Blogger Widgets

Sunday, March 22, 2009

"నిను వినా " రఘువరా !

Sunday, March 22, 2009

రామ లక్ష్మణులు - సీత గురించి అడవులన్నీ వెదుకుతున్నారు . వారికి దారిలో విపరీతముగా దాహము వేసింది. ఒకచోట వారికి మంచినీటి కొలను కనిపించింది. రామలక్ష్మణులు వారి ధనస్సులను గట్టుమీద వుంచి, చేతులు లో వున్న బాణాలను నీటితో తడిపిన నేలమీద గుచ్చివుంచారు. నీటిలోనికి దిగి దాహము తీర్చుకొని తరువాత ధనస్సులను వారు భుజములకు తగిలించుకున్నారు. నేల మీద గుచ్చిన బాణాలను పైకి లాగారు. రాముని బాణానికి చివర రక్తపు మరకలున్నాయి. అది రాముడు చూసాడు. ఆ రక్తపు మరక ఎక్కడిదని పరిసీలించాడు. ఆ స్థలాన్ని పరిసీలించాడు రాముడు. అక్కడ బాణము గుచ్చిన ప్రదేశములో గాయపడి రక్తముతో తడిసిన ఒక కప్ప కనబడింది. రామచంద్రుడు ఆ కప్పతో " అయ్యో పాపం! నా బాణము గృచ్చుకుంది. అయితే అది నీ వీపుకు తగిలనప్పుడు ఎందుకు నన్ను ఆపలేదు, అని అడిగాడు రామచంద్రుడు . దానికి ఆ కప్ప. "రామా ! నాకేదైనా కష్టము వస్తే "రామా రక్షించు" అని మొర పెట్టుకుంటాను. కానీ ఆ రాముడే నన్ను భాధపెట్టినప్పుడు నేను ఇంకెవరితో చెప్పగలను? ఎవరిని రక్షించమని అడగను? ఆ భాధకూడా నా శ్రీ రాముని ప్రసాధముగానే భావించి ఊరుకున్నాను "అని అంది ఆ కప్ప.
చూసారా! కప్పయొక్క శరణాగత తత్వము. మనము కూడా అట్టి శరణాగత తత్వాన్ని అలవరచుకోవాలి.

5 comments:

 1. క్షమించండి శ్రీ వైష్ణవి గారు,

  ఇక్కడ మీరు ఏమి ఇతరులు నేర్చుకోవాలనుకుంటున్నారో నాకయితే అర్థం కాలేదు.....

  కష్టాలను ఓర్చుకునే గుణమా?........కష్టాలకు కృంగి పోగూడదు కాని వాటికి లొంగి ఉండకూడదు కదా....తీర్చే ప్రయత్నం చేసి తీరాలి....

  అంతా భగవంతునిపై వేయాలనే భక్తి మార్గమా?......మనం కర్మను చేయకుండా అన్నీ అతనిపై వేయమని అతను చెప్పలేదనుకుంటాను...నీవు చేయాల్సినది చేసి...ఆపై దాని ఫలితాన్ని నాకు ఒదిలేసేయ్...అంటే ఫలమేమయినా ఒకటిగానే స్వీకరించు అని అనుకుంటాను.

  ఏది జరిగినా అది భగవంతుని దయే అనే భక్తి మార్గమా?....అది కూడా మొత్తం అసలయిన భక్తి మార్గం కాదనుకుంటాను...."శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు" అంటే అర్థం సంఘటన ఎందుకు జరిగింది అనే దుఃఖంతో కృంగిపోగూడదు అని మాత్రమె కాని ....దాని నివారణోపాయాన్ని మాని ఉండమని అర్థం కాదనుకుంటాను.

  ఇందులో నాకు తట్టని ఇంకో కోణమేమయినా ఉందేమో .....మీరు చెపుతే వినాలని ఉంది.

  ReplyDelete
 2. నమస్కారం uncle. మీరు కామెంట్ ఇచ్చినందుకు చాలా సంతోషము. నాకు సంబంధించిన వరకు ఇది కధ. నాకు అందులో విషయాలు లోపలికి ఆలోచించే వయస్సు నాకు లేదు. అయితే ఈ కధ మా అమ్మ చెప్పింది. ఎవరినీ తెలిసికానీ , తెలియక కానీ భాదించకూడదు అని. చెప్పింది. తెలియక శ్రీ రాముడు కప్పని భాధ పెట్టాడు. అది తెలిసిన తరువాత భాధ పడ్డాడు. తప్పు చేసాను అనుకున్నాడు. ఎంతో ఇష్టమైన రాముడు తనను కావాలని భాదించలేదని కప్పకి తెలుసు అందుకే అది ఎదిరించలేదు. దాని భాధ అదే భరించింది.
  ఇది చిన్న పిల్లలకు చెప్పేకధలు పుస్తకాలలోనివి . నాకు నచ్చింది. అందుకే post చేసానండి.

  ReplyDelete
 3. వైష్ణవీ, కథ బావుంది తల్లీ!

  ReplyDelete
 4. క్షమించు చిన్నారి!

  చిన్న పిల్లవన్నది గమనించకుండా అడిగేశాను....మమూలుగా బ్లాగు రాసే వాళ్ళ ప్రొఫైల్ చదవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను...వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద నా అభిప్రాయాలు వాళ్ళు చెప్పే విషయాల పై ప్రభావం చూపిస్తాయని...అక్కడ మిస్ అయ్యానన మాట నువ్వు ఒకటో తరగతి చదువుతున్న పాపాయివన్న సంగతి! రియల్లీ సారీ.

  ఇక నువ్వు చెప్పిన సమాధానం బావుంది....మనిషి ఒకోప్పుడు ఎక్కడో లోతుల్లోకి చూడటానికి ప్రయతిస్తూ పైకే కనిపిస్తున్న దానిని మిస్ చేసుకుంటాడు అన్నది అనుభవం అయింది.

  దీర్ఘాయుష్మాన్ భవ!

  ReplyDelete
 5. నమస్కారం అంకుల్! మీరు పెద్దవారు క్షమించమని అనకండి.నేను పెద్దదానిని అనుకునేకదా అడిగారు . so మీరు అడగడంలో తప్పులేదు. మీకు మరోసారి thanks reply ఇచ్చినందుకు. bye uncle.

  ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers