Blogger Widgets

బుధవారం, ఏప్రిల్ 29, 2015

అంతర్జాతీయ నృత్య దినోత్సవం

బుధవారం, ఏప్రిల్ 29, 2015

dance
అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982 లో యునెస్కో సంస్థ అయిన ఎన్.జి.ఓ యొక్క ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ చే ప్రారంభించబడినది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న జరుపుకుంటారు. ఈ రోజున జరుపుకొనాలనే సూచనను ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యిచ్చినది. 1760 లో ప్రచుచింబడిన ప్రముఖ రచన lettres sur la danse యొక్క రచయిత మరియు ఆధునిక ప్రెంచ్ నృత్యనాటికల సృష్టి కర్త అయిన  Jean Georges Noverre (1727-1810) యొక్క జన్మ దినాన్ని పురస్కరించుకొని ఆదినాన్ని అంతర్జాతీయ నృత్య దినంగా ప్రకటించారు.
ప్రతి సంవత్సరం, ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు లేదా నర్తకుడు ప్రపంచవ్యాప్తంగా చెలామణి అయ్యేవారు ఒక సందేశాన్ని అందించటానికి ఆహ్వానించబడతారు. ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యొక్క ప్రవేశ పత్రం ఆధారంగా ఈ ప్రసిద్ధ నృత్యదర్శకుడు లేదా నర్తకుని ఎంపిక చేయడం జరుతుంది.
UNESCO నిర్వహించిన అంతర్జాతీయ నృత్య దినోత్సవం లో యిప్పటివరకు పాల్గొన్న మరియు సందేశాన్ని అందించిన ప్రముఖులలో మెర్సీ కన్నింగ్‌హం, మారిస్ బెజర్త్ , అక్రం ఖాన్ మరియు అన్నె తెరెసా దె కీర్ స్మేకర్ లు.
ఈ దినం యొక్క లక్ష్యం నృత్య కళారూపం యొక్క ప్రపంచీకరణను చేధించడానికి,అన్ని రాజకీయ, సాంస్కృతిక మరియు జాతి అడ్డంకులు అధిగమించడానికి మరియు సాధారణ భాషలో గల నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికి కృషి చేయుట ప్రపంచ నృత్య కూటమి, మరియు దాని నృత్య కమిటీ ఈ దినాన్ని పారిస్ లోని UNESCO లోనూ మరియు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.
అసలు నృత్యం అన్నది సంగీతానికి అనుగుణంగా శరీరం కదలికలు మీద ఆదారపడి వుంటుంది. మానసిక ఉల్లాసానికి చాలా ఉపకరిస్తుంది.  ఇది సరే ప్రపంచ ప్రసిద్దమైన నృత్యాలు కొన్ని వున్నాయి.  వాటిలో
Hip-hop Dance
Tap Dance
Yangko Dance
Belly Dance
Kathak

Gangnam Style
Break Dance or B-boying
Ballet Dancers
Ballet
Line Dance
Salsa Dance

శుక్రవారం, ఏప్రిల్ 24, 2015

షోడసకళానిధికి షోడశోపచారములు

శుక్రవారం, ఏప్రిల్ 24, 2015


షోడసకళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి

అలరు విశ్వాత్మకున కావాహన మిదె సర్వ
నిలయున కాసనము నెమ్మి నిదే
అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే

వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె
సరి శ్రీమంతునకు భూషణము లివే
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు
తిర మిదె కోటిసూర్యతేజునకు దీపము

అమృతమథనునకు నదివో నైవేద్యము
గమి(రవి)జంద్రునేత్రునకు కప్పురవిడెము
అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి
తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో

