Blogger Widgets

శనివారం, సెప్టెంబర్ 21, 2013

"సంపూర్ణ ప్రపంచ శాంతి వర్థిల్లాలి"

శనివారం, సెప్టెంబర్ 21, 2013

ఈ రోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవం (International Day of Peace) ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన జరుపుకుంటాయి. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల పొందుట కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఎటువంటి అల్లర్లు , ఘర్షన్లు కేకుండా శాంతియుత జీవనానికే ప్రజలందరూ ఇష్టపడతారు.
శాంతి పావురాలను  ఎగరవేసి శాంతిపట్ల తమకు గల విశ్వాసాన్ని చూపిస్తున్నారు. ప్రపంచ శాంతికోసం అంతర్జాతీయ స్థాయిలో అనేక సమావేసాలు జరుపుతారు . వ్యక్తులు , సంస్థలు ,దేశాలు ప్రపంచశాంతికోసం తమవంతు ప్రయత్నాలు , ఆచరణీయ కార్యక్రమాలు చేపట్టడానికి ఉద్దేశించిన రోజుగా భావిస్తారు . ప్రపంచము మొత్తం మీద 60 దేశాల ప్రజలు విరాళంగా ఇచ్చిన నాణేలతో ఒక పెద్ద "శాంతి గంట"ను తయారుచేసి "యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ జపాన్" వారు ఐ.రా.స.కు బహూకరించారు. న్యూయార్క్ లోని ఐ.రా.స. కేంద్ర కార్యాలయం ఆవరణలోని వెస్ట్ కోర్ట్ తోటలో ఈ గంటను ఏర్పాటుచేశారు. ప్రతి సంవత్సరం శాంతి దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ఈ గంట మ్రోగించిన తర్వాత దీని సమీపంలోనే నిర్వహిస్తారు.  ప్రతి ఏటా సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్షణల్లో మునిగి తేలుతున్నప్పటికీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ శాంతికోసం పలు కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటి. ప్రపంచానికి శాంతి అవసరం గురించి ప్రబోధించే ఈ మహా దినం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో శాంతి ఘంట మోగిస్తారు. ఆ గంటపై ఇలా రాసి ఉంది. "సంపూర్ణ ప్రపంచ శాంతి వర్థిల్లాలి" .  కాలం గడిచేకొద్దీ అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిజంగానే ప్రపంచ వ్యాప్త స్వభావాన్ని సంతరించుకుంటోంది. ప్రతిదేశంలోనూ ఈ ఉత్సవాన్ని సంభరంగా జరుపుకుంటున్నారు. ఆవిర్భావము : 1981లో సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా కోస్టారికా సమర్పించిన తీర్మానం ప్రకారం ప్రతి ఏటా సెప్టెంబర్ 21ని ప్రపంచ శాంతి దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రకటించింది. సర్వత్రా శాంతియుత భావాలను బలోపేతం చేయడానికి గాను ప్రపంచ శాంతి దినం అంకితమవుతుంది. తొలి ప్రపంచశాంతి దినాన్ని 1982 సెప్టెంబర్ లో నిర్వహించారు . 2002 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 21 వ తేదీని అంతర్జాతీయ శాంతి దినోత్సవ్ నిర్వహణకు శాశ్విత తేదిగా ప్రకటిండం జరిగింది .  ప్రపంచ దేశాల మధ్య శాంతి ఒడంబడికపై సంతకాలు జరిగిన 50వ సంవత్సరంగా కూడా 2008 సెప్టెంబర్ 21 చరిత్రలో నమోదవుతోంది. ఈ సంవత్సరం ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పునస్కరించుకుని మహాత్మా గాంధీ అహింసా పురస్కారానికి ప్రపంచ స్థాయిలో తొలిసారిగా రెవరెండ్ ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టూటూ ఎంపికయ్యారు.
ప్రపంచ శాంతిని పాదుకొల్పడంలో డెస్మండ్ టూటూ చేసిన అవిరాళ కృషిని గుర్తించిన ' ది జేమ్స్ మాడిసన్ యూనివర్శిటి (జేఎమ్‌యూ)' లోని మహాత్మా గాంధీ ప్రపంచ స్థాయి అహింసా కేంద్రం ఆయనకు పురస్కారాన్ని అందించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 21న వర్జీనియాలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని అందచేయాలని నిర్ణయించారు. 
ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవడానికి  ఒక క్యాండిల్ వెలిగిస్తే చాలు  లేదా మౌనం గా కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేసినా చాలు ... ప్రజలకు ఈ ప్రపంచ శాంతి యొక్క ఆవశ్యకతను వివరిస్తే చాలు. 
 "సంపూర్ణ ప్రపంచ శాంతి వర్థిల్లాలి" 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)