Blogger Widgets

ఆదివారం, ఫిబ్రవరి 08, 2009

హితోక్తులు నాకు వచ్చాయి .

ఆదివారం, ఫిబ్రవరి 08, 2009

హలో ! నిన్న మా తాత నాకు కొన్ని హితోక్తులు చెప్పారు. ఇవి జీవికాలం పనికి వస్తాయని నాకు నేర్పించారు. అవి ఇవే .
చిన్న చిన్న పనులు సక్రమంగా చేయగలిగితే పెద్ద పెద్ద పనులు సమర్దవంతముగా చేయగలము .
నీ మాటలను నువ్వు గౌరవించు కుంటే ప్రపంచము నీ మాటలను గౌరవించుతుంది.
ఒక అబద్ధము కప్పిపుచ్చుకుంటే వంద అబద్ధాలు ఆడాలి, అందుకే అసలు అబద్ధము ఆడకూడదు.
శరీరములో రక్తము ప్రవహిస్తున్నట్లే సమాజంలో ధనం ప్రవహించాలి దానం . ధనము ఏ ఒక్కరి వద్ద పెద్ద మొత్తములో నిలువ ఉన్నా , అది దేశాభివృద్ధి కి తోడ్పడదు.
శరీరంలో రక్తం కొన్ని చోట్ల ఆగితే శరీరానికే ప్రమాదం. ధనం సమాజంలో కొద్ది మంది దగ్గరే దాగితే అది సమాజానికే ముప్పు దేశానికే ప్రమాదము.
కృషితో నాస్తి దుర్భిక్షం .( కృషి వల్ల దుర్భిక్షం ఉండదు.)
సర్వేజనా సుఖినో భవంతు ! (అందరు సుఖముగా ఉందురు గాక.)
యతో ధర్మస్తతో జయం . ( ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం వుంటుంది.)
సత్యం వద ! ధర్మం చర! ( సత్యం పలకండి - ధర్మం ఆచరించండి )

babaiమరి నేను వుంటాను bye .babai

3 కామెంట్‌లు:

  1. చాలా బాగా చెప్పావురా బంగారు తల్లి..

    అమ్మ నీకు అన్ని చెప్తుందా??నువ్వు మంచి అమ్మాయివి....అన్ని ఇలాగె మీ పెద్ద వాళ్ల దగ్గర అన్ని చెప్పించుకుని నువ్వు మాకు చెప్పు...ఈ రోజే నీ బ్లాగ్ లో వున్నవి అన్ని చదివాను..అన్ని చాల చాల బాగున్నాయి..

    నువ్వు టైపు చేయటానికి ఎంత టైం పడుతోంది?ఎవరన్నా టైప్ చేస్తారా ?

    ఉంటాను

    రిప్లయితొలగించండి
  2. Thank you aunt . నాకు అమ్మా అమ్మమ్మ తాత,మంచి కబురులు చెప్తారు..మీరు నా blog posts చదివినందుకు మరో thanks . నెను type చేయటానికి అమ్మ సహాయపడుతుంది. నేను type చేయటానికి చాలాtime పడుతుంది రోజూ 1/2 గంట type చేసి save చేసి అంతాకలిపి ఒక రోజు post చెస్తాను . అందుకే కొన్ని posts late అవుతాయి. నేను చదువుకోవాలి కదామరి.

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగున్నయ్. మీ బ్లాగ్ కూడా బాగుంది. :)

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)