మంగళవారం, ఏప్రిల్ 21, 2015

అదే అక్షయ తృతీయ

మంగళవారం, ఏప్రిల్ 21, 2015

ఈ రోజు హిందువులకు మరియు జైనులకు ప్రత్యకమైన రోజు,  అదే అక్షయ తృతీయ .  వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ గా పిలుస్తారు. సంస్కృతం లో ' అక్షయ ' అనగా క్షయం కానిది , తరిగి పోనిది అని అర్థం. హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభ కరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే సంపద అక్షయమవుతుందని భారతీయుల నమ్మకము.  ఈ రోజు నాడే రైతులు విత్తనాలుకు పూజ చేసి నాటుతారు.  ఎందుకంటే విత్తులు మంచిగా వ్యవసాయం వృద్ది చెందుతుంది.  ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు. భగీరధుడు తపస్సు ఫలితంగా గంగానది భూమి తరలి వచ్చిన రోజు. యజ్ఞ యాగాదులు చేయటానికి మంచి కాలం. శ్రీ కృష్ణులవారి బాల్య స్నేహితుడు కటిక దరిద్రుడైన సుదాముడు కృష్ణుని దగ్గరకు వెళ్లి అటుకులు సమర్పించి అత్యంత దనవంతుడైనాడు. ధర్మరాజు సూర్యనారాయణ మూర్తి నుండి అక్షయ పాత్రను పొందినాడు. వ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు విఘ్ననాయకుడు అయిన గణపతి భారతాన్ని రాయటం మొదలు పెట్టినరోజు.  శంకరాచార్యులు వారు కనకదరా స్తోత్రాన్ని పాడితే కనకం వర్షంలాగ పడిన రోజు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది కి వస్త్రాపహరణ చేసి అవమానించదలిచారు , అప్పుడు  ఆమెకి శ్రీ కృష్ణులు వస్త్రాలు ఇచ్చి ద్రౌపదిని కాపాడిన రోజు.  అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి.  కుబేరుడు, దేవతల కోశాధికారి, ధనానికి దేవత అనీ. లక్ష్మీ దేవి మరియు కుబేరుడు అక్షయ్ తృతీయ నాడు పూజిస్తే, సంపద కలగ చేస్తుంది.  అంతే కాదు ఈరోజు నాడే  అన్నపూర్ణాదేవి జన్మించినది.  ఈరోజు కి ఇన్ని విశేషాలు వున్నాయి కాబట్టే అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.   ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు. 

శనివారం, ఏప్రిల్ 18, 2015

వటపత్ర శాయి కధ

శనివారం, ఏప్రిల్ 18, 2015

కరార విందేన పదార విందం
ముఖార విందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటే శయంతం
బాలం ముకుందం మనసా స్మరామి

పద్మం వంటి తన పదాన్ని,పద్మంవంటి చేతితో, పద్మంవంటి నోటిలో చోప్పిస్తూ మర్రి ఆకుదొన్నెలో శయనించియున్న బాలముకుందునికి మనసా నమస్కరిస్తున్నాను.   
మర్రి ఆకు మీద శయినించిన  భగవానుడు శ్రీ కృష్ణులు.   పద్మము వంటి పదాన్ని పద్మం వంటి చేతితో నోటిలో పెట్టుకొని మధువును చప్పరిస్తూ కనిపిస్తారు.  ఈ వృత్తాంతం మనకు మార్కండేయ మహర్షి చరిత్ర లో కనిపిస్తుంది.  మార్కండేయుడు 6 మన్వంతరములు మహా విష్ణువుకోరకు ఘోరమైన తపస్సు చేస్తాడు.  మార్కండేయుని తపస్సు తన ఉనికికే సమస్యగా మారుతుందనుకొని మహేంద్రుడు అప్సరసలును  పంపి తపస్సు భగ్నం చెయ్యటానికి ప్రయత్నించాడు.  కానీ ప్రయత్నాలన్నీ వృదాయ్యాయి.  మార్కండేయుడు ఈ మాత్రం చలించకుండా తపస్సు చేస్తూనే వున్నాడు.  మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యి మార్కండేయ నీ తపస్సుకు కారణం ఏమిటి. నీకు ఏమి వరం కావాలి అని ప్రశ్నించాడు మహా విష్ణువు.  అప్పుడు మార్కండేయుడు దేవా నీ మాయని చూడాలని వుంది అన్నాడు.  కొన్నాళ్ళకు మహా ప్రళయం వచ్చింది.  ప్రచండమైన గాలి, వర్షం.  నదులు, సముద్రాలు పొంగి పొర్లుతున్నాయి.  భూమితో పాటు సమస్తం నీటిలో మునిగిపోయాయి.  మార్కండేయుడు విష్ణుమాయవల్ల నీటిలో తేలియాడుతూ తిరుగుతుండగా ఒకప్రదేశంలో మర్రి ఆకుమీద శయనించి వున్న చిన్న శిశువు  నోటిలో కాలివేలు పెట్టుకొని చీకుతూ  కనిపించాడు.  అతనే వటపత్ర శాయి. 
మహా విష్ణువు ఆదేశంతో మర్రి ఆకు పై వున్నా  వటపత్ర శాయి కడుపులోకి వెళ్లి చూస్తాడు.  నీట మునిగిన సమస్త భూమి, ప్రాణి కోటి కానిపిస్తుంది.  మహావిష్ణువు మరలా ఇంకొకచోట సమస్త ప్రాణులను సృస్తిస్తాడని మార్కండేయుడు తెలుసుకుంటాడు.  ఈ విధంగా మహా విష్ణువు మాయను తెలుసుకున్నాడు మార్కండేయుడు.    

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)