
ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల
ఏతుల నాడేటిక్రిష్ణుడీతడే కాడుగదా
కందువ దేవకి బిడ్డగనెనట నడురేయి
అంది యశోదకుకొడుకైనాడట
సందడించి పూతకిచంటిపాలు తాగెనట
మందల ఆవులగాచి మలసెనట
మంచిబండి దన్నెనట మద్దులు విరిచెనట –
ఇంచుకంతవేల కొండయెత్తినాడట
మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట –
మించుల పిల్లగోవివట్టి మెరసెనటా
కాళింగుని మెట్టెనట కంసు( బొరిగొనెనట –
పాలించి సురల చేపట్టెనట
యీలీల శ్రీవేంకటాద్రి నిరవైనదేవుడట –
యేలెనట పదారువేల ఇంతుల నిందరిని

శిరముపై కమనీయ శిఖి పింఛముల వాడు
ReplyDeleteచెవుల కుండల దీప్తి చెలువు వాడు
నుదుటిపై కస్తూరి మృదు తిలకముల వాడు
ఉరమున కౌస్తుభం బొలయు వాడు
నాసాగ్రమున గుల్కు నవ మౌక్తికము వాడు
కరమున వేణువు మెరయు వాడు
చర్చిత మైపూత హరి చందనము వాడు
గళమున ముత్యాల కాంతి వాడు
తరుణ గోపికా పరి వేష్ఠితముల వాడు
నంద గోపాల బాలు డానంద హేల
లీల బృందావనము రాస కేళి దేల
వచ్చు చున్నాడు కన్నుల భాగ్య మనగ .
super andi
Deleteకెమ్మోవి చిరునగవు రూపుడతడు
ReplyDeleteకమ్మానుకొను మురళి దాసుడతడు
అమ్మలెల్లరుకును ముద్దు బిడ్డడతడు
నమ్మగ జన ప్రియ బాంధవుడతడు
దేవతలకే దేవ దేవుడతడు
దశ దిశల మార్చు దశావతారుడతడు
సిద్ధించు కైవల్య నాదుడతడు
కీర్తించి జనులార కొలువరెపుడు
కెమ్మోవి చిరునగవు రూపుడతడు
Deleteకమ్మానుకొను మురళి దాసుడతడు
అమ్మలెల్లరుకును ముద్దు బిడ్డడతడు
నమ్మగ జన ప్రియ బాంధవుడతడు
దేవతలకే దేవ దేవుడతడు
దశ దిశల మార్చు దశావతారుడతడు
సిద్ధించు కైవల్య నాదుడతడు
కీర్తించి జనులార కొలువరెపుడు
చాలా అద్భుతంగా వుందండి. ధన్యవాధములు మీకు .
కృతజ్ఞతలు...
Deletewith regards...