ఆండాళ్ తిరువడిగలే శరణం :
ఈశ్వరుడే ఉపాయము -ఉపేయము లని నమ్మినవారు గోపికలు. తనను పొందించు సాధనము తానె అని భగవానుని ఉపాయత్వమునమ్దు గలవారే ఈ లేపబడుచున్న గోపికలా.
ఈ పాశురములో లేపబడుచున్న గోపిక , కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరుకంతకు ఆదరణీయుడైయున్నట్లే.యీమె కూడా ఊరులోని అందరి మన్ననలను అందిన పిల్ల. ఈ పాశురములోని నిద్ర పోతున్న గోపిక వంశము వారు భరతుని వంశము చెందినవారు. వీరు అభిజాత్యము -సౌందర్యము - ఐశ్వర్యము కల గోపిక ను ఇందు లెపబడుచున్నది. ఈమె సౌందర్యము ను స్త్రీలె పృశంచించుట విశేషము .
గోపికలందరు కౄష్ణపరతంత్రులే.
పాశురము :
కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
లేగ దూడలు గలవియు, దూడల వలె నున్నవియు నగు ఆవులు మందల నెన్నింటినో పాలు పితుక కలవారును,
శత్రువులను ఎదిరించి బలముతో యుద్దము చేయగలవారును , ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారు తీగ ! పుట్టలోని పాము పడగవలె నున్న నితంబ ప్రదేశము గలదానా! అడవిలోని నెమలివలె అందమైన కేసపాసముతో ఒప్పుచున్నదానా! రమ్ము. చుట్టములును, చెలికత్త్లును మొదలుగా అందరును వచ్చిరి. నీ ముంగిట చేరిరి , నీలమేఘవర్ణుడగు శ్రీ కృష్ణుని నామమును కీర్తించుచుండిరి. కీర్తిమ్చుచున్నా ఉలకవేమి. ఓ సంపన్నురాలా లే మేలుకో అని గోపికలు మేలుకోల్పుతున్నారు .
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.