణుని గుణములు కీర్థించి వ్రతమున కుపకృమించి ప్రతసాధనమగు పరను పొంది, కేసి యను రాక్షసుని చీల్చి చంపినవానిని , మల్లురను మట్టుపట్టిన వానిని, దేవతలకు ఆది దేవుడైన వానిని మనము పోయి సేవించినచో అయ్యో ! అయ్యో! మీరే వచ్చితిరే.! అని భాదపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును.
అందుకే మన ఆండాళ్ ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి, భగవంతుని అనుగ్రహం మనపై పడేట్టు చేస్తుంది.

సంఖ్యా మాంత్రికుడి జయంతి

ఈ రోజు మన భారతదేశం గర్వించదగ్గ సంఖ్యా మాంత్రికుడు,  శ్రీనివాస్ రామానుజన్ జన్మదినం.  ఈ సందర్బముగా మనం ఆయనని గుర్తుచేసుకుందాం. రామానుజన్ శుద్ధ గణితం లోను నెంబర్ థీరి ముఖ్యమైన పరిశోదనలు  శ్రీనివాస రామానుజన్ 22/12/1887 లో శ్రీనివాస అయ్యంగార్, కోమలత్తమ్మాళ్ పుణ్యదంపతులకు తమిళనాడులోని ' ఈ రోడ్ ' లో జన్మించెను. తన తండ్రి ఓ బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. అతని తండ్రి సంపాదించే జీతంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. రామానుజన్ చిన్నతనం నుండే విశిష్ట లక్షణాలు కలిగి వుండేవాడు. పెద్ద పెద్ద లెక్కలని కూడా కాగితం, పెన్సిలు వాడకుండా మనసులోనే చెయ్యగల అసామాన్య నైపుణ్యం కలిగివున్నాడు.  అతను చిన్నవయసులోనే ప్రముఖమైన  ఆయిలర్ సూత్రాన్ని (exp(ix) = cos(x) + i sin(x) ) రామానుజన్ కనుక్కున్నాడు.  చిన్నతనమునుమ్డే అద్భుత ప్రతిభను ప్రదర్శించేవారు రామానుజన్.  జార్జ్ కార్ అనే వ్యక్తి రాసిన ఓ అవిశేషమైన గణిత పుస్తకం రామానుజన్ కి ఆధునిక గణితానికి మొట్టమొదటి పరిచయ గ్రంథం అయ్యింది. అంత వరకు బడి చదువుల్లో తిప్పలు పడుతూ, కాలేజిలో చేరడానికి ప్రవేశ పరీక్షల్లో డింకీలు కొట్టిన రామానుజన్, ఈ పుస్తకాన్ని సునాయాసంగా అవపోసన పట్టాడు. అక్కడితో ఆగక పుస్తకంలో లేని కొత్త సుత్రాలని కనిపెట్టసాగాడు. తన అసమాన ప్రతిభాపాటవాలు రామానుజన్ కి హై స్కూలు స్థాయిలో ప్రత్యేక పారితోషకాన్ని తెచ్చిపెట్టాయి. 
రామానుజన్ మద్రాసులోని పోర్ట్ ట్రస్ట్ లో ఓ చిన్నగుమాస్తా ఉద్యోగం సంపాదించాడు. జీతం కూడా బాగా తక్కువ. జీతం తక్కువైనా ఈ ఉద్యోగం వల్ల తనకి అత్యంత ప్రియమైన గణితంలో మునిగిపోవడానికి బోలెడంత తీరిక దొరికేది. తనకు దొరికిన తీరిక సమయంను పూర్తిగా సంఖ్యా మేజిక్ చేయటానికి ఉపయోగించుకున్నారు.  నిరంతరం సంఖ్యా ప్రయోగములు చేసేవారు. ఈ దశలోనే రామానుజన్ తను కొత్తగా కనుక్కొన్న కొన్ని గణిత ఫలితాలని ముగ్గురు ప్రఖ్యాత బ్రిటిష్ గణితవేత్తలకి పంపాడు. పెద్దగా చదువుకోని ఎవరో అనామక భారతీయ గుమాస్తా రాసిన ఆ ఉత్తరాన్ని, వారిలో ఇద్దరు గణితవేత్తలు చూసీచూడకుండానే చెత్త బుట్టలో పారేశారు. మూడవ గణితవేత్త మాత్రం ఆ పొరబాటు చెయ్యలేదు.    ఫిబ్రవరి 28, 1918లో రామానుజన్ ని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీగా ఎన్నుకున్నారు. ఇదే సంవత్సరం అక్టోబర్ లో ఈయనకు ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గా ఎన్నుకున్నారు. ఇది చాలా అరుదైన విషయం. ఈయన బీజ గణితంలో సాధించిన సమీకరణాల వల్ల యూలర్, జాకోబి వంటి గొప్ప శాస్త్రజ్ఞుల కోవలోకి చేరాడని కేంబ్రిడ్జిలో ఎంతో మంది చెప్పుకునేవారు. క్షయ సోకడంతో రామానుజన్ ఇంగ్లాండు నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఏప్రిల్ 26, 1920న చనిపోయేనాటి వరకు గణితంలో నిత్యం చిత్రవిచిత్రమైన అంశాలను ఆవిష్కరిస్తూ వుండేవాడు. ఈయనకు ఎనలేని దైవచింతన వుండేది. దైవం, శూన్యం, అనంతం ఇలాంటి అంశాల మీద ఉపన్యాసాలు కూడా ఇచ్చేవాడు. శ్రీనివాస రామానుజన్‌ అనగానే గుర్తుకొచ్చేది 32 ఏళ్లలోనే పేదరికాన్ని, ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు గడించిన ఓ 'సహజ గణితశాస్త్ర మేధావి'. ఈయన జీవితచరిత్ర యువ మేధావులకు ఎంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఈ స్ఫూర్తి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిలో విజయాల్ని సాధించాలనే పట్టుదలను పెంచుతుంది. 
 శ్రీనివాస రామానుజన్ జన్మదినము సందర్భముగా ఈరోజును జాతీయ గణితదినోత్సవముగా జరుపుకుంటున్నాము.  ఈ సందర్భముగా అందరికి జాతీయ గణితదినోత్సవ శుభాకాంక్షలు.

