Blogger Widgets

శుక్రవారం, సెప్టెంబర్ 05, 2008

ఎందుకు చెప్పండి ????????

శుక్రవారం, సెప్టెంబర్ 05, 2008

నేను ఈమధ్య గొంగలి పురుగును చూసాను. అది ఇల్లు కట్టుకొని అన్ధులో ఉంది. నాకు చాలా డౌట్లు వచ్చాయి.
మా అమ్మమ్మ ని అడిగా. అవేకాదు కప్పలు, పురుగులు, కీటకాలు. అలా గూడు కట్టుకొని కొన్ని రోజులు వుండి బయటకు వస్తాయని. గొంగళి పురుగు అయితే బటర్ ఫ్లయ్ గా మారుతుందని చెప్పింది.
నేను అడిగాను : మరి లోపల ఆకలి వెయ్యదా అని అవిలోపల ఇన్నాళ్ళు తిన్న ఆహారం తో భతుకుతాయని చెప్పింది . అవి గూడు లో వున్నన్ని రోజులూ వాటిలో వున్నా కొవ్వును కరిగించుకొని జీవిస్తాయని చెప్పింది.
అయితే నాకు రాత్రి నాకు కొన్ని డౌట్లు వచ్చాయి. అవి ఏంటంటే ..................
మరి అవి కప్పలూ,కీటకాలలాగా మనమెందుకు అలా నిద్రపోము, అలా ఆహారం తినకుండా వుండగలమా. వుంటే అంతరిక్షంలో వుడటానికి యూజ్ అవుతుందా. అన్నట్టు ఇంకోటి అవి గాలి లేకుండా ఎలా వుంటున్నాయి మనకు కూడా అలా అయితే మనం అంతరిక్షంలో కి తీసుకు వెళ్లక్కరలేదు కదా. మీరూ నా ఫ్రెండ్స్ కదా అందుకే మీరు చెప్పండి . ఒకే మరి మీ ఆన్సర్ కోసమ్ ఎదురు చూస్థూ శ్రీ వైష్ణవి. బాయ్ బాయ్.

గురువారం, సెప్టెంబర్ 04, 2008

గురువులకే గురువు

గురువారం, సెప్టెంబర్ 04, 2008

హలో నేనే శ్రీ వైష్ణవి ని . మా స్కూల్ లూ టీచర్స్ డే జరుపుకుంటున్నాము . మా అమ్మమ్మను నేను అడిగాను అసలు టీచర్స్ డే అంటే ఏమిటి? అప్పుడు మా అమ్మమ్మ చెప్పింది. గువులకేగురువు ఐన సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్ డే ని టీచర్స్ డే గా జరుపుకుంటామని చెప్పింది. ఉపాద్యాయవృతి నుండి భారత రాష్ట్రపతిగా నియమితులై అపదవికే వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అందుకే గురువులకే గురువు అయ్యారుఅని చెప్పింది.
అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం వున్నా సర్వేపల్లి ౧౮౮౮ సెప్టెంబర్ ౫ తేదిన మద్రాస్ రాష్ట్రంలో తిరుత్తని వీరస్వామి సీతమ్మ రెండో సంతానం. వీరస్వామి ఊరు నెల్లూరు లో సర్వేపల్లి. ఇంటి పేరు సర్వేపల్లి అని వచ్చింది. సర్వేపల్లికి చిన్నప్పుడే రామాయణం,భగవత్గీత శ్లోకాలు పలికేవాడట. ఏకసంథాగ్రాహి గా పేరు వచ్చింది త. అయన మంచి గురువుగా పేరు తెచుకున్నారు అందుకే గురువులకే గురువు.

