Blogger Widgets

శుక్రవారం, డిసెంబర్ 19, 2008

తిరుప్పావై 5 వ పాశురం - భగవద్ సంబందము

శుక్రవారం, డిసెంబర్ 19, 2008

ఆండాళ్ తిరువదిగల్ శరణం :
మన గోపికలు అందరు మన ఆండాళ్ గోపిక పిలుపు విని ఆమెని అనుసరించి ఒక చోట చేరారు . వారిలో కొందరు వేదాలు తెలిసినవారు . మరి కొందరు పురాణాలు తెలిసినవారు. మరి కొందరు నాట్య కళ తెలిసినవారు. . మరి కొందరు సంగీతము తెలిసినవారు. మరి కొంతమంది కి ధర్మ శాస్త్రము తెలుసు. అందులో కొంతమందికి చాలా డౌట్లు వచ్చాయి. వారు అంటారు. మనము జ్ఞానము లేనివారం కదా? మనము తెలిసి తెలియక చాలా పాపాలు చేసే వుంటాము కదా? మరి ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా ఎన్నో జన్మలనుమ్ది సంపాదించిన పాపాలు వుంటాయి కదా. మనకు మన పాపాలు తోలగానిదే మనకు కృష్ణ భాగవానిని కృప కలుగుతుందా. అని ప్రశ్నిం చుకొన్నారు .
ఒక్కొక్క గోపిక ఒక్కొక రకముగా మాట్లాడుతున్నారు.
మరి శాస్త్రము తెలిసిన గోపిక : "నిజమే మనము చేసిన పాపములు మనము అనుబవిమ్చినా తీరవు. ఈ పాపాలు తీరంది పరమాత్మను చేరలేము. లేక ఒక ఉపాయమున్నది మన పాపాలకు మనమే ప్రాయశ్చిత్తము చేసుకున్నా మనము పరమాత్మ వద్దకు చేరచ్చు. చాలా మంది ఋషులు తపస్సు లు పూజలు చేసి ఫలము అండలేక పోయారు. అందుకే " శ్రేయాంసి బహువిఘ్నాని " అని అన్నారు. కావున మన పాపాలు పోవుటకు మన గోదాచేప్పిన వ్రతమును అనుసరించుదాము.
పురాణాలు తెలిసిన మరో గోపిక రామాయణము గురించి వివరించింది . స్వయముగా భగవంతుడే కష్టాలు పడినాడు . మన లాంటివారికి మరి పాపాలు తొలగి వ్రతము సాగునా అని ప్రశ్నిం చింది .
లోకములో దైవము మానవ రూపమున శిష్ట రక్షణకు అనుభవించవలసి వచ్చినది. ఇది కేవలము దైవ లీలమాత్రమే.
ఈ వ్రతము వల్ల నిస్సంకోచముగా మన పాపాలు తొలగును . వేదంతము తెలిసిన గోపిక : మనము చేయు కర్మలు 2 అవి పుణ్యాలు , పాపాలు . పుణ్యము సుఖాన్ని , పాపము దుఖాన్ని ఇస్తాయి. మనము చేసే పుణ్యాలు పరమాత్మకు దగ్గరకు చేరుస్తాయి . వెనువెంటనే మన పాపాలు పోతాయి.
దూది పింజ నిప్పు తగిలినవెంతనే ఎలా బూడిద అవుతుందో అలాగే మన పాపాలు భగవంతుని దరి చేరగానే నసించుతాయి అని చెప్పింది. కావున ఈ వ్రతము మనకు మంచేచేయును అని వ్రతానికి ఉపక్రమించారు మన గోపికలు.
ఈ తిరుప్పావై లో గోదామాత వేదాల సారాన్ని వివరించింది.
మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము : ఆశ్చర్యమగు చేష్టలు కలిగిన వాడు, నిత్యము భగవద్ సంబందము గల ఉత్తర దేసమందలి మధురా నగరికి నిర్వాకుడును, పవిత్రమైన జలముగల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడును, గోపవంసమున ప్రకాశించిన మంగళ దీపము అయిన వాడును, యశోదా మాత చె తాడు తో బంధింపబడిన శ్రీ కృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించి మన పూర్వ సంచిత పాపరాసియు . ఆగామి పాపరాసియు , అగ్నిలో పడిన దూది వలె భాస్మమైపోవును. కావున భగవానుని నామాలు పాడుడు.

మన పాపాలు తొలగుటకు ఎనిమిది పుష్పాలు అర్పించాలి అవి . 1 అహింస , 2 ఇంద్రియనిగ్రహము ,
౩ సర్వభూతదయ , 4 క్షమా , 5 జ్ఞానము , 6 తపస్సు , 7 సత్యము , 8 ధ్యానము

ఇవి విష్ణు ప్రీతి కరమైన పుష్పాలు . వీటి తో పూజించి మంచి పాటలతో కీర్తించిన భగవంతుని కృప పొందవచ్చు అని భావము.

1 కామెంట్‌:

  1. వైష్ణవి గారూ, చాలా బాగుంది. రోజూ ఉదయం మా టీవీ లో చిన జీయర్ స్వామి కూడా తిరుప్పావై ప్రవచనాలమీద మాట్లాడుతున్నారు. చిన జీయర్ గూర్చి వేరే చెప్పాలా, చూసి ఆనదించండి, వీలుంటే :)

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)