వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము: భగవంతుని దర్శించుటకు వెళ్ళేవారు భాగత్ప్రాప్తి కోసం కొన్ని నియమాలు పాటించాలని. శ్రీ కృష్ణుడు అవతరించిన ఈ లోకములో పుట్టి దు:ఖమైన ఈ లోకములో కూడా భగవదనుగ్రహముచే ఆనందము అనుభవించుచుతున్న వారలారా! మేము మా వ్రతమునకు ఏర్పరచుకోనిన నియామాలు వినండి. పాలసముద్రములో పడుకొని నిద్రించుతున్న పరమాత్మ యొక్క పాదపద్మాలకు మంగళము పాడతాము. మేము ఈవ్రతము చేసినంతన కాలమున నీటిని కానీ పాలను కాని అనుభవించము. తెల్లవారుజాముననే నిదురలేచి చల్లనినీటినే స్నానము చేసెదము. కళ్ళకు కాటుకను అలంకరించము. తలకు పరిమలబరితమగు పూలదండలను ధరించము. మా పెద్దలు విడిచిపెట్టిన చేడుపనులు మేము ఆచరించము. ఇతరులకు బాధ కలిగే మాటలు కానీ, అసత్యాలను కాని ఎప్పుడూమాటాడము. ఇతరులకు హానికలిగించము. ఇతరులకు హానిలాగే ఆలోచనలు చేయము. ఙ్ఞానసంపన్నులైన మహాత్ములను ధనధాన్యాదులచే ఎక్కువ సత్కారిచుదుము. బ్రహ్మచారులకు బిక్షుకలుకు బిక్షపెట్టేదము. భగవంతుని కళ్యాణ గుణాలను కీర్తించేదము. గురువు ను పరబ్రహ్మగా భావించాలని మన పెద్దలు చెప్పారు కదా అందుకే గురువులను పూజించి ఆచార్య కృపపోందేదము. వ్రతనీయమాలు ఏ రీతిగా చెప్పబడినవో ఆవిధంగా పాటిద్దాం అనుకున్నారు. శ్రీ కృష్ణుని పొందుదాము.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.