Blogger Widgets

మంగళవారం, డిసెంబర్ 29, 2015

పంకజాక్షులు సొలసిపలికి

మంగళవారం, డిసెంబర్ 29, 2015

|| పంకజాక్షులు సొలసిపలికి నగగా- | నింకా నారగించు మిట్లనే అయ్యా ||
|| కలవంటకములు పులుగములు దుగ్ధాన్నములు | పలుదెరగులైన అప్పములగములు |
నెలకొన్ననేతులును నిరతంపుచక్కెరలు | గిలుకొట్టుచును నారగించవయ్యా ||

|| పెక్కువగునై దంపుపిండివంటలమీద | పిక్కిటిలు మెఱుగుబొడి బెల్లమును |
వొక్కటిగ గలుపుకొని వొలుపుబప్పులతోడ | కిక్కిరియ నిటు లారగించవయ్యా ||

|| కడుమధురమైన మీగడపెరుగులను మంచి- | అడియాల వూరుగాయల రుచులతో |
బడిబడిగ నవకంపు బళ్ళెరంబులతోడ | కడునారగించు వేంకటగిరీంద్రా ||

సోమవారం, డిసెంబర్ 28, 2015

పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై 13

సోమవారం, డిసెంబర్ 28, 2015

పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము :
పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరుచీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పది తలలను హేలగా చిగుళ్ళు త్రుపినట్లు త్రుంపి పారవేసిన శ్రీ రాముని గానముచేయుచూ  పోయి మనతోడి పిల్లలందరును వ్రత క్షేత్రమును చేరినారు. లోపల ఉన్న తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులు కలదానా !
లేడిచూపులు వంటి చూపులు కలదానా ! శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు . పక్షులు కిలకిల కూయుచున్నవి . కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా అవగాహన మొనర్చి స్నాన మోనర్పక పాన్పుపై ఏల పడుకున్నావు. ఓ సుకుమార స్వభావురాలా! ఈ మంచి రోజున నీవు నీకపటమును వీడిచి మాతో కలసి ఆనందము అనుభవింపుము.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)