సోమవారం, సెప్టెంబర్ 01, 2008

హ్యాపీ వినాయక చవితి & టీచర్స్ డే

సోమవారం, సెప్టెంబర్ 01, 2008



ఈబొమ్మ నేను వేసాను టీచర్ వినాయకుడు బాగున్నాడా.
అందరి కీ ముందు గానే వినాయక చవితి కీ మరియు టీచర్స్ డే కు శుభాకాంక్షలు. ఓకే బాయ్........ బాయ్................సి యూ .



సాదు శ్రీ vaishnavi

వినాయక చవితి కదా .......అందుకే

అందరికీ వందనములు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు . మనమందరం ప్లాన్ చేద్ధామ్ ముందుగా వినాయకుడి బొమ్మ ను కొనకుండా మనమే తయారు చేద్దాం ఇప్పుడు బయటదోరికే బోమ్మలు లు rasaayanala తో తయారు అయ్యేనవి అవి మంచిది కాదు . నిమర్జనం చేసాక అవి నీటిలో జీవులకు అపకారం చేస్తాయట మా అమ్మమ్మ చెప్పింది . పార్వతీదేవి నలుగుపిడితో వినాయకుడిని చేసిందిట చాలారోజులుక్రితం మన్నుతో చేసేవారట ఇప్పుడు మన్ను
దొరకదు అందుకే ఇలా చేద్దాం :
ముందుగా నలుగు పిండిని తీసుకొని దానికి నీరుకలిపి ముద్దలా చేసి వినాయకుడిని చేద్దాం .దానికి నగలు కావాలి కదా అందుకు మన ఇంటిలో వున్న గింజలు, పప్పులూ ,ఆవాలు , మిరియాలు, కుంకుమకలిపిన బియ్యం తో అలంకరించవచ్చు మనవినాయకుడు రెడీ ఈవిగ్రహానికి పూజ చేసాకా నిమర్జనం చేస్తి పర్యావరణం కు మనవంతు హెల్ప్ చేసినట్టు అవుతుంది .ఎలా అంటే నీటి లో జీవులకు మనపిండి వినాయకుని వల్ల ఆహారం దొరుకుతుంది + రసాయనాలతో కలుషితం నుండి కాపాడినవారం అవుతాము . ప్లీజ్ పర్యావరణం మన అందరిది మన దాన్ని మనం కాపాడుదాం .
సరే ఇక పూజ వినాయకునికి పత్రాలతో పూజ చెయ్యాలి వాటివల్ల మనకు వర్షాకాలం లో వచ్చే రోగాలనుడి రక్షించే గుణాలు వున్నయిట. ఆపత్రాల గాలి మంచిదట .
ఇక నివేద్యం: వర్షాకాలంలో చాలా జగ్రతగావుందాలిట్ అందుకే ఆవిరిమీద వండిన వంటలు దేవుడికి పెట్టి
అవీ మనం తింటాం. మా అమ్మమ్మ ఇలాంటివి చాలా చెప్పింది. మీకు కొన్ని వంటలు చెప్పనా. ఒకే మరి................
ముందు రోజు పనసాకులు తెచ్చుకొని వాటిని చీపురు పుల్లలతో బుట్టల కుట్టాలి వాటిని పండుగరోజు కడిగి రుబ్బిపెట్టుకొని వున్న ఇడ్లీ పిండితో నింపి ఆవిరిమీద వుడికించాలి ఇడ్లిలే కాని పత్రహరితంతోకుడిన ఇడ్లీ అన్నమాట. ఇది ఆరోగ్యానికి మంచిదట.ఐతే దీనికి కొబ్బరి చెట్నీ,కాని పల్లి చట్ని కాని చాలాబాగుంటుంది. ఇలా చాలావున్నయట్ తరవాత ఎప్పుడుఅయేనా చెప్తా. ఒకే నా వినాయక చవితి బాగాజరుపుకోండి.
పర్యావరణాన్ని. ఆరోగ్యాన్ని పరిసరాలని కాపాడుదాం ఇది మన అందరి బాద్యత.
మరి వుంటా బాయ్..........బై.....................

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)