కీశు కీశెన్ఱెంగుం


భగవద్విషయము విలక్షనమైనది . దానిని క్రొత్తగా అనుభవించువారును , చాలా కాలముగా అనుభవించినవారును . కుడా తన్మయులయి ఉందురు. భగవదనుభవము నిత్య నూతనముగా మోహపరచును మరియు అదే మొదటి అనుభావమువలె ఉండును. నిన్న మేల్కొల్పిన గోపికకు భగవదనుభవము క్రొత్త. మరి ఈ రోజు మేల్కొల్పుతున్న గోపిక భగవదనుభవము పరిచితమే . అయినా ఈ గోపిక మత్తెక్కి లేవక పురున్నది. ఈ ఏడో రోజున ఈమెని లేపుతున్నారు . బయట వున్నా శబ్దములు ను నిన్న ఉత్తిష్ఠ వినలేదు .
ఈ నాటి గోపిక విన్నది అయినాను ఈ గొపిక పరున్నది. " నిన్న మనము ఉత్తిష్టను లేపాము కదా ఇంక మనము కృషుని పాటలు పాడుకొంటు వెల్దాము లే అని లేపుతున్నరు. ఈ గోపికలు అందరు కలసి ఈ వ్రతము చేద్దమను కున్నరు అందులొ ఎవ్వరు లేకపొయినా వారి కి మంచిగా అనిపించధు కావునా వారు లేపుతున్నారు .నిన్న లేపామనుటకు గుర్తుగా వారు మూడు శబ్దాలు చెప్పారు. ఈ రోజు కూడా ఆ విదమైన శబ్దాలే వినిపిస్తున్నయని చెప్పుతున్నరు. ఈ పరున్న గోపికకు. ఏమి వినుట లేదా. ఏమి ఈ వెళ ఇంకాపడుకున్నావేమీ. అని అడిగిరి.
దీనిచె ప్రదానముగా మొదట చెయవలసినది శ్రవణము . ఇది శ్రవణాభక్థి కలవారు నిన్నా ఈ రోజు ఆశ్రయించుచున్నారు. అని మనకు తెలుస్తున్నది. మొదటిది అవ్యక్తమగు పక్షి శబ్దము ,రెండవధి నాదప్రదానమఘు శంఖము శబ్దము, మూడవది హరి -హరి - హరి అన్న శబ్దమూ మనము విన్నాము కదా. ఈ రోజు కూడా అల్లానె వుంధి లే మనము వ్రతము చెసుకొడానికి వెల్దామని లెపుచున్నరు . గోపికలతో కూడిన మన ఆండాళ్ తల్లి.
వేద పఠనం ప్రారంభించునపుడు ముందుగా " శ్రీ గుభ్యోనమః , హరి ఓం " అని అంటారు. నిన్నను మన గోపికను మేల్కొల్పుటతో మన వ్రతము ప్రారంభము అయినధి . అందుచే పక్షులు శబ్దములు, శంఖనాధము , హరి హరి అన్న శబ్దము వినబడుటలెదా అని అనుచున్నారు. పక్షులు శ్రీ గురు మూర్తులు , అందుచే శ్రీ గురుభ్యొనమః అనినట్లు భావించుచున్నరు. శంఖము హరి శబ్దము - హరి ఓం అనునట్లు భావించాలి.
ఈ విధముగా వ్రతారంబము చెసి ఈనాడు ఆ శ్రావణంలోని వైవిధ్యము ను వేరొక గోపికను లేపుచున్నారు.

పాశురము : 
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము:
భరద్వాజపక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారు జామున కలసికొని అన్ని వైపులా ఏ వేవొ మాటలు మాటలాడుకొనుచున్నాయి ఆ మాటాలలో ధ్వనిని నీవు వినలేదా?.
ఓ పిచ్చిదానా ! కుసుమాలకృతములగు కేశబంధము లు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులూగల గోపికలు, కవ్వముతో పెరుగు చిలుకుతున్నప్పుడు, వారి చేతుల కంకణ ద్వనులు, మెడ లోని ఆభరణధ్వనులతోకలసి , విజౄభించి, ఆకాశమునంటుచున్నవి. ఆ ద్వనులు లినలేదా. ఓ నాయకురాలా! సర్వ పదార్ధములలో వాత్సలముతో వ్యాపించియుండి , మనకు కనపడాలని శ్రీ కృష్ణుడు గా అవతరించి , విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుండగా వినుటలేదా, లేక వినీ పరుండియుంటివా? నీ తేజస్సు మాకు కనపడుచున్నధి . దానిని ఆపకుండా మేము దర్శించి అనుభవించునట్లు తలుపు తెరువవా.?
అని పలువిదాలుగా ఈ గోపికను నిద్ర లేపుచున్నారు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)