అందరికీ వందనములు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు . మనమందరం ప్లాన్ చేద్ధామ్ ముందుగా వినాయకుడి బొమ్మ ను కొనకుండా మనమే తయారు చేద్దాం ఇప్పుడు బయటదోరికే బోమ్మలు లు rasaayanala తో తయారు అయ్యేనవి అవి మంచిది కాదు . నిమర్జనం చేసాక అవి నీటిలో జీవులకు అపకారం చేస్తాయట మా అమ్మమ్మ చెప్పింది . పార్వతీదేవి నలుగుపిడితో వినాయకుడిని చేసిందిట చాలారోజులుక్రితం మన్నుతో చేసేవారట ఇప్పుడు మన్ను
దొరకదు అందుకే ఇలా చేద్దాం :
ముందుగా నలుగు పిండిని తీసుకొని దానికి నీరుకలిపి ముద్దలా చేసి వినాయకుడిని చేద్దాం .దానికి నగలు కావాలి కదా అందుకు మన ఇంటిలో వున్న గింజలు, పప్పులూ ,ఆవాలు , మిరియాలు, కుంకుమకలిపిన బియ్యం తో అలంకరించవచ్చు మనవినాయకుడు రెడీ ఈవిగ్రహానికి పూజ చేసాకా నిమర్జనం చేస్తి పర్యావరణం కు మనవంతు హెల్ప్ చేసినట్టు అవుతుంది .ఎలా అంటే నీటి లో జీవులకు మనపిండి వినాయకుని వల్ల ఆహారం దొరుకుతుంది + రసాయనాలతో కలుషితం నుండి కాపాడినవారం అవుతాము . ప్లీజ్ పర్యావరణం మన అందరిది మన దాన్ని మనం కాపాడుదాం .
సరే ఇక పూజ వినాయకునికి పత్రాలతో పూజ చెయ్యాలి వాటివల్ల మనకు వర్షాకాలం లో వచ్చే రోగాలనుడి రక్షించే గుణాలు వున్నయిట. ఆపత్రాల గాలి మంచిదట .
ఇక నివేద్యం: వర్షాకాలంలో చాలా జగ్రతగావుందాలిట్ అందుకే ఆవిరిమీద వండిన వంటలు దేవుడికి పెట్టి
అవీ మనం తింటాం. మా అమ్మమ్మ ఇలాంటివి చాలా చెప్పింది. మీకు కొన్ని వంటలు చెప్పనా. ఒకే మరి................
ముందు రోజు పనసాకులు తెచ్చుకొని వాటిని చీపురు పుల్లలతో బుట్టల కుట్టాలి వాటిని పండుగరోజు కడిగి రుబ్బిపెట్టుకొని వున్న ఇడ్లీ పిండితో నింపి ఆవిరిమీద వుడికించాలి ఇడ్లిలే కాని పత్రహరితంతోకుడిన ఇడ్లీ అన్నమాట. ఇది ఆరోగ్యానికి మంచిదట.ఐతే దీనికి కొబ్బరి చెట్నీ,కాని పల్లి చట్ని కాని చాలాబాగుంటుంది. ఇలా చాలావున్నయట్ తరవాత ఎప్పుడుఅయేనా చెప్తా. ఒకే నా వినాయక చవితి బాగాజరుపుకోండి.
పర్యావరణాన్ని. ఆరోగ్యాన్ని పరిసరాలని కాపాడుదాం ఇది మన అందరి బాద్యత.
మరి వుంటా బాయ్..........బై.....................
సోమవారం, సెప్టెంబర్ 01, 2008
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)
hai sree vaishnavi. గూడ్ గెర్ల్. నీ ఐడియ చాలా బాగుంది. ఒక ఐడియ పర్యావర్ణన్నాన్ని మార్చుతుంది .ఇప్పటి చిన్న మార్పు రేపటి పెద్దమార్పుకావాలి. ఒకే నువ్వు చెప్పినట్టు చేసేద్ధాం.
రిప్లయితొలగించండి